Tumgik
rdspot · 12 years
Text
All About EVE (1950) ~~~ [Eve = EVIL?]
అల్ అబౌట్ ఈవ్ (1950 ) All About Eve :  Common Women to a Great Artist                           సినిమా పేరులోనే ఉన్నట్లుగా ఈవ్ అనే మహిళకు సంభందించిన కధ ఇది. అయితే ఇక్కడ గొప్పగా చెప్పుకోవలసిన విషయం ఆ పాత్ర కధనం, సినిమా కధ.                           Anne Baxter అనే నటిమణి ఈవ్ గా నటించింది, ఆ పాత్రకు ఈవ్ అని పేరు పెట్టడంలో దర్శకుని అంతర్యం ఏమిటో నాకు తెలియదు కాని, నాకు అనిపించింది ఏంటంటే ....... బైబిలులో దేవుడు మొదట సృష్టిని, ఆ తరువాత ఒకే ఒక చెట్టుని చూపించి, దాని ఫలాన్ని తినవద్దని చెప్పి మనిషిని, తనకు తోడుగా, విసుగు కలగకుండా అడ మనిషిని (ఫెమినిస్టులు వీరిని దేవుడు సృష్టించిన  విధానాన్ని కుడా తప్పుపడతారు, అది వేరే విషయం అనుకోండి.. ;)) సృష్టించాడు, మొదట అంతా మంచిగా ఉంటుంది, ఆ తరువాత, సైతాను ప్రేరణతో ఆడ మనిషి (ఈవ్) ఆ ఫలాన్ని తిని, మగ మనిషిని (ఆడమ్) కుడా తినే విధంగా చేస్తుంది, ఇది బైబిలు చూపించే మొదటి తప్పు. ఈ సినిమాలో ఈవ్ పాత్ర కుడా మొదట చాల మంచి పాత్ర గా ఉండి, తరువాత ఊహించలేనంతగా మారుతుంది.
                          ఈ సినిమా 1950 లో వచ్చిన ఆంగ్ల చిత్రం. ఇలాంటి పాత క్లాసికల్  సినిమాలు సహనంతో చుస్తే, తప్పకుండా నిరుత్సాహపరచవు. ఈవ్ (Evil) పేరుకు తగ్గట్లుగానే ఆ పాత్ర దుష్ట స్వభావం, ఆలోచనలతో సాగుతుంది, నేనయితే ఆనాటి సమయాన్ని బట్టి కధానాయిక ఆ పాత్రకు న్యాయం చేకుర్చిందనే చెప్తాను. ఈ సినిమాలోని ప్రధాన ఇతివృత్తం గురించి చెప్పాలంటే, నాటకరంగంలో ప్రవేశించడానికి, ఒకసారి ప్రవేశించిన తరువాత అక్కడ నిలదొక్కుకుని ఉన్నత స్థానానికి చేరుకోవడానికి కళాకారులు యెంతకి తెగిస్తారు, ఎత్తుకి పైఎత్తులు వేసి వారు సృష్టించే పరిస్థితులు అవి చూపించడమే. ఇప్పుడు ఈ పరిస్థితి నాటకరంగం అంతరించిపోయినందున, సినిమా రంగంలోకి వ్యాప్తి చెందింది. దాదాపు ఆరు దశాబ్దాల నాటి సినిమా కాబట్టి, దానిలో ఆనాటి కళారంగం తెగింపు, పరులను మోసం చేయడం, బెదిరించడం వరకే పరిమితమయినట్లు చూపించారు, మరి ఇప్పుడయితే సిగ్గుమాలినతనం, ఇంకా ఏదైనా చేయడానికి సంసిద్దత  (మీకు తెలుసనుకోండి) .....!                                       ఈ సినిమాకు ప్రధాన పాత్ర అయిన ఈవ్ పాత్ర, దానిని ప్రతిభావంతంగా మలచిన తీరు చెప్పాలంటే ....            మొదటిలో ఒక కళాకారిణి నటిస్తున్న నాటకాలను చూసి, కేవలం ఆవిడను దూరం నుండి చూడడానికి ఆమె ఇంటి దగ్గరలో  ప్రతిరోజూ తచ్చిళ్ళాడుతూ, ఆ నటిమణి మిత్రురాలయిన ఇంకో నటిమణికి తారసపడి, ఆవిడ ఈవ్ ను తన అభిమానిగా పరిచయం చేస్తే, తనకు లేని కన్నీటి దైన్య గాధను కధగా చెప్పి, తన అభిమాన నటిమణి దయతలిస్తే, ఇంట్లో పనిమనిషిగా చేరి, నిదానంగా ఆవిడకి సంభందించిన అన్ని వ్యవహారాలు చూసుకునే సహకారిగా, ఆ తరువాత ఆ నటిమణి గత ఇరవై, ముప్పై సంవత్సరాలుగా నటిస్తున్న నాటకంలోని పాత్ర వేషం నుండి ఆమెను తన సొంత  మిత్రుల సహయం ద్వారా తప్పించి, తను వేయగలిగెంత స్థాయికి వస్తుంది. నిధనిధానంగా ఆ పాత్రలో వచ్చే మార్పులు, దానిని దర్శకుడు చూపించిన తీరు మెచ్చుకోదగ్గవి.                    తను ఆశించినది నెరవేరడానికి మంచి, చెడు బేధం లేకుండా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నఈవ్ పాత్రను చుస్తే... నాకు వెంటనే నా ఇష్టం పుస్తకంలో ఆయనే వ్రాసుకున్నట్లు ( తన గురించి తను ఉన్నది ఉన్నట్లు వ్రాయడానికి కుడా ధైర్యం, తెగింపు కావాలి, కనీసం ఆ విధంగా నైనా RGV గొప్పవాడు ) తనకు దర్శకునిగా అవకాశం రావడం కోసం రామ్ గోపాల్ వర్మ ఏం  చేశాడన్నదే గుర్తు వచ్చింది.                                     