Tumgik
day2daychat · 2 years
Text
Mahabharat: మ‌హాభార‌త్ సీరియ‌ల్ భీమ్ క‌న్నుమూత‌....
Tumblr media
ఒక‌ప్పుడు దూర‌ద‌ర్శన్‌లో పాపుల‌ర్ సీరియ‌ళ్ల‌లో ఒక‌టి మ‌హాభార‌త్‌. ఈ సీరియ‌ల్ వ‌స్తుంది అంటే అంద‌రూ టీవీల‌కు అతుక్కుపోయేవారు.
Tumblr media
మ‌హాభార‌త్ సీరియ‌ల్‌లో ప్ర‌తి ఒక్క‌రి పాత్ర గుర్తుండిపోయే విధింగా చిత్రీక‌రించారు. కాగా, ఈ సీరియ‌ల్‌లో భీముడి పాత్ర‌ను పోషించిన వ్య‌క్తి ప్ర‌వీణ్ కుమార్ సోబ్టీ. మ‌హాభార‌త్ తో పాటు ప‌లు సినిమాల్లో కూడా న‌టించారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది ప‌డుతూ ఈరోజు క‌న్నుమూశారు. ప్ర‌వీణ్ కుమార్ మృతి ప‌ట్ల దూర‌ద‌ర్శ‌న్ సంతాపం తెలియ‌జేసింది. Viral: భావి త‌రాల కోసం… బీఆర్ చోప్రా ద‌ర్శ‌క‌త్వంలో రూపోందిన మ‌హాభార‌త్ సీరియ‌ల్ దూర‌ద‌ర్శ‌న్‌కు ఎంత‌గానో పేరు తెచ్చిపెట్టింది. ఆరోజుల్లో రామాయ‌ణం, మ‌హాభార‌త్ వంటి సీరియ‌ళ్ల‌కు బుల్లితెర ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టిన సంగతి తెలిసిందే. Read the full article
0 notes
day2daychat · 2 years
Text
Covid19: భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు... పెరిగిన మ‌ర‌ణాలు...
Tumblr media
దేశంలో క‌రోనా కేసులు భారీగా త‌గ్గాయి. వారం రోజుల క్రితం వ‌ర‌కు రోజుకు లక్షల సంఖ్య‌లో కేసులు న‌మోద‌వ్వ‌గా ఇప్పుడు ఆ సంఖ్య భారీగా త‌గ్గింది.
Tumblr media
గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో 67,597 క‌రోనా కేసులు న‌మోద‌వ్వ‌గా 1188 మంది మృతి చెందారు. క‌రోనా కేసులు త‌గ్గుతున్నా మృతుల సంఖ్య పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. అయితే, క‌రోనా సెకండ్ వేవ్ లో ఉన్న తీవ్ర‌త లేక‌పోవ‌డం కాస్త ఊర‌ట‌నిచ్చే అంశం. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,80,456 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం క‌రోనాతో 5,02,874 మంది మృతి చెందారు. ఇక దేశంలో 9,94,891 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
Daily Astrology: తిథి…మంచి చెడు
దేశంలో ప్ర‌స్తుతం పాజిటివిటీ రేటు 5.02 శాతంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 170,21,72,615 వ్యాక్సిన్ డోసుల‌ను అందించారు. వ్యాక్సినేష‌న్‌ను వేగంగా అమ‌లు చేయాల‌ని, దేశవ్యాప్తంగా 100శాతం వ్యాక్సినేష‌న్‌ను పూర్తి చేయాల‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేసింది. దేశంలో వ్యాక్సిన్ కొర‌త లేక‌పోవ‌డంతో ప్ర‌స్తుతం ప్రైవేటు ఆసుప‌త్రుల్లో కూడా వ్యాక్సిన్ అందిస్తున్నారు. Read the full article
0 notes
day2daychat · 2 years
Text
అంగ‌రంగ వైభ‌వంగా టీఆర్ఎస్ ప్లీన‌రీ...
Tumblr media Tumblr media
టీఆర్ఎస్ పార్టీ 20వ వార్సికోత్స‌వ స‌మావేశాలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్నాయి.  పార్టీని స్థాపించి 20ఏళ్లు పూర్తైన సంద‌ర్భంగా పార్టీ పెద్ద ఎత్తున ప్లీన‌రీని ఏర్పాటు చేసింది.  హైద‌రాబాద్‌లోని హెచ్ఐసీసీలో ఈ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసింది.  సుమారు 6 వేల మంది ప్ర‌తినిదులు ఈ ప్లీన‌రీకి వ‌స్తున్నారు.  న‌గ‌రంలో ఎటు చూసినా గులాబీ క‌టౌట్లే క‌నిపిస్తున్నాయి.  ఈ ప్లీన‌రీకి వ‌చ్చే అతిధుల కోసం 500 రకాల రుచుల‌తో కూడిన ఆహారప‌దార్థాల‌ను త‌యారు చేశారు.  తెలంగాణ సంస్కృతి సంప్ర‌దాయాల‌ను ప్ర‌తిబించేలా వంట‌కాలు ఉన్నాయి.  ఇక ఉద‌యం పార్టీ అధ్య‌క్షుడి ఎన్నిక ఉంటుంది.  ఈసారి కూడా పార్టీ అధ్య‌క్షుడిగా కేసీఆర్ నియ‌మితులైనారు.  కాగా, ప్లీన‌రీలో ఏడు అంశాల‌తో కూడిన ఏక‌గ్రీవ తీర్మానాలు చేయ‌బోతున్నారు.  హుజురాబాద్ ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌టంతో ఈ ప్లీన‌రీకి ప్రాధాన్య‌త సంత‌రించుకున్న‌ది. Read the full article
0 notes
day2daychat · 2 years
Text
అరుణాచ‌లం వెళ్తున్నారా... ఈ విష‌యాలు త‌ప్ప‌క తెలుసుకోండి
Tumblr media Tumblr media
1. అరుణాచల గిరి ప్రదక్షిణ చేసే వారు ఎక్కడ నుంచి మొదలు పెడతారు అక్కడికి చేరుకోవడంతో నే గిరిప్రదక్షిణ పూర్తి అవుతుంది ' రాజగోపురం దగ్గరి నుంచి నడక మొదలు పెట్టి తిరిగి అక్కడికి చేరుకోవడం ఈ ప్రదర్శన పూర్తి అవుతుంది అని భావించకండి . మీరు ఎక్కడినుంచి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టిన కచ్చితంగా అక్కడ ఒక వినాయకుని గుడి అయినా ఉంటుంది . అక్కడ స్వామికి నమస్కరించి మొదలుపెట్టవచ్చు ' 2. గిరిప్రదక్షిణ అనేది కచ్చితంగా ఎడమవైపున మాత్రమే చేయాలి " కుడివైపున అరుణగిరి కి దగ్గరలో ఉండే కుడి మార్గం లో  సూక్ష్మరూపంలో యోగులు ' సిద్ధులు ' దేవతలు ప్రదక్షిణలు చేస్తారట . అందువలన కుడివైపున ప్రదక్షిణ చేయరాదు . 3. ఆరుణాచలం వెళ్లే ప్రతి వారు కచ్చితంగా పది రూపాయల నోట్లు వీలైనంత ఎక్కువ తీసుకుని వెళ్ళండి . ఎందుకంటే ప్రతి ఆలయంలో పది రూపాయలు దక్షిణగా వేసిన ప్రతి భక్తునికి విభూది ప్యాకెట్ లు ఖచ్చితంగా ఇస్తారు . 4 . దర్శనానికి గిరిప్రదక్షిణ కి వెళ్లేటప్పుడు రెండు చిన్న చిన్న డబ్బాలను తీసుకుని వెళ్ళండి . ప్రతి ఆలయంలో ఇచ్చే విభూది ఆ చిన్న డబ్బాలలో తీసుకోవచ్చు . 5. ఎముకలు అరిగి పోయిన వారు యమ లింగం దగ్గర ఇచ్చే విభూతి ఔషధంగా తీసుకుంటే దాని ఫలితం అమోఘం అని చెబుతారు . 6. నైఋతి లింగం దగ్గర మంత్ర సాధన చేసుకునేవారు కచ్చితంగా  అక్కడ జపం చేసుకుంటే వెయ్యి రెట్లు ఫలితం ఉంటుంది ' ఏ మంత్రము లేనివారు పంచాక్షరి మంత్రాన్ని జపించుకోవచ్చు . 7. ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు గాని ' మధ్యలో గాని ఎక్కువ ఆహారం తీసుకుని మొదలు పెట్టవద్దు " భుక్తాయాసం వలన అడుగులు ముందుకు పడవు . ఖాళీ కడుపుతో చేసే గిరిప్రదక్షణ వేగవంతంగా ఉంటుంది . 8. సమూహంగా గిరి ప్రదక్షిణ చేసే కంటే ఏకాంతంగా చేసే గిరిప్రదక్షణ చాలా ప్రశాంతంగా అద్భుతంగా ఉంటుంది . నా స్వానుభవం . 9. గిరి ప్రదక్షిణ చేసే సందర్భంలో ఎక్కువసార్లు కూర్చోవడం వలన నరాలు పట్టి నడక వేగం తగ్గిపోతుంది ' మాక్సిమం కూర్చోకుండా నిలబడి గానీ ' తప్పనిసరి పరిస్థితుల్లో  బెంచీపై పడుకోండి " కూర్చోవడం వలన చాలా ఇబ్బందులు ఉంటాయి . 10 . కరోనా అనంతరం కొబ్బరికాయలు పట్టుకొని  దర్శనానికి వెళ్లే వారు ' అరుణాచలేశ్వరుని దర్శనం అనంతరం బయటకు వచ్చిన తర్వాత ఎడమవైపు కార్నర్లో స్వామి వారి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి . అక్కడ మీరు ఇచ్చిన కొబ్బరికాయలు కొట్టి గోత్ర నామాలు చదివి విభూతి ప్రసాదంగా ఇస్తారు . లేకపోతే అక్కడ ఖచ్చితంగా మీ గోత్రనామాలు చదవరు. 11. ఆలయ ప్రాంగణంలోకి మనం అడుగుపెట్టిన తర్వాత ఎడమవైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది . కచ్చితంగా దర్శనం చేసుకోండి . 12. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పెద్దపెద్ద పిల్లర్లతో అతి పెద్ద మండపం ఉంటుంది ' ఆ మండపంపై కి వెళ్లి కొంచెం ముందుకు వెళితే పాతాళ లింగం ఉంటుంది . రమణ మహర్షి వారు  అక్కడే తపస్సు చేసారు . 13.రాజ గోపురానికి కుడివైపున అనుకొని ఒక పెద్ద స్టేజ్ లాగా ఉంటుంది . అది అరుణాచలేశ్వరుని ఆస్థాన ఏనుగు బృందావనం . 14 ' ఉత్తరం వైపు ఉండే ప్రధాన గోపురం నుంచి ఒకసారి వెళ్లి రావాలని శాస్త్రం ' అది ఇది మహా భక్తురాలైన అమ్మాణి అమ్మన్‌ అని ఆవిడ కట్టించిన గోపురం . 15. రెండవ ప్రాకారానికి ఎడమవైపున అతిపెద్ద కాలభైరవుని విగ్రహం గల ఆలయం ఉంటుంది .తప్పకుండా దర్శనం చేసుకోండి . 16 ' అదే ప్రాంగణంలో కుడివైపున మారేడు చెట్టు ఉండి దాని క్రింద రాతితో చెక్కిన అతి పెద్ద త్రిశూలం ఉంటుంది . అద్భుతః 17. అమ్మవారి ఆలయంలో కూడా పది రూపాయల దక్షిణగా వేస్తే అమ్మవారి కుంకుమ ప్రసాదం ఇస్తారు . 18 ' అగ్ని లింగానికి ' రమణ మహర్షి ఆశ్రమానికి మధ్యలో దక్షిణామూర్తి ఆలయం ఉంటుంది . చాలా పెద్ద విగ్రహం ' అత్యంత శక్తివంతమైన విగ్రహం ' అరుణాచల శివుడిని దక్షిణామూర్తి స్వరూపంగా కొలుస్తారు . ఒకవేళ మీరు గురువారం రోజున అక్కడ ఉంటే ఖచ్చితంగా దీపం వెలిగించండి . పదిరూపాయలకు శెనగల దండ అమ్ముతారు . మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అన్ని శెనగల దండలను స్వామివారికి సమర్పించండి . అవి స్వామి వారి మీద వేస్తారు . 19. శివసన్నిధి రోడ్ లో కొంచెం ముందుకు వెళ్లి కుడివైపు తిరిగితే రామ్ సూరత్ బాబా ఆశ్రమం ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది . ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది .  రమణ మహర్షి వారి ఆశ్రమంలో కి మల్లె ఇక్కడ కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి . ఇక్కడ ఉదయం టిఫిన్ ' మధ్యాహ్నం భోజనం ఉచితంగా పెడతారు . విదేశీయులు కూడా సామాన్యులతో పాటు లైన్ లో ఉండి ప్రసాదం స్వీకరిస్తారు . ఒకసారి అక్కడి ప్రసాదం స్వీకరించండి 20 . ఆడి అన్నామలై కి దగ్గరలో ' అర్ధనారీశ్వర టెంపుల్ వెనుక మన తెలుగు వారి ఆశ్రమం ' అన్నపూర్ణ దేవి ఆశ్రమం ఉంది . ఇక్కడ పెట్టి భోజనం ఒక్కసారైనా కచ్చితంగా తిని తీరవలసిందే ' అన్నపూర్ణమ్మ ప్రసాదం కదా అద్భుతంగా ఉంటుంది . మన తెలుగు వారిది కదా ఆదరణ ఎక్కువ ! Read the full article
0 notes
day2daychat · 2 years
Text
మ‌డి అంటే అర్థం ఏంటి? వేదం ఏం చెబుతున్న‌ది...
Tumblr media Tumblr media
మన హిందూ సాంప్రదాయంలో మాత్రమే ఉన్న ఒక పరమ పవిత్ర ఆచారం మడి కట్టుకోవటం. అదేమిటో తెలియక అది ఒక ఛాందస ఆచారమని ఆడిపోసుకొనే వారూ మనలో లేకపోలేదు. కాని అది ఒక ఆరోగ్యవంతమైన, శుచి శుభ్రతలకు సంబంధించిన ఆచారమేకాని, చాదస్తం ఎంతమాత్రం కాదు. మన ఆచారాలు మనం పాటించాలి,వాటిని వదిలివేయరాదు.మన ఆచారాలను వదిలి చేసే ఏ ఆరాధనలు మనకు ఫలించవు. ఆచార హీనం నపునంతి వేదాః అని ఆర్ష వాక్యం. ఆచార హీనున్ని వేదములు కూడా పవిత్రున్ని చేయలేవు అని దానర్ధం. అందుకే అందరం మన సనాతన సాంప్రదాయాలను పాటిద్దాం.ఒకసారి ఇది సమగ్రంగా చదవండి. మడికట్టుకోవటం అంటే ఏమిటో ఒకసారి తెలుసుకుందాం మనలో చాలామంది పెద్దవారికి ఈ విషయాలు తెలిసే ఉండచ్చు. కాని ఇది ఇప్పటి ఆధునిక పోకడలో కొట్టుకుపోతున్న నవ యువత కోసం ఈ వివరణ. అంతే మడి అంటే ఏమిటి ? మడి అంటే శారీరక శౌచము. ( ధర్మ దేవతకు సత్యము, శౌచము, తపస్సు, దయ అనునవి నాలుగూ నాలుగు పాదములు. ) శౌచము లేక శుభ్రత అనునది శారీరకము, మానసికము అని రెండు విధములు. శారీరక శౌచము లేకుండా గృహస్థునకు మానసిక శౌచము కలుగదు. సర్వసంగ పరిత్యాగులకు మాత్రం ఇది వర్తించదు. కనుక నిత్య జీవనములో మానసికంగా శౌచము కలుగ వలెనన్న ముందు అన్ని వర్ణాలవారూ ఈ మడిని పాటించి తీరాలి. నేడు అనేకమందికి అసలు మడి ఎలా కట్టుకోవాలి అన్నదే తెలియదు. కనుక కొద్దిగా తెలిపే ప్రయత్నం చేస్తున్నాము. మడి ఎలా కట్టుకోవాలి ? రేపు మడికి కట్టుకోవాలనుకున్న పంచ లేక చీరలను ఈ రోజు ఉదయం పూటే ఆరవేయాలి. లేదా ఏరోజుకారోజు ఆరేసినది ఉత్తమం. ఉతికి జాడించి, తరువాత మనము స్నానముచేసి, తడిబట్టతో శుభ్రమైన బావి లేక మోటరు నీటితో మరల తడిపి, పిండి దండెముల మీద ఇంటిలో గానీ లేక ఆరు బయట గానీ ఎవరూ తాకకుండా ఆర వేయవలెను. ( ఒకవేళ చిన్నపిల్లలు, తెలియని వారు ఆ గదిలోకి వచ్చినా ఎవరూ ముట్టుకోకుండా ఉండటానికి ఇప్పటికీ కొన్ని ఇళ్లలోపల అందనంత ఎత్తులో ఓ గోడకు దండెము వంటి కఱ్ఱలు వ్రేలాడుతూ ఉంటాయి. వాటిపై కఱ్ఱతో ఈ బట్టలు ఆరవేస్తారు. ) మరునాడు ఉదయాన్నే మరలా స్నానము చేసి తడిగుడ్డ తో వచ్చి ఆరిన మడి బట్టలను తెచ్చుకొని గోచీ పోసి కట్టుకోనవలెను. మడి కట్టుకొన్న తరువాత ఇక ఎలాంటి మైల వస్తువులను తాక కూడదు. తాకితే మరలా స్నానము చేసి మరలా వేరే మడి బట్ట కట��టుకొని వంట లేక పూజ చేయవలెను. మడితోనే సంధ్యావందనము, నిత్యానుష్ఠానములు, పూజ మొదలైనవి చేసి భగవంతునికి నైవేద్యము పెట్టి, ఆ మడి తోనే భోజనము చేయాలి. ఆ తరువాత మడి వదలి మైల తాకుతారు. (ఇది ఉత్తమమైన మడి) శ్రాద్ధాది క్రతువులకు తడి బట్టతోనే వంట చెయాలి. చనిపోయినప్పుడు చేసే కర్మకాండలు తడి బట్టతో మాత్రమే చేయాలి. కానీ పూజాదికాలకు తడిపి ఆరవేసిన బట్టమాత్రమే మడి. నీళ్లోడుతున్న తడి బట్ట పనికిరాదు. మడి బట్ట లేనప్పుడు ధావళి కట్టుకోవచ్చు. లేదా పట్టుబట్ట కట్టుకోవడము మూడో పద్ధతి. పట్టు బట్టతో గాని, ధావళితో గాని భోజనము చేయకూడదు. ధావళితో అస్సలు పనికి రాదు. ఒక వేళ చేస్తే పట్టు బట్టతో మరలా తడిపి మడిగా ఆరవేసి కట్టుకోవలెను. పట్టుబట్టను కట్టుకొని వంట వండి, నైవేద్యము అయిన తరువాత మరలా జాగ్రత్తగా ఎవ్వరూ తాకకుండా పెట్టుకొని, మరలా ప్రక్క రోజు వాడుకోవచ్చు. అయితే ప్రతి అమావాస్యకు తడిపి ఆరవేయవలెను. లేకపోతే పట్టుగుడ్డలు మడికి పనికిరావు. ధావళి కట్టుకొని పూజించడము పట్టుబట్ట కంటే శ్రేష్టము. పట్టుబట్టలో కొంత దోషము వున్నది, అదే జీవహింస, కావున కొంతమంది దానిని త్యజిస్తారు. కావున శ్రేష్టము నూలుగుడ్డ. ద్వితీయ పక్షం ధావళి. అదికూడా కుదరనిచో (స్వచ్ఛమైన) పట్టువస్త్రము. మగవాళ్ళు పంచను లుంగి లాగ కట్టుకొని గానీ, ఆడ వాళ్ళు చీరను పావడా తో గాని కట్టుకొని దైవ కార్యములు చేయకూడదు. కారణము జననేంద్రియములు ఆచ్ఛాదనం లేకుండా వుండ కూడదు. కావున మగవాళ్ళు గానీ, ఆడవాళ్ళు గానీ గోచీ పోసిమాత్రమే పంచ లేక చీర కట్టుకోవలెను. పంచ లేక చీరమాత్రమే ఎందుకు కట్టవలెను అంటే ఏక వస్త్రముతో కూడిన దానిని మాత్రమే ధరించాలి. కత్తిరించింనవి ముక్కలు చేసి కలిపి కుట్టినవి వైదిక క్రతువులలో పనికరావు. మడితో పచ్చళ్ళు మడితో వడియాలు మడితో పాలు పెరుగు నెయ్యి వుంచడం అనేది పూర్వపు ఆచారం. ఇవన్నీ చాలా వరకు నేడు పోయినాయి. కానీ నేటితరం యువతీ యువకులలో పరమేశ్వరుని అనుగ్రహంచేత కొద్దికొద్దిగా మన సనాతన సాంప్రదాయ పద్ధతులపై ఆసక్తి పెరుగుతున్నది. ఆసక్తికలిగినవారు నిర్లిప్తత పారద్రోలి క్రమక్రమం మార్పుకు సిద్ధపడాలి. మరలా ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నము చేయాలి అందరము. మనము ఆచరించి, అందరికీ చూపించి ఆదర్శం అవ్వాలి. మనల్ని మనము కాపాడుకోవాలి. ఒక్క సారి మడి కట్టి చూడండి దానిలోని ఆనందము స్వచ్ఛత పరిశుభ్రత దైవత్వం అనుభవము లోకి వస్తాయి. నేటికీ కొంత మంది ఎంత కష్టం వచ్చినా మడి లేని ఇంట భుజించరు. బయటి వస్తువులు స్వీకరించరు. Read the full article
0 notes
day2daychat · 2 years
Text
సదాశివ శక్తిధారిణి.. శివాసనధారిణి.  