ఏ వ్యక్తులయితే ఏమికాని, ఏమిలేని తన  కొత్త జీవితానికి పునాదులు వేశారో, వారిని మోసం చేసిన తరువాత, వారితో విడిపోయి ఒక వార్తాపత్రికకు సంభందించిన పాత్రికేయుడితో స్నేహం కలిపి, అతని ద్వారా కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నం సాగిస్తుంటుంది. ఈవ్ ఆలోచనల వేగాన్ని అర్ధం చేసుకున్న ఆ పాత్రికేయుడు ఒకానొక సంధర్భంలో తనని ఇలా అంటాడు... There is never a one like you and never will be ...                   .....అతను ఇలా అనడం కొత్తగా వచ్చే కళాకారులు తెగిస్తే ఏమైనా చేయడానికి సిద్దపడతారు అనే విషయాన్ని సూచిస్తుంది. అయితే ఈ చిత్రంలో మనం గమనించాల్సిన విషయం కుడా ఒకటి ఉంది. అదేంటంటే, ప్రతి మంచిలోను ఒక చెడు, ప్రతి చేడులోను ఒక మంచి ఉన్నట్లు, ఈవ్ ఎంత దుష్ట స్వభావం, ఆలోచనలు గల కళాకారిణి అయినా కుడా, తను నటించిన మొదటి నాటకంతోనే మంచి నటిగా పేరు పొందుతుంది, ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశంలోనే గొప్ప, ఆ నాటకాన్ని రచించిన రచియుత ప్రకటిస్తాడు. అలాగే ఇంతవరకు ఈవ్ వయసులో ఉన్న ఎవరు దక్కించుకోనటువంటి అవార్డు తను సొంతం చేసుకుంటుంది.                  ముఖ్యంగా ఈ సినిమాను ఆస్వాదించాలంటే దీనిలో వచ్చే డైలాగ్ లను జాగ్రత్తగా గ్రహించాలి. నాటకం, సినిమా లాంటి కళలలోకి ప్రవెశించాలనుకునే వాళ్ళు ఈ సినిమా తప్పని సరిగా చూడటం మంచిది, అలాంటి వారికి ఎటువంటి లక్షణాలు ఉండాలో కుడా ఒకానొక సంధర్భంలో దీనిలో చెప్పడం జరిగింది. అదే విధంగా సిని పరిశ్రమలో ఉండే పరిస్థితులను కుడా అవగాహనలోకి తెచ్చుకోడానికి ఉపయోగపడుతుంది. నా మాటలలో చెప్పాలంటే ఈ సినిమా చూడడం ద్వారా మనం తెలుసుకోదగ్గది, ఔత్సాహిక కళాకారులు నేర్చుకోదగ్గది ఎంతో ఉంది.                 దీనిలో మరో కనువిప్పు కలిగించే అంశం చుస్తే.... సినీ, నాటక  ప్రపంచంలో ఎవరైనా ఒకరికి సహయం చేస్తే, దానిని గుర్తుచేసి ఆ సహాయం పొందిన వ్యక్తీ మీద ఎలా ఆధిక్యత సాధించడానికి ప్రయత్నిస్తారో కళ్ళకు కట్టినట్లుగా చూపించా��ు, ఆరు దశబ్దాలలో, ఇప్పటివరకు కుడా ఈ పరిస్థితిలో ఏ మార్పు రాలేదు.అది ఇంచుమించు బానిసత్వం లాంటిదే, అటువంటి పరిస్థితులలో మాత్రమె స్వేఛ్చ, స్వాతంత్ర్యం విలువ తెలుస్తుంది. అయితే ఈ రోజున  డబ్బు, పేరు దేనినయినా మరుగుపరచగల ప్రత్యామ్నాయంగా మారాయని చెప్పక తప్పదు.
                రెస్టారెంట్ లో Caron అనే పాత్రకు Eve కు మధ్య వచ్చిన సన్నివేశం, దానిలో సంభాషణలు, నటన నన్ను ఆకట్టుకున్నాయి, ఆశ్చర్యపరిచాయి. చివరిగా సినిమాలో వచ్చే పతాకస్థాయి సన్నివేశం అయితే ఊహించనిది, పైన నేను చెప్పిన అవార్డు గ్రహించే సమయంలో ఈవ్ మాట్లాడే మాటలు ఎటువంటి కరడు గట్టిన / అహంభావ  హృదయం అయినా ఒకానొక సంధర్భంలో మారుతుంది, దానికి అనుగుణంగా ప్రవర్తిస్తుంది అనే దానికి నిదర్సనం, అదే మంచి మార్పు. ఇవన్ని చూడాలంటే మీరు సినిమా చూసి తీరాల్సిందే. :)
0 notes
rdspot · 12 years
Text
నేను కీర్తిశేషుణ్ణయితే....!
                   మో (వేగుంట మోహన ప్రసాద్) ఒక విలక్షణమైన కవి, రచియిత. ఆయన 1990 లో రచించిన  పుస్తకం"బతికిన క్షణాలు" చదవడం ఒక ఎత్తయితే, దాని సారం అర్ధం చేసుకోవడం ఇంకొక ఎత్తు. ఆయన రచనలు చదివితే ప్రపంచంలో పేరెన్నికగన్న రచియితలు, వారి రచనలు, అది కవిత్వమయినా గాని, నాటకాలయినా గాని తప్పక పరిచయమవుతాయి. అలాగే అరవై, డేబ్భైలలో, అంతకన్నా ముందు విడుదలైన కొన్ని ఆంగ్ల, ఇతర అంతర్జాతీయ సినిమాల వివరాలు, వాటి తెలుస్తాయి, ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే, ఆ సినిమాలకు, ఆయన మనకు చెప్తున్న విషయానికి ఉన్న సంభంధం, అలాగే ఇతర కవుల కవిత్వానికి, రచనలకు ముడిపెట్టి వివరిస్తారు. అయితే ప్రపంచ కవులు, వారి సాహిత్యం మీద ఏంతో కొంత అవగాహన ఉన్న వారు, ఈయన రచనలను సులభతరంగా అర్ధం చేసుకోగలుగుతారు అని నా ఉద్దేశం. 
"బతికిన క్షణాలు" పుస్తకం నుండి, చివరి పేజీలలో ఉన్న " నేను కీర్తిశేషుణ్ణయితే....! " అనే వ్యాసం నాకు నచ్చింది, అలోచించదగినది, అది ఇక్కడ ఇస్తున్నాను.
                            నదిలో పయనిస్తూ నావలో కురిసిన వాననయి మునిగిపోతాను. బురదలో కాలిబొటనవేలు గుచ్చుకుంటూ నడుస్తూ నడుస్తూ జాలిపడుతూ జారిపడతాను. కాయానికి యశస్సేమిటి కీర్తిశేషమేమిటి? చరిత్ర హీనుడికి చరిత్ర ఏమిటి? నగ్నత్వానికి చివరి వలువ ఏమిటి? క్రీస్తుకి చివరి శిలువ ఏమిటి? దూరాన్నించి దూరానికి వెళ్ళే రైలుబండిని పట్టుకుని ఇదుగో దగ్గరకోచ్చేసిందనుకొంటాం.
               ఇకపోతే - పొతే ఏం పోతుంది? పుట్టటం గిట్టుబాటుగా ఉంటుందా గిట్టటమే గిట్టుబాటవుతుందా? మనం కానిది మనది కానిది ఏది చచ్చిపోయినా ఏడుస్తాం. గ్రూప్ లాఫ్టర్ ఎట్లాగో గ్రూప్ మోనింగ్ అట్లాగే. అందరి సంతోషంలో చప్పట్లు కొడతాం. అందరి విచారంలో వెక్కిళ్ళు పెడతాం. వ్యక్తిగతం అయితే దుఃఖాన్ని అశ్రువులతో చేరిపేసుకుంటాం.
               కీర్తి అంటే జ్ఞాపకం అయితే కీర్తీశేషుడవటం అంటే జ్ఞాపక మాత్రంగా మిగిలిపోవడం. దుఃఖం కన్నా దుఃఖస్మృతే ఎక్కువ బాధ. మరణం స్వీయ స్మరణంగా మిగిలితే అది నిరంతరం.
               ఈ అయితే...అనుకోవడం ద్వందం. యాడ్రియన్ హెన్రి ఇంకా అదృష్టవశాత్తూ కీర్తిశేషుడవలేదు కాని, తన వీలునామా అనే కవితలో "నా సంగ్రహిత కావ్యాలన్నీ చించి ఒక్కొక్క కాగితం లండన్ పౌరులందరికి టాయిలెట్ పేపర్లుగా పంచండి నా మరణానంతరం" అని వ్రాసి సంతకం చేసి తేదీ వేస్తాడు. శ్రీ శ్రీ `ఆః` అన్న కవిత `వీరే!` అన్న మాటతో ముగుస్తుంది.
జీవం ఉన్నంతవరకు
మృత్యువు కోసం చేసే 
తపస్సే జీవనం
మాతృగర్భంలోనూ
నేల ఒడిలోనూ
              సరే. నా చావు నేను చస్తాను. బ్రతికి సాధించింది ఏమిలేదు కనక చచ్చి ఎవరినీ సాధించను. నన్ను క్షమించిన వాళ్ళని అలా క్షమించినందుకు క్షమిస్తాను. ఎడమ చెంప కూడా ఇచ్చినప్పుడు ఇంకా గట్టిగా కొట్టిన దెబ్బనీ క్షమిస్తాను. రెండో చెంప ఇవ్వని వాళ్ళనీ ఏమీ చెయ్యను.
              కీర్తీశేషుడవటం అంటే అసంపూర్ణ మరణాన్ని పొందటం, సంపూర్ణ జీవితం ఎటూ లేదు గదా అసంపూర్ణ మరణం కూడానా. అది రిపిటిషన్, విసుగు, అలవాటుగా జీవించడం, పొరపాటున మరణించడం విసుగు. కీర్తి జ్ఞాపకంగా, జ్ఞాపకం అలవాటుగా దివ్యం దైనందినంగా మారటమే మాములుగా చనిపోవడం అంటే, అంతం అంటే సంపూర్ణం. ఖాతం, డెత్ మస్ట్ బి టోటల్.
I am afraid to own a Body
I am afraid to own a Soul.
అని డికిన్సన్ 1090 వ పద్యం, ఆమె కీర్తి శేషం.
" The change from being to becoming seems to be birth and the change from becoming to being seems to be death, but in reality no one is ever born, nor does one ever die " అని ఎపోలేనేర్.
చావు మంచి సంస్కారం
               జీవించడం శిలా శాసనం. మరణం ఆ శాసన ఫలకం.
               నా లెక్కల పుస్తకంలో కీర్తిశేషమంటూ ఉండకూడదని నా ఆశ. చావు మంచి సంస్కారం., ఈరాస్ బ్రతకమంటుంది. తానెటాస్ చద్దామంటుంది, చావడమే మనం చివరికి చేసే పని. అందుకే సంస్కారాలు, కర్మలూ చేస్తారు.
                     `ఉయ్ ఆర్ బార్న్ విత్ ది డేడ్` అని ఇలియట్
                     `యు కుడ్ నాట్ బి బార్న్ - ఎట్ యు డైడ్` జార్జ్ మేక్బేత్
          ఫ్రెంచి కవి ఫ్రాన్సిస్ జేమ్స్ తాను చనిపోయిన తరువాత వెయ్యి గాడిదల్ని వెంటేసుకుని స్వర్గానికి వెళ్తానని ఆ ఊరేగింపుకి అనుమతి ఇవ్వమని దేవుడ్ని ప్రార్ధిస్తాడు.          
         నేను నిజానికి ఓనాడు చనిపోయాను. ఆ సం��తి మీకు తెలీదు. చెప్పను కాబట్టి నేను కీర్తిశేషుడనయిన ప్రమాదం తప్పింది. ఎందుకొచ్చింది గాని ఎవరి చావు వాళ్ళని చావనివ్వండి.
~~~~~
0 notes
rdspot · 12 years
Text
కొల్లాయిగట్టితేనేమి? - చారిత్రిక నవలలో వేగుచుక్క.