Tumblr media Tumblr media
ఓం.. ఓం .. ఓం .. ఓంకారం నుంచి ఉద్బవించినది.. ఈశ్వరనామం ఆ నామమే.. తపము తరియించి పోగా.. కాలచక్రమే.. అల్లకల్లోమవ్వగా... అదిగో ఆ అమన్మదుడే.. ఆనతించి ఆ బానమేయగా.. ఆగ్రహించే నా శివుడు.. భస్మమే చేసేనాశివుడు.... ఓం ... ఓం విషయమే తెలిసి.. భస్మమే..భాద్రాసుడుడిగా మలిచినే.. అసుర అసుర అసుర.. భాద్రాసుర.. పదునాలుగు భువనాలను.. భయపెట్టేనా భద్రుడు.. ఆట కట్టించగా నాతనిని తుద ముట్టించగా.. సకల దేవతలా ఆర్తిని ఆలకిన్చేనా అంబా.. జగద్రక్షకమూర్తి లలితాంబా.. చిదగ్ని కుండం నుంచి ఉద్బవించిన అంబా.. బాండాసురుడు అంతమే అంతిమ లక్ష్యంగా.. ముక్కంటి కంటి కన్న అసురుని అంతమే లక్ష్యంగా ఉద్బవించినది త్రిలోక సుందరి ఆ లలితా సుందరి.. సర్వారుణా సుందరాంగి  సర్వాభరణ భూషితాంగి సర్వేశ్వరీ సర్వశక్తిమయీ సర్వమంగళా సద్గతిసర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణీపద్మాసనా భగవతీ పద్మనాభ సహోదరీఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ లలితా దేవి.. త్రిపురాదేవి.. త్రిగుణాల శ్రీదేవి భగభగమండే సూర్యుడే కర్ణభరణమైవెన్నెలనొసగే చంద్రుడే..కర్ణభరణమై కణకణమండే అగ్నిదేవుడు.. తళతళ మెరిసే ఇంద్రదేవుడు.. రాతలు రాసే బ్రహ్మదేవుడు.. గీతలు మార��చే విష్ణుదేవుడు.. ఆయుధాలుగా అవతరించగా.. ఉగ్రస్వరూపిణి.. అంబా.. మహోగ్ర రూపిణి...సహస్రాయుదాలనే ధరియించేరా.భద్రాసురుడినే మట్టుపెట్టేరా.. లోకానికి రక్ష ఇచ్చేరా ..సృష్టి స్థితి లయకారిణి... లావణ్యస్వరూపిణి సదాశివ శక్తిధారిణి.. శివాసనధారిణి.. సాయిబాబా... Read the full article
0 notes
day2daychat · 2 years
Text
శ్రీశైలంలో పునఃప్రారంభ‌మైన గిరిప్ర‌ద‌క్షిణ
Tumblr media Tumblr media
శ్రీశైలంలో గిరిప్ర‌ద‌క్షిణను తిరిగి ప్రారంభించారు.  ప్ర‌తి పౌర్ణ‌మిరోజున శ్రీశైలంలో భ‌క్తులు గిరిప్ర‌ధ‌క్షిణ చేస్తుంటారు.  అయితే, క‌రోనా కార‌ణంగా ఏడు నెల‌ల క్రితం గిరి ప్ర‌ధ‌క్షిణ‌ను నిలిపివేశారు.  కాగా, ఇప్పుడు మ‌ర‌లా తిరిగి గిరి ప్ర‌ద‌క్షిణ‌కు ఆల‌య అధికారులు అనుమ‌తించారు.  ఆశ్వాయుజ శుద్ధి పౌర్ణ‌మి రోజుస తిరిగి ఈ గిరి ప్ర‌ద‌క్షిణ‌ను ప్రారంభించినట్టు అధికారులు ప్ర‌క‌టించారు.  ఏడు కిలోమీట‌ర్ల మేర ఈ గిరి ప్ర‌ద‌క్షిణ సాగుతుంది.  ఆల‌య ప్ర‌ధాన ద్వారం నుంచి ప్రారంభించి గంగాధర మండపం, అంకాలమ్మ ఆలయం, నంది మండపం, మల్లికార్జున సదన్, వీరభద్ర దేవాలయం, గోశాల, మల్లమ్మ కన్నీరు, ఔటర్ రింగ్ రోడ్ మీదుగా ఈ ప్ర‌ద‌క్షిణ సాగుతుంది. Read the full article
0 notes
day2daychat · 2 years
Text
పోలీసు అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వ వేడుక‌లు
Tumblr media
Read the full article
0 notes
day2daychat · 2 years
Text
పోలీసుల అమ‌ర‌వీరుల దినోత్స‌వానికి తొలిసారిగా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారీ,ఎస్పీ దీపికలు హాజ‌రు ....!
Tumblr media Tumblr media
పోలీస్ అమ‌ర‌వీరుల దినోత్స‌వం.దేశం కోసం,స‌మాజం కోసం త‌మ ప్రాణాల‌ను తృణ‌ప్రాయంగా పెట్టిన పోలీస్ జ‌వాన్ల స్మృతిని స్మ‌రిస్తూ ప్ర‌తీఏటా పోలీస్ శాఖ నిర్వ‌హిస్తున్న రోజు. అక్టోబ‌ర్ 21 .ఈ పోలీసుల అమ‌ర‌వీరుల దినోత్స‌వానికి  హాజ‌రైన‌ క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారీ,ఎస్పీ దీపికలకు తొలిసారి కావ‌డం విశేషం.ఒక‌రు రాణీ రుద్ర‌మ‌దేవీ..ఇంకొక‌రు ఝాన్సీ ల‌క్ష్మీభాయి అన్న‌చందంగా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారీ,ఎస్పీ దీపిక‌లు...ఇద్ద‌రూ త‌మ‌,తమ శాఖ‌ల‌లో  తీసుకుంటున్న చ‌ర్య‌ల ప‌రంగా చేప‌డుతున్నకార్య‌క్ర‌మాల పరంగా ఒక రకంగా  వ‌ణుకు,మ‌రో ర‌కంగా  శాఖాసిబ్బంది ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.తాజాగా జిల్లా కేంద్రంలోని ప‌రేడ్ గ్రౌండ్ మైదానంలో స్మృతి వ‌నంలో జ‌రిగిన  పోలీసుల అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వంలో ముఖ్యఅతిథిలుగా హాజ‌రై  తాము ఇచ్చిన ప్ర‌సంగాల‌తో పోలీసు జ‌వాన్ల‌లో మ‌రింత స్పూర్తిని నింపారు.స‌రిగ్గా ఉద‌యం 8 గంట‌ల‌కు అనుకున్న స‌మయానికే స్మృతి మైదానానికి ఎస్పీ ,క‌లెక్ట‌ర్లు వ‌చ్చారు. అంత‌కు ముందే ఏఆర్ డీఎస్పీ శేషాద్రి...అతిధుల‌ను సాద‌రంగా ఆహ్వానించారు.శాఖా పరంగా ఎస్పీ  దీపికాకు పోలీసుల అమ‌ర‌వీరుల దినోత్స‌వం గురించి తెలిసినా...విజ‌య‌న‌గ‌రం జిల్లాలో  జ‌రుగుతున్న ఈ దినోత్స‌వానికి తొలిసారిగా హాజ‌ర‌వ్వ‌డం విశేషం.అటు జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారీ కూడ‌...తొలిసారి కావ‌డం కూడా విశేష‌మ‌నే చెప్పాలి.తొలుత ఎస్పీ దీపికా మాట్లాడిన మాట‌లు..సిబ్బందిలో మ‌రింత స్పూర్తిని నింపాయ‌నే చెప్పాలి. సాదార‌ణ ప్ర‌జానీకంతో పాటు సిబ్బంది స‌మ‌స్య‌ల‌ను సావ‌ధానంగా వినేందుకు ప్ర‌తీ వారం స్పంద‌న పెడుతున్న‌ట్టు చెప్పి మ‌రీ...శాఖా  సిబ్బందికి ద‌గ్గ‌రై వాళ్ల‌లో మ‌రింతా వృత్తి పట్ల అంకిత భావం పెంపొందేలా మాట్లాడారు.ఇక క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారీ అయితే...అధికారులంతా గాజు భ‌వ‌నాల‌లో ఉంటున్నామే త‌ప్ప‌...బ‌య‌ట ఉద్యోగాలు చేస్తున్న‌వారిని ఒక్క‌సారి గా గుర్తుకు తెచ్చుకోవటం లేద‌న్న భావం వ‌చ్చే విధంగా త‌న ప్ర‌సంగంలో మాట్లాడారు. ఎండ‌న‌న‌క‌,వాన‌న‌క‌, ఎన్ని అవాంత‌రాలు, ఎన్ని క‌ష్టాలు వ‌చ్చినా రోడ్ల‌మీద ప‌లు కూడ‌ళ్ల‌లో విధులు నిర్వ‌హిస్తున్న వృత్తి గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌న్నారు. ప్ర‌తీ ఒక్క కుటుంబంలో ప్ర‌తీ చిన్న పిల్లాడు పోలీస్  అవుతాన‌ని చెప్ప‌డం  తాను చాలా సంద‌ర్భాల‌లో చూసాన‌ని క‌లెక్ట‌ర్ చెప్ప‌డం విశేషం. ఇక ఈ సారి తొలిసారిగా ప్ర‌జాప్ర‌తినిధుల‌ను పిల‌వ‌డం విశేషం.ఈ క్ర‌మంలోనే  జెడ్పీ చైర్మ‌న్ మ‌జ్జి శ్రీనివాస‌రావు, ఎంఎల్సీలు ర‌ఘువర్మ‌, సురేష్ లు హాజ‌ర‌య్యారు.క‌లెక్ట‌ర్ మాట్లాడుతుండ‌గానే ఎంఎల్సీ ర‌ఘువ‌ర్మ‌...ఓ బాధితురాలిని స్వ‌యంగా వేదిక‌పై ఉన్నఎస్పీ వ‌ద్ద‌కు తీసుకు వెళ్లి స‌మ‌స్య ప‌రిష్కారం చూడాల‌ని విన్న‌వించ‌గా...త‌ప్ప‌కుండా చూస్తాన‌ని చెప్ప‌డం విశేషం. చివ‌రిగా మృతి చెందిన జ‌వాన్ల‌కు మౌనం పాటించాల్సిన స‌మ‌యంలో నిర్దేశించిన స‌మ‌యం పూర్త‌యినా...అంద‌రూ ఇంకామౌనంగా ఉండ‌టంతో..ఏఆర్ అడ్మిన్ చిరంజీవి...డీసీఆర్బీ సీఐ వెంక‌ట‌రావుకు కాస్త సూచ‌న ఇవ్వ‌డంతో  మ‌రో నాలుగు నిమిషాలు పాటు పోలీసు అదికారులంతా మౌనం పాటించారు.ఏదైనా పోలీసులు అమ‌ర వీరుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వం..ఇద్ద‌రు లేడీ బాస్ ల స‌మ‌క్షం ,ఆధ్వర్యంలో జ‌రిగింద‌నే చెప్పాలి. Read the full article
0 notes
day2daychat · 2 years
Text
ఇక నుంచీ ప్ర‌తీ శుక్ర‌వారం శాఖా సిబ్బందికి గ్రీవెన్స్-ఎస్పీ దీపికా
Tumblr media Tumblr media
మనోధైర్యంతో రోడ్ మీద విధులు నిర్వ‌ర్తించే వాళ్ల‌కు శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నా-ఫ‌స్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అక్టోబ‌ర్ 21..పోలీస్ అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వం..ఈ రోజును ఎవ్వ‌రూ మ‌ర్చిపోరు అందునా ప్ర‌తీ పోలీస్ సిబ్బందికి గుర్తుండిపోయే రోజు.ఇదే రోజు 1959లో ల‌డాఖ్ లో ప‌దిమంది సీఆర్పీఎఫ్ జ‌వాన్ల మృతికి చిహ్నంగా పోలీసుల అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వం జ‌రుపుకోవ‌డం ఆన‌వాయితీ గావస్తోంది.దేశ‌మంత‌గా ఈ దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్న వేళ‌...ఏపీ రాష్ట్రంలో కూడా పోలీసుల అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వం జ‌రుగుతోంది.ఈ క్ర‌మంలోనే ఉత్త‌రాంద్ర‌లోని విజ‌య‌న‌గరం జిల్లా పోలీస్ ప‌రేడ్ గ్రౌండ్ స‌మీపంలోనే  పోలీసుల స్మృతి మైద‌నాంలో దినోత్స‌వం జ‌రిగింది.ఈ సంద‌ర్బంగా కార్య‌క్ర‌మానికి వ‌చ్చేసిని అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు అంద‌రూ స్మృతి చిహ్నం వ‌ద్ద ఘ‌నంగా నివాళులు అర్పించారు.అంత‌కు ముందు ఆర్మ‌ర్డ్ రిజ‌ర్వు క‌మాండెంట్ రాజ‌శేఖ‌ర్ నుంచీ ప‌రేడ్ స్వాగతం అందుకున్న ఎస్పీ దీపికా మాట్లాడుతూ ఇక నుంచీ సిబ్బంది యోగ క్షేమాల‌పై ప్ర‌తీ శుక్ర‌వారం గ్రీవెన్స్ సెల్ నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు.అలాగే ప్రతీ బుద‌వారం మ‌హిళా సిబ్బందికి గ్రీవెన్స్ సెల్ నిర్వ‌హిస్తామ‌ని ఎస్పీ తెలిపారు.కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా వ‌చ్చిన ఫ‌స్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ,క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారీ మాట్లాడుతూ గాజు బంగ్లాలో మ‌నంద‌రం ఉండి  ప‌ని చేస్తున్నా..మ‌నోధైర్యంతో రోడ్ మీద ఉండి ప‌ని చేస్తున్న పోలీస్ సిబ్బందికి శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నానంటూ జిల్లా క‌లెక్ట‌ర్  సూర్య‌కుమారీ అన్నారు.ఈ సంద‌ర్బంగా అమ‌ర‌వీరుల  సేవలను కొనియాడి, వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా కల్పించి, అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జి జే.శ్రీనివాసరావు, జెడ్పీ చైర్మన్ ఎం.శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ లు పి.. రఘువర్మ,  పి.వి.వి.సూర్యనారాయణ రాజు, ఎస్ ఈ బి అదనపు ఎస్పీ కుమారి ఎన్.శ్రీదేవి రావు, అదనపు ఎస్పీ  పి సత్యనారాయణరావు, ఓఎస్డీ  ఎన్. సూర్యచంద్ర రావు, డిఎస్పీ లు  అనిల్ పులిపాటి,  ఎ.సుభాష్,  ఆర్.శ్రీనివాసరావు, ఎల్.మోహనరావు, టి.త్రినాథ్, .శేషాద్రి మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.అనంత‌రం పోలీసు అమరవీరుల స్మరిస్తూ, వారి సేవలను కొనియాడుతూ న‌గ‌రంలో పోలీస్ కార్యాల‌యం నుంచీ, ఆర్ అండ్ గెస్టు హౌస్ వరకు ర్యాలీ నిర్వహించారు Read the full article
0 notes
day2daychat · 2 years
Text
వినుడు వినుడు వాల్మీకి గాథ
Tumblr media Tumblr media
కరకు బోయడే అంతరించగా కవిగా ఆతడు అవతరించగా.. నవరసభరితం రాముని చరితం జగతికి ఆతడు పంచిన అమృతం...! ఆదికావ్యాన్ని అందించిన ఆదికవి.. భారతీయ సంస్కృతిలో ఎప్పటికీ అస్తమించని రవి.. వాల్మీకి మహర్షి.. పూర్వాశ్రమంలో రత్నాకరుడు ఆ మహర్షి ఆశ్రమమే అయింది అంతటి మహరాణి సీతమ్మకు వనవాసాశ్రమ గుడి.. భూమాత కూతురికి అమ్మ ఒడి.. అచ్చోటనే చల్లారిందట శ్రీరామపత్ని మదిలో అలజడి అదే ఆ తల్లి పిల్లలు కుశలవులకు బడి.. అక్కడ సదా శ్రీరామనామ సవ్వడి.. శ్రీరామభక్తుల సందడి..! మహర్షి వాల్మీకి ఘంటంలో అమృతాన్ని మించిన సిరా అదే శ్రీరామాయణ సిరి.. సృష్టి ఉన్నంతకాలం నిలిచి ఉండే కావ్యం.. నాటికీ నేటికీ ఏనాటికీ రసరమ్యం..నవ్యాతినవ్యం..! వాల్మీకి విరచిత రామాయణంలో పాత్రలు.. ఏ ప్రాయంలోనైనా ఆదర్శప్రాయం.. ఒకే మాట ఒకే బాణం ఒకే పత్ని..రాముని నియమం.. ఇప్పుడదే అయోమయం.. క్షమయా ధరిత్రి.. ఆ ధరిత్రికే పుత్రి తల్లి సీత.. పతి ఆనతి జవదాటని సాధ్వి ఇప్పుడా లక్షణమే అరుదై నివ్వెరపోతున్న పృథ్వి! అగ్రజునిలో జనకుని చూసే అనుజులు.. కలియుగంలో ఆస్తుల కోసం కుమ్ములాడుకుంటున్న దనుజులు.. నేటి తరంలో ఇలా ప్రతి పాత్ర అపాత్రమై.. ఆచారానికే రామాయణం ఆచరణకు డ్రామాయణం.. రామాయణం కల్పితమని కొట్టిపడేసే కొందరికి.. ఇదిగో  ఓ  చిన్నమాట... మీ దృష్టిలో శ్రీరాముడు ఊహైనా వాల్మీకి వాస్తవమే కదా.. రాముని పాత్రే నిజమైన ఇజం.. ఏ యుగానైనా మనిషి ఎలా ఉండాలి.. ఎంత ఉన్నతంగా జీవించాలి రాముని రూపంగా నిర్వచించిన మహర్షి విలువలు పూజ్యమైన నేటి యుగంలో వాల్మీకి ప్రవచించిన రామరాజ్యం.. వాస్తవ సాధ్యమా..!? వాల్మీకి రామాయణం ఏడు కాండలు.. ఇప్పుడున్నది అన్నిటా అరణ్యకాండ.. కొండొకచో కిష్కింద.. ఆపై యుద్ధకాండ.. అంత గొప్పదని కోదండం రాసినందుకు నీకో దండం.. రాముని నీతి..నిరతి.. అనుసరిస్తే..ఆచరిస్తే.. ముష్కరుల ఏలుబడిలో తప్పదు చేతికి అరదండం..! Read the full article
0 notes
day2daychat · 2 years
Text
యాదాద్రి పున‌ర్మిర్మాణానికి ఎంత ఖ‌ర్చు అయిందో తెలుసా?