                                   దాదాపుగా నేనీ నవల ఖరీదు చేసి సంవత్సరం ముగిసింది. మొన్నీమధ్య దాశరధి రంగాచార్య గారి " చిల్లర దేవుళ్ళు" చదివిన తరువాత, ఇదే విధమైన చారిత్రిక నవల ఇంకేమైనా ఉందా అని నా పుస్తకాల  అరలు తెరచి చుస్తే ఎదురుగా ఇది ప్రత్యక్షం. చదవడం మొదలుపెట్టి మూడు రోజుల్లో ముగించగలిగాను. దీని గురించి తెలుసుకుని మరీ ఖరీదు చేశాను కాబట్టి, ఈ నవల నేపధ్యం ముందే తెలుసు. ఇక నవలలోకి పయనిద్దాం.
                           ఈ నవలను మహీధర రామమోహనరావు గారు 1964 లో రచించారు. రచించిన కాలం నాటికంటే నలభై ఏళ్ళు వెనకకు వెళ్లి 1921 నాటి దేశకాలమాన పరిస్థితులను గురించి చాలా చక్కగా రచించిన నవల. ఆనాటి చరిత్రని, సమాజంలో వస్తున్న మార్పులను, కాంగ్రెసు జాతీయోద్యమం వలన ప్రజలలో, గ్రామాలలో వచ్చిన మార్పును కళ్ళకు కట్టినట్లుగా వర్ణించారు. దీనిలో రచియుత సృష్టించిన పాత్రలు కృత్రిమంగా కాక, సహజ దోరణిలో మనముందే కధ జరుగుతుందా అనిపించే విధంగా ఉంటాయి. ఆనాటి ఫ్యూడల్ సమాజంలో, అర్ధంపర్ధం లేని ఆచారాలతో మనుషులు యెంత మూర్ఖంగా ఉండేవారో చదివిన తరువాత మనం చాల స్వేచ్ఛగా ఉండగలుగుతున్నామనిపించింది. సమాజం, మొత్తంగా కాకపోయినా కొంతవరకు అటువంటి సనాతన పద్దతులు, వింత దోరణి నుండి బయటపడటానికి కనీసం అర్ధశతాబ్ద కాలం పైనే పట్టి ఉంటుందని నా అభిప్రాయం. 
                            ఇహః, ఈ నవల వివరాలలోకి వెళ్లి దానిలో ఉన్న పాత్రల గురించి చర్చించడం మొదలు పెడితే నేను ఇలా వ్రాసుకుంటూ పోతూనే ఉండాలి. అందుకే కొంతవరకు వివరణ ఇచ్చి వదిలిపెడతాను. క్లుప్తంగా చెప్పాలంటే ఈ నవల "గాంధిజీ సహాయనిరాకరణకు పిలుపునివ్వగా తను చదువుతున్న కాలేజి చదువుకు స్వస్తి చెప్పి, ఖద్దరు ధరించి తన గ్రామానికి వచ్చిన రామనాధం అనే యువకుడి జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు, అవి అతనిలో కలిగినచేసిన మార్పు" తదితర అంశాల చుట్టూ తిరుగుతుంది. దీనిలో ఆద్యంతం జరుగుతున్న కధలో అప్పటి చరిత్రను, ఆనాటి నాయకుల జీవితాలలో చోటుచేసుకున్న కొన్ని ఆసక్తికరమైన సంఘటనలను అంతఃర్లీనంగా చెప్పడంలో రచియుత కనపరిచిన ప్రతిభ అద్భుతమనే చెప్పాలి. ఈ నవల విశిష్టత గురించి ఇంకా చెప్పాలంటే, శతాభ్దానికి పూర్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సాంఘిక, సామాజిక పరిస్థితులను గురించి, అప్పుడు వాడుకలో ఉన్న తెలుగు బాష గురించి తెలుసుకోవాలని ఆసక్తి / కుతూహలం ఉన్న ప్రతివారు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.                                     ఈ నవలంతా ఒక ఎత్తైతే, ఈ నవల గురించి వివిధ సందర్భాలలో వెలువడిన వ్యాసాలు, రేడియో ప్రసంగ పాఠం ఇంకొక ఎత్తు. ఈ క్రింది మూడింటిలో నాకు ముఖ్యంగా ఆసక్తి కలిగించినవి, తెలియని ఎన్నో విషయాలను తెలియజేప్పినవి రాచమల్లు రామచంద్రారెడ్డి (రారా) గారి నవల గురించిన సమీక్షా వ్యాసం, రచియుతచే వ్రాయబడిన " ఎందుకు వ్రాసాను " అనే వ్యాసాలు. ఇవి రెండు నా అభిప్రాయంలో వదిలిపెట్టకుండా చదవాల్సినవి.    ౧.   యదార్ధ జీవిత అంతర్వైరుద్ధ్యానికి ప్రతిరూపం          - సింగమనేని నారాయణ. (బెజవాడ ఆకాశవాణి కేంద్రం      
                                                                                  నుండి ప్రసారమైన ప్రసంగ పాఠం)
౨.  కొల్లాయిగట్టితేనేమి? - ఒక ఉత్తమ చారిత్రిక నవల    - రాచమల్లు రామచంద్రారెడ్డి. ( 'సంవేదన', ఏప్రిల్ 1968 )
౩.   కొల్లాయిగట్టితేనేమి? - నేనెందుకు వ్రాశాను?           - మహీధర రామమోహనరావు.
పైన పేర్కొన్న మూడవ అంశాన్ని గురించి ఇక్కడ ఒక విషయం ప్రస్తావించడం సముచితమని నాకు అనిపిస్తుంది. అదేంటంటే...
                                కమ్మ్యునిస్టు భావజాలానికి సంభందించిన కొన్ని పుస్తకాలలో దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారు స్థాపించిన ఆంధ్రపత్రికను అమృతాంజనం అమ్ముకోడానికి ప్రకటనలు ఇస్తున్న పత్రికగా రాయడం జరిగింది, అది నేను కుడా చదివాను, ఆ విషయం నాకు స్వతహాగా నచ్చలేదు. అప్పుడు కమ్మ్యునిస్టు పత్రికగా వెలువడుతున్న విశాలాంద్రలో ఒక ప్రముఖ రచియుత తాను రాసిన ఒక వ్యాసంలో పై విధంగా ఆంధ్రపత్రికను పేర్కొనడం జరిగింది. పంతులు గారు జాతియోధ్యమానికి ఊతంగా / బాసటగా ఆ పత్రికను నడిపారు, మొదట వారపత్రికగా వెలువడినా ఆ తరువాత దినపత్రికగా మారింది. తెలుగు వారి పల్లెపల్లెలకు ఆ పత్రికను పంపడానికి వారు ప్రయత్నించేవారని పెద్దలు చెప్పగా విన్నాను కుడా. ఆ మధ్య నాగేశ్వరరావు గారి వందవ జన్మదినం సందర్భంగా అనుకుంటా.... అయన మనువడు కాశీనాధుని నాగేశ్వరరావు గారు కృష్ణాజిల్లాలోని వారి సొంత గ్రామంలో ఏదో కార్యక్రమం కోసమై సావనీరు ప్రచురించడానికి విజయవాడలోని మా మామయ్య ప్రేస్సుకి వచ్చినప్పుడు నేను చూడలేకపోయాను. అయితే ఆ తరువాత మా మామయ్య ద్వారా ఆ కార్యక్రమం కోసమై తీసిన ఫోటోలలో ఆయనను, ఆ ఊరిలో వారి తాతగారు కట్టించిన పురాతన పాఠశాలను చూడగలిగాను. అయితే ఆయన హయాములోగాని, ఆయన పిదప గాని ఆ పత్రిక వ్యాపారాత్మకంగా మారిందేమో నాకు తెలియదు. దీనిని ఇక్కడ చెప్పడానికి గల కారణం : రచియుత, తాను స్వతహాగా కమ్మ్యునిస్టు అయినా కుడా ఈ నవలను వ్రాయడానికి ప్రేరేపించిన పలు కారణాలలో ఒక కారణంగా ఆంధ్రపత్రికను ఆ విధంగా పోల్చడానిని ఖండిస్తూ / నిరసిస్తూ జాతియోధ్యమంలో అన్ని రకాల మాధ్యమాలు ఏ విధంగా ఉపయోగపడగలవో చెప్పాలని వ్రాసినట్లు చెప్పారు.
             ఇలా ఏ విధంగా చూసినా కుడా కొల్లాయి గట్టితేనేమి మనకు తెలుగులో లభ్యమవుతున్న చారిత్రక నవలలో ఉత్తమ చారిత్రక నవల, ఈ భాగంలో వేగుచుక్క. ( రారా గారి వ్యాసం ఆధారంగా ).  :)
0 notes
rdspot · 12 years
Text
దేవర్లు - నమ్మకాలు : కన్నడ బాష పుట్టుక...!
*** చెంచుల మాట్లాడే తెలుగు బాష, వారి పదజాలం కుడా పాఠకులకు తెలియాలన్న ఉద్దేశంతో మనం చెడు పదాలుగా తలచే కొన్ని పదాలు ఈ వ్యాసంలో ఉన్నాకూడా వాటిని మార్చకుండా అలాగే ఇవ్వడం జరిగింది.           కన్నడ బాష ఎలా పుట్టిందో చెప్పే కధ ఒకటి మా చెంచుల వద్ద ఉన్నది. ఒకప్పుడు అనగా ఆనకట్ట కట్టకముందు గంగ (కృష్ణానది) ఒడ్డున పాండవుల గుడి ఉండేడిది. ఇప్పుడు ఆ గుడిని గంగ ముంచేసింది. ఆ గుడి ఉండిన దగ్గర పాండవులు ఉండేవాళ్ళంట. ఆ కాలంలో పాండవులు శ్రీశైలం వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క మఠంలో తపస్సు చేసుకునేవారు. బీమశంకర మఠంలో భీముడూ..... ఇలాగ.  అయితే అర్జునుడు అన్నతమ్ములతో పాటు పూజ చేసుకుని ఏకాంతం కొరకు నీరు గంగ ఒడ్డున తపస్సు చేసుకోవడానికి వెళ్ళినాడు.           సూదిని క్రిందికి మోపి సూది మొనపై ఒంటికాలు మీద నిలుబడి తపస్సు చేస్తుండె. ఆ సూదిని కొరకడానికి దేవతలు చెదలును పంపినారంట. కానీ అర్జునుడు చెదలును పట్టుకుని దాని కొయ్యలు (పళ్ళు) ఇరగకోట్టినాడంట. అందుకే చెదపురుగుకు ఇనుమును కోరికే బలము తగ్గిపోయినాది. అప్పుడు అది ' అయ్యా నాది తప్పు కాదు, నన్ను సృష్టించిన దేవతలు పంపగా నేను వచ్చినాను.. నా కొయ్యలు లేవు నాకు తిండి ఎట్లా? నా బ్రతుకుదెరువు ఎట్లా? ' అని బ్రతిమాలగా అర్జునుడికి జాలి కలిగి , ' ఇంక పో ఎండు చెట్లను మట్టికప్పి మెత్తగా చేసుకొని తినిబ్రతుకు ' అని చెప్పినాడంట. అందుకే చెదలు మన మెత్తటి వస్తువులను అన్నీ తింటాది. ఆరోజు అర్జునుడు దాని కొయ్యలు ఇరగదెంగకపొతే ఈరోజు మన ఇనుప సామాను కుడా మిగిలేది కాదు.      ఇంకా అర్జునుడు తపస్సు చేస్తున్న సమయంలో పార్వతి దేవికి ఒక విచిత్రమైన కోరిక పుట్టినాదంట. ఆ కోరిక ఏమిటి అనగా, అర్జునునికి వీపు మీద పుట్టుమచ్చ ఉంది. (అడకల్ల), అంట ఆ మచ్చని చూడాలని పార్వతి ముచ్చట పడుతుందని సరే అని ఒప్పుకొన్నాడు శివుడు. పార్వతి శివుడు కైలాసం నుండి భూమి మీదకు దిగినారు. అనగా శ్రీశైల శిఖరము మీద దిగి, పార్వతీదేవి చెంచుపిల్ల లాగా, మల్లిఖార్జునస్వామి చెంచు దిడ్డకాడు (యువకుడు) లాగామారి అంబులు, దబ్బ పట్టుకుని తయారయినారు. నంది పందిగా మారి గంగ దారి దగ్గర తుంగ గడ్డలు తింటూ ఉండేనంట. అక్కడనుండి అంబున దెంగినాడు పడుచుడు. దాంతో ఆ పంది అంబుఏసుకుని రక్తము కారుసుకుంటా బీముడు, ధర్మరాజులు ఉన్న చోటుకుపోయినదంట. 