Tumblr media Tumblr media
వ‌చ్చే ఏడాది మార్చి 28 వ తేదీన యాదాద్రి పునఃప్రారంభం కానున్న‌ది.  జీయ‌ర్ స్వామిజీ ఆల‌య పునఃప్రారంభానికి ముహుర్తం నిర్ణ‌యించారు.  మార్చి 21 నుంచి 8 రోజుల‌పాటు మ‌హా సుద‌ర్శ‌న యాగం జ‌ర‌గ‌నున్న‌ది.  ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌గా విభ‌జ‌న త‌రువాత టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే 2014 అక్టోబ‌ర్ 17 వ తేదీన యాదాద్రి ఆల‌యాన్ని పున‌ర్మిర్మాస్తామని తెలిపారు.  2015 లో ద‌స‌రా రోజున సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆల‌యం పున‌ర్మిర్మాణానికి అంకురార్ప‌ణ జ‌రిగింది.  అప్ప‌టి నుంచి బాలాల‌యంలోనే స్వామివారి ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పిస్తూ వ‌స్తున్నారు.  ఆల‌య నిర్మాణం కోసం తెలంగాణ ప్ర‌భుత్వం రూ.950 కోట్లు ఖ‌ర్చుచేశారు. ఆ ఆల‌యం పున‌ర్ణిర్మాణం కార్య‌క్ర‌మం దాదాపుగా పూర్తికావొచ్చింది.  ఈ ఆల‌యం నిర్మాణం త‌రువాత విమాన గోపురాన్ని ఇప్పుడు స్వ‌ర్ణ‌తాప‌డం చేయిస్తున్నారు.  ఈ స్వ‌ర్ణతాప‌డం కోసం పెద్ద ఎత్తున బంగారం విరాళాలుగా స‌మ‌ర్పిస్తున్నారు నేత‌లు, వ్యాపార‌వేత్త‌లు. Read the full article
0 notes
day2daychat · 2 years
Text
ఆంధ్రప్రదేశ్ లో ఆర్టికల్ 356 అమలు చేయాలని టి.డి.పి డిమాండ్.
Tumblr media Tumblr media
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్న అరాచక పాలనను ప్రశ్నించిన తెలుగుదేశం నాయకులపైన,కార్యాలయలమీద భౌతిక దాడులు చేయాడాని వనపర్తి తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండించింది.జగన్ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా ఉందని ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదాని తెలుగుదేశం పార్టీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకొని ఆర్టికల్ 356 ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించి ప్రతిపక్షాల హక్కులు కాపాదవిధంగా చర్యలు తీసుకోవాలని డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, పట్టణ అధ్యక్షులు బి.రాములు,నందిమల్ల.అశోక్,నందిమల్ల.శారదా,రాష్ట్ర తెలుగుయువత నాయకులు జెమీల్,రవి యాదవ్,ఎం.డి.గౌస్,నందిమల్ల.రమేష్,రాష్ట్ర మైనారిటీ నాయకులు ఎం.డి దస్తగిరి,వహీద్,చిన్నయ్య యాదవ్,ఆవుల.శ్రీను,నాగన్న యాదవ్,ఎం.బాలు నాయుడు,ఖాదర్,డి.బాలరాజు,సతీష్,నరేష్ పాల్గొన్నారు. Read the full article
0 notes
day2daychat · 2 years
Text
Saibaba: శిరిడి సాయిబాబా నిత్య పారాయ‌ణం...
Tumblr media Tumblr media
బాబాగారి సంస్కృత పరిజ్ఞానము 1. భగవద్గీత శ్లోకమునకు బాబాగారి యర్ధము. 2. మహాసమాధి మందిర నిర్మాణము ఈ యధ్యాయములో భగవద్గీతయందుగల ఒక శ్లోకమునకు బాబా చెప్పిన యర్ధమున్నది. కొందరు బాబాకు సంస్కృతము తెలియదనియు అది నానాసాహెబు చాందోర్కర్ యనువారిదనియు ననుటచే హేమాడ్ పంతు 50వ అధ్యాయములో ఈ సంగతిని విశదీకరించెను. రెండధ్యాయములలోను నొకే విషయ ముండుటచే రెండును నిందులో పొందుపరచనైనవి. తొలిపలుకు షిరిడీ పవిత్రమైనది, ద్వారకామాయి గూడ పావనమైనదే. ఏలన శ్రీసాయి యచటనే నివసించుచు, తిరుగుచు, మసలుచు తుదకు అక్కడనే మహాసమాధి పొందిరి. షిరిడీ గ్రామప్రజలు ధన్యులు. వారి సర్వకార్యములను బాబా నెరవేర్చుచుండెను. వారికొరకే చాలాదూరము నుండి యచటకు వచ్చెను. మొదట షిరిడీ చాల చిన్నగ్రామము, సాయిబాబా యచట నివసించుటచే దానికి గొప్ప ప్రాముఖ్యము వచ్చెను. తుదకది పవిత్రమైన యాత్రాస్థల మాయెను. అచటనుండు స్త్రీలుకూడ ధన్యులు. బాబాయందు వారిభక్తి నిస్సంశయముగా పరిపూర్ణమైనది. బాబా మహిమను వారు స్నానము చేయునప్పుడు, విసరునప్పుడు, రుబ్బునప్పుడు, ధాన్యము దంచునప్పుడు, తదితర గృహకృత్యములు చేయునప్పుడు పాడుచుండెడివారు. అవి పాడిన వారికి, విన్న వారికి మనశ్శాంతి కలుగజేయుచుండెను. బాబా చెప్పిన యర్థము బాబాకు సంస్కృతము వచ్చునని నమ్మువారుండరు. ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకమునకు బాబా చక్కని యర్థమును నానా సాహెబు చాందోర్కరుకు బోధించి ఆశ్చర్యము కలుగజేసెను. ఈ విషయమును గూర్చి బి.వి.దేవుగారు (శ్రీ సాయి లీల సంపుటి 4, పుట 563 – స్ఫుట విషయ) వ్రాసినారు. వారు స్వయముగా నానాసాహెబు చాందోర్కర్ వద్దనుంచి కొన్ని సంగతులు తేలిసికొనుటచే ఆ వృత్తాంతము ఈ దిగువ నివ్వబడెను. నానాసాహెబు చాందోర్కర్ వేదాంతమును బాగా చదివినవారు. ఆయన భగవద్గీతను వివిధవ్యాఖ్యానములతో చదివియున్నందున తన పాండిత్యమునకు గర్వించుచుండెను. బాబాకీ విషయముగాని, సంస్కృతముగాని తెలియదని ఆయన అభిప్రాయము. అందుచే ఒకనాడు బాబా యతని గర్వమణచెను. ఆ తొలిరోజులలో భక్తులు గుంపులుగుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయముల దీర్చుటకు నొంటరిగా వారితో మసీదులో మాట్లాడుచుండెను. బాబా దగ్గర నానా కూర్చొని వారి కాళ్ళనొత్తుచు నోటిలో ఏదో గొణుగుకొనుచుండెను. బాబా : నానా ! యేమి గొణుగుచున్నావు? నానా : సంస్కృత శ్లోకమును వల్లించుచున్నాను. బాబా : ఏ శ్లోకము? నానా : భగవద్గీతలోనిది. బాబా : గట్టిగా చదువుము. నానా : (భగవద్గీత 4వ అధ్యాయము, 34వ శ్లోకము ఈ క్రింది విధముగా చదివెను.) “తద్వద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వదర్శినః” బాబా : నానా! అది నీకు బోధపడినదా? నానా : అవును. బాబా : నీకు తెలిసినచో నాకు చెప్పుము. నానా : దాని తాత్పర్యమిది. సాష్టాంగనమస్కారము చేయుట అనగా పాదములపై బడుట, గురుని ప్రశ్నించుట, వారి సేవచేయుట ద్వారా ఈ జ్ఞానమును తెలిసికొనెదము. అప్పుడు మోక్షమును పొందు జ్ఞానముగలవారు అనగా, పరబ్రహ్మమును దెలిసినవారు ఆ జ్ఞానము నుపదేశించెదరు. బాబా : నానా! శ్లోకముయొక్క తాత్పర్యమక్కరలేదు. ప్రతిపదార్థము వ్యాకరణము, మరియు దాని యర్థము చెప్పుము. అప్పుడు నానా ప్రతి పదమున కర్థము చెప్పెను. బాబా : నానా! ఉత్త సాష్టాంగనమస్కారము చేసినచో చాలునా? నానా : ప్రణిపాత యను పదమున కింకొక యర్థము నాకు తెలియదు. ప్రణిపాత యనగా సాష్టాంగనమస్కారమని నాకు తెలియును. బాబా : పరిప్రశ్న యనగా నేమి? నానా : ప్రశ్నించుట. బాబా : ప్రశ్న యనగా నేమి? నానా : అదే, అనగా ప్రశ్నించుట. బాబా : పరిప్రశ్న యన్నను ప్రశ్న యన్నను ఒక్కటే యయినచో, వ్యాసుడు ‘పరి’ యను ప్రత్యయమును ప్రశ్నకు ముందేల యుపయోగించెను? వ్యాసుడు తెలివి తక్కువవాడా? నానా : పరిప్రశ్న యను మాటకు నా కితరయర్థ మేమియు తెలియదు బాబా : సేవ యనగా నెట్టిది? నానా : ప్రతిరోజు మేము చేయుచున్నట్టిది. బాబా : అట్టి సేవ చేసిన చాలునా? నానా : సేవ యను పదమున కింకను వేరే యర్థమేమి గలదో నాకు తోచుట లేదు. బాబా : రెండవ పంక్తిలోని “ఉపదేక్ష్యంతి తే జ్ఞానం” అను దానిలో జ్ఞానమను పదముపయోగించకుండ యింకొకపదము ఉపయోగించ గలవా? నానా : అవును. బాబా : ఏ పదము నానా : అజ్ఞానము. బాబా : జ్ఞానమునకు బదులు అజ్ఞానము ఉపయోగించినచో, ఈ శ్లోకములో నేమైనా అర్థము గలదా? నానా : లేదు. శంకరభాష్యమావిధముగా చెప్పుట లేదు. బాబా : వారు చెప్పనిచో పోనిమ్ము. అజ్ఞానము అనుపదము నుపయోగించిన యెడల తగిన యర్థము వచ్చునప్పుడు దాని నుపయోగించుట కేమైన ఆక్షేపణ కలదా? నానా : అజ్ఞానమను పదమును చేర్చి దాని యర్థమును విశదపరచుట నాకు తెలియదు. బాబా : కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు తత్వదర్శులకు నమస్కారము, ప్రశ్నించుట, సేవ చేయుమని చెప్పనేల? స్వయముగా కృష్ణుడు తత్త్వదర్శికాడా? వారు నిజముగా జ్ఞానమూర్తియే కదా! నానా : అవును, అతడు తత్వదర్శియే, కాని అర్జును నితర జ్ఞానుల నేల సేవించుమనెనో నాకు తోచుటలేదు. బాబా : నీకిది బోధపడలేదా? నానా సిగ్గుపడెను. అతని గర్వమణగెను. అప్పుడు బాబా ఇట్లు వ్యాఖ్యానించెను. 1. జ్ఞానులముందు ఉత్త సాష్టాంగము చేసినచో సరిపోదు. మనము సద్గురువునకు సర్వస్యశరణాగతి చేయవలెను. 2. ఊరక ప్రశ్నించుట చాలదు. దుర్బుద్ధితో గాని, దొంగయెత్తుతో గాని, వారిని బుట్టలో వేయుటకుగాని, వారి తప్పులను పట్టుటకు గాని, పనికిమాలిన యాసక్తితో యడుగకూడదు. నిజముగా తెలిసి దానిచే మోక్షము పొందుటకుగాని, ఆధ్యాత్మికాభివృద్ధికిగాని యడుగవలెను. 3. సేవ యనగా ఇష్టమున్నచో చేయవచ్చును లేనిచో మానవచ్చుననే యభిప్రాయముతో చేయునది సేవకాదు. శరీరము తనదికాదనియు, దానికి తాను యజమాని కాదనియు, శరీరము గురువుగారి దనియు, వారిసేవకొరకే శరీరమున్నదనియు భావింపవలెను. ఇట్లు చేసినచో సద్గురువు శ్లోకములో చెప్పబడిన జ్ఞానము బోధించును. గురు వజ్ఞానమును బోధించుననగా, నానాకు అర్థముకాలేదు. బాబా: జ్ఞానము ఉపదేశ మెట్లగును? అనగా సాక్షాత్కారము బోధించుట యెట్లు? అజ్ఞానమును నశింపజేయుటయే జ్ఞానము. జ్ఞానేశ్వరమహారాజు ఇట్లు చెప్పియున్నారు. ‘అజ్ఞానమును తొలగించుట ఇట్లు. ఓ అర్జునా! స్వప్నము, నిద్ర తొలగిపోయినచో మిగులునది నీవుగా గ్రహింపుము. జ్ఞానమనగా నజ్ఞానమును నశింప జేయుటయే. చీకటిని తరుముటయే వెలుతురు. ద్వైతమును నశింపజేయుటయే అద్వైతము. ద్వైతమును నశింపజేసెద మనగా, అద్వైతమును గూర్చిచెప్పుట. చీకటిని నశింపజేసెద మనినచో, వెలుతురు గూర్చి చెప్పుట. అద్వైతమును పొందవలెననినచో, ద్వైతమను భావమును మనసులోనుంచి తీసివేయవలెను. అదియే అద్వైతమును పొందుజ్ఞానము. ద్వైతములోనే యుండి అద్వైతముగూర్చి మాట్లాడగలవారెవ్వరు? ఎవరైన నట్లు చేసినచో నా స్థితిలోనికి వారు రానిదే వారికి అది యెట్లుతెలియును? దాని నెట్లు పొందెదరు? శిష్యుడు గురువువలె జ్ఞానమూర్తియే. వీరిద్దరికి భేదమేమనగా గ్రహించు తీరు, గొప్ప సాక్షాత్కారము, ఆశ్చర్యకరమైన మానవాతీత సత్యము, మహాశక్తిమత్వము, మరియు ఐశ్వర్యయోగము. సద్గురువు నిర్గుణుడు, సత్చిదానందుడు. వారు మానవాకారమున నవతరించుట, మానవులను లేవనెత్తుటకును ప్రపంచము నుద్ధరించుటకు మాత్రమే. దాని వలన వారి యసలయిన నిర్గునస్వభావము కొంచెము గూడ చెడిపోదు. వారి సత్యస్వరూపము, దైవికశక్తి, జ్ఞానము తరుగకుండ నుండును. శిష్యుడు కూడ నట్టిస్వరూపము కలవాడే. కాని యతని అనేకజన్మల యజ్ఞానము యతని శుద్ధచైతన్యమను సంగతిని కప్పివేయును. అతడు “నేను సామాన్య నికృష్ట జీవుడను.” అనుకొనెను. గురువు యజ్ఞానమును మూలముతో తీసివేయవలెను. తగిన యుపదేశము నివ్వవలెను. లెక్కలేనన్ని జన్మలనుంచి సంపాదించిన యజ్ఞానమును గురువు నిర్మూలించి యుపదేశించవలెను. ఎన్నోజన్మలనుంచి తాను నికృష్టజీవుడ ననుకొను శిష్యుని గురువు “నీవే దైవము, శక్తియుతడవు, ఐశ్వర్యశాలివి” అని బోధించును. అప్పుడు శిష్యుడు కొంచెము కొంచెముగా తానే దైవమని గ్రహించును. తాను శరీరమనియు, తానొక జీవిననియు లేదా యహంకారమనియు, దేవుడు, లోకము తనకంటె వేరనియు తలంచు నిత్యాంతభ్రమ అనేక జన్మలనుంచి వచ్చుచున్న దోషము. దానిపై నాధారపడి చేసిన కర్మలనుండి వానికి సంతోషము, విచారము, ఈ రెంటియొక్క మిశ్రమము కలుగును. ఈ భ్రమను, ఈ దోషమును, ఈ మూల అజ్ఞానమునుగూర్చి అతడు విచారమారంభించవలెను. ఈ ఆజ్ఞానమెట్లు అంకురించినది? అది యెక్కడ నున్నది? అను దానిని చూపుటయే గురుపదేశమందురు. ఈ దిగువ వివరించినవి యజ్ఞానలక్షణములు 1. నేను జీవిని (ప్రాణిని). 2. శరీరమే యాత్మ (నేను శరీరమును). 3. భగవంతుడు, ప్రపంచము, జీవుడు వేర్వేరు. 4. నేను దేవుడను కాను. 5. శరీర మాత్మకాదని తెలిసికొనకుండుట. 6. దేవుడు, జీవుడు ప్రపంచము ఒకటేయని తెలియకుండుట. ఈ తప్పులన్నియు చూపించనిదే, శిష్యుడు దేవుడనగా, ప్రపంచమనగా, శరీరమనగానేమో తెలియజాలడు. వానిలో వానికి ఎట్టి సంబంధము కలదో, ఒకటి యింకొకటికంటె వేరైనదా లేక రెండును ఒకటేనా యను సంగతి గ్రహింపజాలడు. ఈ సంగతులను బోధించుటకు వాని యజ్ఞానము నశింపజేయుటకు చెప్పునది జ్ఞానమా? అజ్ఞానమా? జ్ఞానమూర్తియైన జీవునకు జ్ఞానోపదేశము చేయనేల? ఉపదేశమనునది వాని తప్పును వానికి చూపి వాని యజ్ఞానమును సశింపజేయుటకొరకే’ బాబా యింకను ఇట్లనెను. 