'నన్ను రక్షించండి, నన్ను రక్షించండి' అని అడగగా, వారు 'నిన్ను రక్షించడానికి మేము చాలము, ఏటి అవతల మా తమ్ముడు అర్జునుడు ఉన్నాడు వాని దగ్గరకుపో వాడు చూసుకుంటాడు' అని పంపినారు అంటా. ఈ పంది ఏటి ఆవలకు రక్తము కారుసుకొంటా పోయినది. మందల ఉరికి పందిబోర్రల బొర్ర కొట్టుకొని కొంతసేపు పడుకున్నాదంట.      ఈ చెంచు పడుసడు, పడుచు కుక్కలను వేసుకొని రక్తము జాడ కట్టుకుంటా పోయినాడు. మందల కుక్కలు జాడ కట్టుకుంటాపోతుంటే వీళ్ళు ఇద్దరు అంబులూ దబ్బా గంప కర్ర తీసుకొని బయలుదేరినారు. ఈ కుక్కలు పోయి మళ్ళి పందిని లేపినావి. ఆ పంది లేసి అంబుదేబ్బకు బాగా రక్తము పోయినాది కాబట్టి మళ్ళి నీళ్ళకు గంగకు బయలుదేరినాది. ముందర అక్కమహాదేవి బొక్కల మీదుగాపోయి, వచ్చేతప్పుడు మేడిమల్కల బాట పట్టినాది. అక్కడ గంగ ఒడ్డుకుపోయి, తపసు చేస్తుండగా ఆర్జునుడిని చూసిన ఆ పంది 'నన్ను కాపాడు, నన్ను కాపాడు' అని ఏడుస్తూ అరుస్తాది. ఎవడో చెంచోడు నన్ను చంపడానికి వస్తున్నాడు. నీవే నన్ను రక్షించాలి అని వేడుకుంటాది. అప్పుడు అర్జునుడు ఇంత పవిత్రమైన శ్రీశైలం కొండలలో జీవులను చంపడమా సరే అని, అతని మఠములో ఒక గంప ఉంటే ఆ పందిని గంప క్రింద కమ్మి ఎమితెలియనట్ట్లుగా ఉంటాడు. ఇంతలోపల చెంచోడు అంబులు దబ్బపట్టుకుని వెనుక పెండ్లాన్ని వేసుకొని వస్తుంటాడు. కుక్కలు రక్తము జాడన వచ్చి మఠం దగ్గర ఆగి ఆర్జునుడిని చూసి మొరుగుచుంటావి.       అప్పుడు చెంచోడు పెండ్లాన్ని వేసుకొని వచ్చి, 'ఆ రేయి నేను ఏసిన పందిని ఇట ఇయ్యరా ఆ పంది జాడ నీ గుడిసె దగ్గరకు    వచ్చినది. నా కుక్కలు కూడ జాడ ఈడికే చూసిస్తున్నావి' అని అడుగుతాడు. ఈ చెంచోడు ఉట్టి మూర్ఖుడులాగా ఉన్నాడు అని అనుకోని అర్జునుడు, 'ఈ పందిని వదిలేయి, నీకు తినడానికి తిండి, గింజలు ఇంకా ఏమైనా ఇస్తాను' అని అంటాడు. కాని చెంచోడు ఒప్పుకోడు. అర్జునునికి చెంచోనికి మాట మాట పెరిగి కొంచెము గొడవ అవుతాది. 'ఈ పంది చావుబ్రతుకులలో ఉన్నది. ఈలాంటి పరిస్థితులలో నన్ను కాపాడమని అడిగినది దానికి నేను కాపాడుతానని మాట ఇచ్చినాను. ఈ పందిని ఇవ్వడానికి వీలుపడదు. నీ దారిన నీవు వెళ్ళిపో చెంచు' అని గట్టిగా చెప్పుతాడు అర్జునుడు. అప్పుడు చెంచోడు ఇలా అంటాడు. 'ఓ రేయి సూదరోడా నీవు ఎక్కడి వాడివి, ఎందుకు వచ్చినావు? ఈ అడవి నాది, ఈ భూమి నాది, ఈ అడవిలో తిరిగే జంతువులు నావి. ఈ చెట్లు నావి. ఈ గంగ నాది. నీవు ఎవరివి; నాకు ఎదురు చెప్పటాకి, నా పందిని నాకు ఇస్తవా లేదా' అని గట్టిగా తిట్టుతాడు. అప్పుడు అర్జునునికి కోపం వచ్చి, ఇద్దరూ కొట్లాటకు దిగుతారు. అర్జునుడు ఎన్ని అంబులు వేసినా పనిచేయవు. అంబులు అన్ని అయిపోతావి. చివరికిపోయి తన్నుకుంటారు.       ఈ సమయంలో శివుడు క్రిందపడి అర్జునుడు శివుని మీద అనగా చెంచొని మీద పడుతాడు. అర్జునుని బట్టలు అన్ని చినిగి ఒంటి మీద అనగా అడకల్ల బట్ట ఉండదు. అప్పుడు శివుడు ఇలాగని అంటాడు. ఏ నోడింల్ ? అప్పుడు పార్వతి 'నోడితిని' అని అంటాది. అంటే ఇది కన్నడం బాష. అప్పుడు పుట్టినది అంట కన్నడం బాష, ఏ నోడింల్ అంటే, ఏ చూడు అని, నోడితిని అంటే చూసినాను అని, ఈ బాష అర్ధము. అర్జునుడు చెంచు బాషలో వీళ్ళు ఏమో అనుకుంటున్నారని ఇదే సమయము అనుకోని చెంచోన్ని  క్రింద వేసి వత్తుచున్నాడు. పార్వతి నోడితిని అని ఎప్పుడైతే అన్నదో, అంటే పుట్టిమచ్చ చూసినాది అన్న మాట. అప్పుడు శివుడు అనగా ఈ చెంచోడు కోన నోటితో పైకి అంటాడు. ఆ బలానికి అర్జునుడు ఆకాశంలోనికి ఎగిరిపోతాడు. పైకిపోయి గాలిలో కొట్టుకొని పోయిన ఆకులాగ క్రిందకి వస్తుంటాడు. అప్పుడు పార్వతి చూసి స్వామీ క్రిందపడుతే ఎమైతాడు అని అనగా గంగని ఎలుపు చేయమంటాడు. గంగ వేడెల్పుకాగా వచ్చి నీళ్ళలోపల పడుతాడు.      ఆనకట్ట కట్టినప్పుడు ఈ ఆధారాలు అన్నీ మునిగిపోయినావి. మళ్ళి అర్జునుడు ఆయాసంతో ఈదుకుంట కోపం మీద ఈ చెంచోనికి ఇంత బలమా అని ఒడ్డుకు వస్తుండగా..... చెంచుపడుచడు     -    శివుడుగా చెంచు పడచు        -    పార్వతిగా పంది                  -    నందిగా హరి, అప్పుడు ఒక అంబుని వరంగా ఇచ్చినాడంట.