1. ప్రణిపాత మనగా శరణాగతిచేయుట, 2. శరణాగతి యనగా తను (శరీరము), మన (మనస్సు), ధనముల (ఐశ్వర్యము) నర్పించుట, 3. శ్రీ కృష్ణుడు అర్జునుని ఇతరజ్ఞానుల నాశ్రయించు మననేల? సద్భక్తుడు సర్వము వాసుదేవమయముగా భావించును. భక్తుడు ఏ గురువునైన శ్రీకృష్ణునిగానే భావించును. గురువు శిష్యుని వాసుదేవుడుగాను, శ్రీ కృష్ణుడు ఇద్దరిని తన ప్రాణము, ఆత్మలు గాను భావించును. అటువంటి భక్తులు గురువులు గలరని శ్రీ కృష్ణునికి తేలిసి యుండుటచే, వారినిగూర్చి అర్జునునికి చెప్పెను. అట్టివారి గొప్పతనము హెచ్చియందరికి తెలియవలెననియే కృష్ణుడట్లు పేర్కొనెను. సమాధిమందిర నిర్మాణము బాబా తాను చేయ నిశ్చయించుకొనిన పనులగూర్చి ఎప్పుడును మాట్లాడువారు కారు. ఏమియు సందడి చేయువారు కారు. సంగతి సందర్భములను వాతావరణమును మిక్కిలి యుక్తిగా నేర్పరిచి తప్పనిసరి ఫలితములు కలిగించుచుండువారు. అందుకు సమాధిమందిర నిర్మాణము ఒక ఉదాహరణము. నాగపూరు కోటీశ్వరుడు, శ్రీమాన్ బాపుసాహెబు బుట్టీ, షిరిడీలో సకుటుంబముగా నుండెడివారు. అతనికి అచట సొంత భవనముండిన బాగుండునని యాలోచన కలిగెను. కొన్నాళ్ళ పిదప దీక్షిత్ వాడాలో నిద్రించుచుండగా అతనికొక దృశ్యము కనిపించెను. బాబా స్వప్నములో నగుపడి యొక వాడాను మందిరముతో సహ నిర్మించుమనెను. బాపుసాహెబు లేచి శ్యామా యేడ్చుచుండుట చూచి కారణమడిగెను. శ్యామా యిట్లు చెప్పెను. “బాబా నా దగ్గరకు వచ్చి మందిరముతో వాడాను నిర్మింపుము. నేను అందరి కోరికలను నెరవేర్చెద ననెను. బాబా ప్రేమ మధురమైన పలుకులు విని, నేను భావావేశమున మైమరచితిని; నా గొంతుక యార్చుకొనిపోయెను. నా కండ్ల నీరు కారుచుండెను. నేను ఏడ్చుట మొదలిడితిని.” వారిద్దరి దృశ్యములు ఒకటే యయినందులకు బాపుసాహెబు బుట్టీ విస్మయమందెను. ధనవంతుడగుటచేతను, చేతనయినవా డగుటచేతను, అచ్చటొక వాడాను నిర్మించుటకు నిశ్చయించుకొని మాధవరావు (శ్యామా) సహాయముతో ఒక ప్లాను వ్రాసెను. కాకాసాహెబు దీక్షిత్ దాని నామోదించెను. కట్టుట ప్రారంభించిరి. శ్యామా పర్యవేక్షణ చేయుచుండెను. భూమ్యుపరి గృహము, భూగృహము, బావి పూర్తియయ్యెను. బాబాకూడ లెండీకి పోవునప్పుడు, తిరిగి వచ్చునపుడు కొన్ని మార్పులను సలహాలను ఇచ్చుచుండెను. మిగిలిన పనియంతయు బాపుసాహెబు జోగును చూడుమనిరి. అది నిర్మించునపుడు, బాపుసాహెబు బుట్టీకి ఒక యాలోచన కలిగెను. చుట్టు గదులుండి, దాని మధ్యనొక విశాలమైన హాలులో మురళీధరుని (శ్రీ కృష్ణుని) ప్రతిమ ప్రతిష్ఠ చేయవలెనని శ్యామాకు చెప్పెను. వాడా ప్రక్కనుంచి బాబా పోవుచుండగా వారిని శ్యామా యీ విషయము నడుగగా బాబా యందు���కు సమ్మతించి “దేవాలయము పూర్తి కాగానే నేనే యచ్చట నివసించుటకు వచ్చెదను” అని వాడా వయిపు జూచుచు “వాడా పూర్తియయిన పిమ్మట మనమే దానిని ఉపయోగించు కొనవలెను. మనమందరమచ్చట నుందుము. అందరు కలసిమెలసి యాడుకొందుము. ఒకరి నొకరు కౌగిలించుకొని సంతోషముగా నుండవచ్చును.” అనెను. దేవస్థాన మధ్యమందిరము కట్టుట కది తగిన శుభసమయమా యని శ్యామా యడుగగా, బాబా సమ్మతించుటచే శ్యామా కొబ్బరికాయ తెచ్చి పగులగొట్టి పనిని ప్రారంభించిరి. కొద్ది కాలములో పని పూర్తి యాయెను. మురళీథర్ విగ్రహము తయారు చేయుట కాజ్ఞాపించిరి. అది తయారు కాకమునుపే క్రొత్త సంగతి జరిగెను. బాబాకు తీవ్రమైన జ్వరము వచ్చెను. వారు కాయమును విడుచుటకు సిద్ధముగా నుండిరి. బాపుసాహెబు మిక్కిలి విచారగ్రస్తుడాయెను; నిరాశపడెను. బాబా సమాధి చెందినచో, తన వాడా బాబా పాదములచే పవిత్రము కాదనియు, తాను మదుపు పెట్టిన లక్షరూపాయలు వ్యర్థమగుననియు చింతించెను. కాని బాబా సమాధి చెందకముందు “నన్ను రాతి మందిరములో నుంచుడు.” అన్నట్టి పలుకు బాపుసాహెబు కేగాక యందరికీ ఊరట కలిగించెను. సకాలమున బాబా పవిత్ర శరీరము మధ్యమందిరములో బెట్టి సమాధి చేసిరి. ఇట్లు మురళీధర్ కొరకు నిర్ణయించిన స్థలమునందు బాబాను సమాధిచేయుటచే బాబాయే మురళీధరుడనియు, బుట్టీ వాడాయే సమాధి మందిరమనియు అర్థము గ్రహించవలెను. వారి విచత్రజీవితము లోతును కనుగొన శక్యము గాదు. తాను కట్టించిన వాడాలో బాబా పవిత్రశరీరము సమాధి యగుటచే బాపుసాహెబ్ బుట్టీ మిగుల ధన్యుడు, అదృష్టశాలి. ఓం నమోః శ్రీ సాయినాథాయ Read the full article
0 notes
day2daychat · 2 years
Text
ఈరోజు ప్ర‌త్యేక‌త ఇదే...
Tumblr media Tumblr media
ఈరోజు ఆశ్వయుజ పూర్ణిమ వ్రతం. సంవత్సరంలో వచ్చే అన్నీ పూర్ణిమ తిథి రోజులలో భక్తులు ఉపవాసం ఉండి, రమా సహిత సత్యనారాయణస్వామి వ్రతం ఆచరిస్తారు. ఈరోజు పూర్ణిమ తిథి, అశ్వని నక్షత్రం చంద్రోదయ (సా.05.52) సమయానికి ఉన్న కారణంగా, ఈరోజు కొంతమంది భక్తులు కౌముది పూజ, కౌముది వ్రతం ఆచరిస్తారు. ఒరిస్సా రాష్ట్రం లో ఈ రోజు కుమార పూర్ణిమ గా, బెంగాల్ రాష్ట్రం లో కోజాగరి పూర్ణిమ పూజ గా అక్కడి భక్తులు జరుపుకుంటారు. ఈరోజు మహర్షి వాల్మీకి జయంతి.రామాయణ మహాకావ్యాన్ని సంస్కృతంలో మొదటిసారి గా వ్రాసిన కవి మహర్షి వాల్మీకి కి ఆదికవి అనే బిరుదు ఉంది. ఈరోజు మీరా భాయి జయంతి. మీరాబాయి(క్రీ. శ 1498- 1547) 1498 లో రాజస్థాన్ లో రాజపుట్ యువరాణి గా జన్మించారు. శ్రీ కృష్ణుడుకి పరమ భక్తురాలిగా మారి, అనేక కీర్తనలు రచించారు. 49 సంవత్సరాల వయస్సులో శ్రీకృష్ణుడి లో ఐక్యం అయ్యారని భక్తుల విశ్వాసం. ఈరోజు అన్వాధానం. వైష్ణవులు ఈరోజు ఉపవాసం ఉండి,రేపు ఇష్ఠి రోజున యజ్ఞం చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో గౌరీ పూర్ణిమ గా జరుపుకుంటారు. గౌరీ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈరోజు లక్ష్మీ ఇంద్ర పూజ. ఈరోజు దేవేంద్ర విరచిత శ్రీ లక్ష్మి స్తోత్రం పారాయణతో లక్ష్మీ పూజ చేస్తారు. ఈరోజు అన్నాభిషేకం. తమిళనాడు లోని ప్రముఖ శివాలయాల్లో శివ లింగానికి అన్నంతో,కూరలతో ప్రత్యేక అభిషేకం చేస్తారు.(తమిళ అప్పాసి మాసం లో పౌర్ణమి రోజు). అశుభ ధనిష్ట పంచకాలు ఈరోజు మ.02.02 కి ముగుస్తాయి. Read the full article
0 notes
day2daychat · 3 years
Text
ఉత్త‌రాఖండ్ ఛార్‌ధామ్‌లో భారీ హిమ‌పాతం...