0 notes
rdspot · 12 years
Text
గాథాసుప్తశృతి
          తెలుగు సాహిత్య లోకంలో గుంటూరు శేషేంద్ర శర్మ తెలియని వారు ఉండరు అనడం అతిశయోక్తి కాదేమో...! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటి మునిసిపల్ కమిషనరుగా పనిచేసారు. 'నా దేశం - నా ప్రజలు', శేషజ్యోత్స్న, రక్తరేఖ, గొరిల్లా, ఆధునిక మహాభారతం, జనవంశం, ఋతుఘోష, మండే సూర్యుడు, స్వర్ణ హంస, రామాయణ రహస్యాలు వంటి రచనలు చేసారు. కవిసేన మానిఫెస్టో ఆయన సుప్రసిద్ధ రచన. కమ్మ్యునిజం పట్ల ఆసక్తి కలవాడై పద్య రూపంలో చేసిన రచనలు కుడా ఉన్నాయి. 1955 ఆంద్ర ఉపఎన్నికల్లో కమ్మ్యునిస్టు పార్టి వైపు నిలబడిన శ్రీ శ్రీ దాదాపు మతిస్థిమితం కోల్పోయినప్పుడు ఆయనకు అండగా కవిత రాసి ఓటమి తాత్కాలికమే అని ప్రోత్సహించిన కవి శేషేంద్ర. ఇక 1991 నుంచి గల్ఫ్ యుద్దాన్ని ఖండిస్తూ అమెరికా సామ్రాజ్యవాదాన్ని స్థిరంగా వ్యతిరేకించిన శేషేంద్ర నీతులు చెప్పే అమెరికా - ఇది నీ చరిత్ర అనే వ్యాస సంపుటిని వెలువరించారు.
ఆయన వివిధ సందర్బాలలో వార్తాపత్రికలకు వ్రాసిన వ్యాసాలలో నాకు నచ్చిన ఒకానొక వ్యాసం ఈ .....
గాథాసుప్తశృతి.
జీవితంలో ఏది విలువైనది అనే ప్రశ్నకు భర్తృహరి రెండు పద్యాలు చెప్పాడు. లోకంలో రెండు తెగలున్నాయని  ఆయన భావం. 
ఒకటి :
" జాతి తొలంగుగాత గుణ శక్తి రసాతల సీమకుం జనుం
  గాత కులంబు బూదియగు గాత నగంబున నుండి సీలముం
  బాతము జెందుగాత బహు భంగుల విత్తము మాకు మేలు వి
  ఖ్యాత గుణంబులె తృణ కల్పము లొక్క ధనంబు లేవడిన్ " 
రెండవది :
  నీతి ఫ్రౌడవిహారులైన నిపుణుల్ నిందింపనీ మెచ్చనీ
  ఖ్యాతింజెందిన సంపదల్, నిలువనీ గాఢంబుగా సాగనీ   ఘాతం బప్పుడు పొందనీ నియతిమై గానీ యుగాంతంబునన్   నీతిశ్లాఘ్యపధంబు దప్పరుగదా నిత్యంబు ధీరోత్తముల్!  
       ఒక వర్గం ధనం ప్రధానమని, రెండవ వర్గం అది కాదు అనీ. రెండవ వర్గం ఉత్తమ వర్గంగా పేర్కొన్నాడు భర్తృహరి. అందుచేతనే మరో సందర్భంలో మొదటి తెగ వారిని " నేలతున్కలో నడరు లవంబులో తునియ యందొక మూలకు నాధులైనవారడలక వైపరీత్యమున హర్షము జెందెద రెంత మందులో " అనీ తీవ్రంగా ఖండించాడు. పొతే సుమతి శతక కర్త " అధికార రోగపూరిత బధిరాంధక శవము జూడ పాపము సుమతి " అన్నాడు. నిజంగా అహంకార పూరితులైన ధనవంతులను, అధికారులను చూస్తె కోపం రాదు గానీ నవ్వొస్తుంది - ఎంత అజ్ఞానులు అని. అయితే అహంకార పూరితులైన విజ్ఞానులను చూస్తే ఏడుపొస్తుంది - విజ్ఞానం వ్యర్ధమయిందని.        అర్ధమూ, అధికారమూ అన్నదమ్ములు. రావణ కుంభకర్ణుల్లాగ. ఇవి మానవులలో మానవత్వపుపాళ్ళు తక్కువ ఉన్నవాళ్ళలో ఎక్కువ ప్రకాసించేవి. కోటీశ్వరులు కోట్ల కొలది భూలోకంలో పుట్టారు, పోయారు, కానీ ఒక్కడి పేరు కుడా నిలువలేదు. నీతికి గాను సామ్రాజ్యం త్యజించిన హరిశ్చ��ద్రుడి పేరు మాత్రం ఇంటింటా దీపాంకురమై ఈనాటికి వెలుగుతూనే ఉంది. అట్లాంటి హరిశ్చంద్రులు ఏ దేశంలో ఎక్కువమంది ఉన్నారు అన్నదే గొప్పతనం గానీ, ఒక జాతి గొప్పతనం కొలవడానికి ఎందరు కలెక్టర్లు ఉన్నారు? ఎందరు కోటిశ్వర్లున్నారు? అనే ప్రశ్నగాదు కొలతబద్ద.