Tumblr media Tumblr media
ఉత్త‌రాఖండ్‌లో ఒక‌వైపు భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.  భారీ వ‌ర్షాల కారణంగా వాగులు వంక‌లు ఉప్పొంగి పొంగుతున్న సంగ‌తి తెలిసిందే.  ఒకవైపు భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌గా, శీతాకాలం ప్రారంభం కావ‌డంతో ఒక్క‌సారిగా రాష్ట్రాన్ని మంచు క‌మ్మేసింది.  భారీగా హిమ‌పాతం కురిసింది.  బ‌ద్రీనాథ్‌, కేదారినాథ్‌, య‌మునోత్రి, ధ‌ర్‌చులా, మునిసియారీలో భారీగా మంచు కురుస్తున్న‌ది.  వ‌ర్షాల కార‌ణంగా ఇప్ప‌టికే బ‌ద్రీనాథ్ యాత్ర‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.  ఇప్పుడు భారీగా మంచు కురుస్తుండ‌టంతో యాత్ర‌ను పూర్తిగా నిలిపివేసే అవ‌కాశం ఉన్న‌ది.  ప్ర‌తి ఏడాది వేస‌వి ప్రారంభం నుంచి శీతాకాలం ప్రారంభం వ‌ర‌కు ఛార్‌ధామ్ యాత్రకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇస్తుంటారు.  అయితే, క‌రోనా కార‌ణంగా గ‌తేడాది యాత్ర జ‌ర‌గ‌లేదు.  కారోనా త‌గ్గుముఖం ప‌ట్టినా ఇప్పుడు భారీ వ‌ర్షాలు, మంచు కార‌ణంగా మ‌రోసారి అంత‌రాయం ఏర్ప‌డే అవ‌కాశం ఉన్న‌ది. Read the full article
0 notes
day2daychat · 3 years
Text
యాదాద్రిని చూసొద్దాం రండి...
Tumblr media Tumblr media
శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట మండలంలో ఎత్తయిన గుట్టపై ఉన్న ఆలయం. ఇది తెలంగాణలోని ముఖ్య ఆలయాలలో ఒకటి. ఋష్యశృంగ మహర్షి, శాంతల పుత్రుడు యాదమహర్షి. ఈయన చిన్నతనం నుంచే హరి భక్తుడు. ఈయన ఆంజనేయస్వామి సలహా మీద ప్రస్తుతం యాదగిరిగా పిలవబడుతున్న ప్రదేశంలో చాలా కాలం తపస్సు చేశారు. అప్పుడు ఒక రాక్షసుడు ఆహార అన్వేషణలో అటుగావచ్చి నిశ్చల తపస్సులో వున్న ఈ ఋషిని చూసి తినబోయాడు. ఆ విషయం తపస్సులోవున్న ఋషికి తెలియలేదుగానీ, ఆయన ఎపరి గురించైతే తపస్సు చేస్తున్నాడో ఆ హరికి తెలిసింది. ఆయన పనుపున సుదర్శన చక్రం వచ్చి ఆ రాక్షసుని సంహరించింది. అది చూసిన ఋషి ఆ సుదర్శన చక్రాన్ని పలు విధాల ప్రార్థించి, భక్తులకు ఏవిధమైన బాధలూ కలుగకుండా దుష్ట సంహారం చేస్తూ అక్కడే వుండిపొమ్మని కోరగా ఆ సుదర్శనము అనతికాలములోనే అక్కడ వెలయబోవుచున్న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ శిఖరాన షట్కోణాకారాన వెలసి స్వామి దర్శనానికి వచ్చు భక్తులను సదా కాపాడుతూ వుంటానని వరమిచ్చి అంతర్ధానమయ్యాడుట. తర్వాత యాద మహర్షి తన తపస్సుని కొనసాగించాడు. ఆయన తపస్సుకి మెచ్చి నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు. యాద మహర్షి కోరిక మీద అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వెలిశాడు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరుమీద ప్రసిధ్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండక్రిందవున్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయస్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడుగా ఉన్నాడు. యాదగిరి గుట్ట శంఖ చక్ర నామాలు ఈ క్షేత్రానికి సంబంధించి ఇంకొక కథ. ప్రహ్లాదుని రక్షించటానికి, అహోబిలంలో నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఆ భీకర రూపాన్ని శాంత పరచటం ఎవరికీ సాధ్యం కాలేదుట. అప్పుడు దేవతలంతా లక్ష్మీదేవిని ప్రార్ధిస్తే ఆవిడ ప్రత్యక్షమై స్వామిని శాంతింప చేసిందట. అప్పుడు ప్రహ్లాదుడు స్వామిని అక్కడే ప్రసన్న రూపంలో కొలువై వుండమని కోరాడుట. అయితే స్వామి అతి భీకర రూపంలో దర్శనమిచ్చిన ఆ ప్రదేశంలో శాంత రూపంతో కొలువై వుండటం లోక విరుధ్ధమని అక్కడికి సమీపంలో వున్న యాదగిరిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి అర్చామూర్తిగా లోక కళ్యాణార్ధం కొలువు తీరుతానని బయల్దేరారు. లక్ష్మీ సమేతుడై కొండపై గల గుహలో వెలిశారు. ఆయనవెంట ప్రహ్లాదుడూ, సకల దేవతలూ వచ్చి ఆయనతోపాటు ఇక్కడ కొలువుతీరి స్వామిని సేవిస్తూ వచ్చారుట. రాక్షస సంహారంచేసి లోక కళ్యాణం చేశారని సంతోషంతో స్వామివారి కాళ్ళని బ్రహ్మదేవుడు ఆకాశ గంగతో కడిగాడుట. ఆ ఆకాశ గంగ లోయలలోంచి పారి విష్ణు పుష్కరిణిలోకి చేరింది. ఈ పుష్కరిణికి కూడా చాలా ప్రాముఖ్యం ఉంది. ఇందులో స్నానంచేసి స్వామిని సేవించినవారికి సకల కోరికలూ తీరుతాయి. ఇక్కడ పితృకార్యాలు చేస్తే పితృ దేవతలు తరిస్తారు. యాదగిరి గుట్ట మండపం చాలామంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడా నివారణ, వగైరా కోరికలతో కొన్నాళ్ళపాటు ఇక్కడ వుండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు. అంతేగాక ఇప్పటికీ రోజూ రాత్రుళ్ళు ఆ చుట్టుప్రక్కల కొండలమీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానంచేసి స్వామిని అర్చిస్తారు. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పడు మృదంగ ధ్వనులు వస్తాయట. పాదాల గుర్తులు కొందరు చూశారుట. వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనమంటారు. మెట్ల మార్గాన వెళ్తే దోవలో శివాలయం కనబడుతుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభూగా వెలిశాడు. ఇంకో విశేషం .. ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించినవారి కీళ్ళ నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం నల్గొండ జిల్లాలో ప్రముఖ మైన దివ్య క్షేత్రం: యాదగిరి గుట్టకు సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలో ఉంది. విభాండక ఋషి కుమారుడు రుష్యశృంగుడు. అతని కుమారుడు హాద ఋషి. అతనినే హాదర్షి అని కూడా అంటారు. అతను నరసింహ స్వామి భక్తుడు. అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది. ఆంజనేయస్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆ ఉగ్ర నరసింహ మూర్తిని చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని యాదర్షి కోరగా స్వామి వారు కరుణించి లక్ష్మి సమేతుడై దర్శన మిచ్చి "ఏం కావాలో కోరుకో" మంటే యాదర్షి స్వామి వారికి "శాంత మూర్తి రూపంలోనె కొలువై కొండపై ఉండి పొమ్మని కోరాడు. ఆవిధంగా లక్ష్మి నరసింహ స్వామి కొండపై అలా కొలువై ఉండి పోయాడు. కొన్నాళ్ళకు స్వామివారిని వేర్వేరు రూపాల్లో చూడాలనిపించి యాదర్షి మరలా తపస్సు చేశాడు. అతని కోరిక మేరకు స్వామి వారు జ్వాలా, యోగా, నంద, గండబేరుండ, నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచ నారసింహ క్షేత్రం అంటారు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరుమీద ప్రసిధ్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ క్రింద వున్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయస్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడుగా ఉన్నాడు.చాలామంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడా నివారణ, వగైరా కోరికలతో కొన్నాళ్ళపాటు ఇక్కడ వుండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు. అంతేగాక ఇప్పటికీ రోజూ రాత్రుళ్ళు ఆ చుట్టుప్రక్కల కొండలమీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని అర్చిస్తారుట. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పడు మృదంగ ధ్వనులువినిపిస్తాయట. పాదాల గుర్తులు కొందరు చూశారుట. వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనమంటారు. మెట్ల మార్గాన వెళ్తే దోవలో శివాలయం కనబడుతుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభూగా వెలిశాడు. ఇంకో విశేషం .. ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించినవారి కీళ్ళ నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం.యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రములో రెండు లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. పాత లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం.కొత్త లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం. మరొక కథనం ప్రకారం లక్ష్మీ నరసింహస్వామివారు మొదట పాత లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వెలసి తరువాత కొత్త లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయమునకు గుర్రముమీద వెళ్ళేవారు. మనము ఇప్పటికీ ఆ గుర్రపు అడుగులు ఆదారిన చూడవచ్చు. ఈ గుర్తులు పాత లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం నుండి కొత్తలక్ష్మీనరసింహస్వామివారి ఆలయము వరకు ఉన్నాయి. పాత లక్ష్మీనరసింహస్వామి ఆలయంనందు, ఆంజనేయ స్వామి వారి ఆలయము కూడా ఉంది. అక్కడ గోడ మీద ఉన్న చిత్రములు చాలా అద్భుతముగా ఉన్నాయి. అక్కడ నుండి కొత్త లక్ష్మీనరసింహస్వామివారి ఆలయమునకు వెళ్ళు దారిలో ఆంజనేయ స్వామి వారి మరొక ఆలయము కూడా ఉంది. ఈ ఆలయగర్భగుడిలో స్వామివారి వద్ద నిత్యము ఒక జల ప్రవాహము ఉంది. ఆ జలముతోనే నిత్యం స్వామివారికి అభిషేకం చేస్తారు. రాయగిరి రైల్వేస్టేషను ఇక్కడికి చాలా దగ్గరలో ఉంది. యాదగిరి బస్టాండుకు హైద్రాబాదు, వరంగల్, నల్గొండల నుండి చాలా బస్సులు ఉ��్నాయి. Read the full article
0 notes