          మరి ధనం విలువయింది కాకపొతే విజ్ఞానం ఉత్తమ పదార్ధమా? అదీ కాదన్నారు. కాదనేది మనకు నిత్యం జీవితంలోనే స్పష్టమవుతూ ఉంది. వారి రచనలు చదివి మనస్సులో ఎంతో గొప్పవారని చిత్రించుకొని దర్శించడానికి వెళ్ళినప్పుడు బ్రహ్మరాక్షసులుగా ప్రత్యక్షం కావడం చూస్తూనే ఉన్నాము. చిత్రమేమిటంటే జమదగ్ని, జాబాలి, అత్రి, భరద్వాజుడు ఇత్యాది ఋషివృషభులుండగా వారు మామూలు మనుష్యులే అయి శ్రీరాముడు మాత్రం దేవుడేట్లా అయ్యాడు? శ్రీరాముడు కవిగాదు, పండితుడుగాడు, శాస్త్రజ్ఞుడు కాదు, వేదవేదంగా పారంగతుడు కాడు, ఏవి లేనివాడు గొప్పవాదున్నూ, అన్ని ఉన్నవాడు మానవ మాత్రుడూనా? ఇందులో ఏదో మర్మముంది. ఆ మర్మమే మానవజాతి పరమార్ధం. అదే శ్రీరాముడిలో సమగ్రంగా మూర్తిభవించింది. అట్లాగే వెనుక చెప్పిన హరిశ్చంద్రుని కాలం నుండి ఇప్పటివరకూ మధ్య ఎందరో విజ్ఞానవేత్తలు, పండితులు పుట్టి ఉంటారు. సాని పురాణం అంటే, హిస్టరీ - వారి నేవరిని లిస్టులో వేయకుండా హరిశ్చంద్రాదులను గురించే పేర్కొన్నది. వారు లోకోత్తర గుణసంపన్నులనీ - లేకపోతె కర్ణుడు బి.ఏ. చదివాడా, ఎమ్.ఎ. చదివాడా? పెద్ద తత్వవేత్తా లేక శాస్త్రజ్ఞుడా? ఈనాటికి ఆయన గాధ సమస్త మానవులను పులకిత గాత్రులుగా చేస్తుంది. వినమ్ర సిరస్కులను చేస్తుంది. విజ్ఞానవంతులూ, సంస్కారసూన్యులు అయిన వారిని పురాణం రాక్షసవర్గం అన్నది. పెద్ద పండితుడై సద్గుణాలు లేకపోతె బ్రహ్మరాక్షసుడవుతాడట! రావణాసురుడు పండితుడు, సంగీతవిదుడు, రాజనీతిజ్ఞుడు, వేదవేదాంగ పారంగతుడు, త్రైలోక్యవిజేత. ఎందుచేత రాక్షసుడయినాడు, ఇవేవి అంతగా లేని శ్రీరాముడేందుకు దేవుడయ్యాడు అని మళ్ళి ఒక ప్రశ్న. హిట్లరుకంటే విజ్ఞానవంతులు సమర్ధులు ఉన్నారా? మరేమిటి? అతని పాత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో కాదుకదా బొగ్గుతో తారుమారుగా చిత్రిస్తామంటున్నారెందుకు చరిత్రకారులు? మరొక పురాణగాధ చుడండి. హిరణ్యకశిపుడు భువనత్రయాదినేతృత్వం సాధించాడు. అద్వితీయ పరాక్రమశాలి, ప్రతిభావంతుడు అయి ఉండాలి. అపారవిజ్ఞానవంతుడు అయి ఉండాలి. నేనే దేవుడన్నాడు కనుక, అంటే అహంబ్రహ్మాస్మి అన్నాడు అంతే. అయితే ఏం లాభం? ఆ ఐశ్వర్యము ఆ విజ్ఞానము అహంకారానికే దారితీశాయి. హిరణ్యకశిపుడు లోకకంటకుడయ్యాడు. అంట భువనత్రయాధినేతకు, అంత విజ్ఞాన ధురంధరుడికి ఒక అర్భకుడిచేత బుద్ధి చెప్పించాడు కధకుడు. అదే విశేషం! కధలో " నీలో వినమ్రత లేదు, నీలో దయాదాక్షిణ్యాలు లేవు. నీవు మనిషివి కావు. ఎన్ని ఉంది ఏం లాభం? నీ జీవితం నిరర్ధకం, లోకభీకరం. నీవు భూమిమీద ఉండకూడదు " అని చెప్పాడు కధకుడు.          అందుచేతనే రచయుతల దగ్గరనుంచీ రాకెట్లు చేసే శాస్త్రజ్ఞుల వరకూ రాజకీయవేత్తల వరకూ విస్తరించుకొని ఉన్న వైజ్ఞానిక వర్గాన్ని విమర్శగా చుస్తే మానవజాతికి మోక్షం విజ్ఞానంలో కుడా లేదేమో అనిపిస్తుంది. మరియెందులో ఉంది? అది తెలిస్తే జీవితంలో దేనికి విలువనివ్వాలో తేలిపోతుంది. అదే సంస్కారం లేక ఆధునిక బాషలో ఆత్మసౌందర్యం, లేక మానవత్వం. అది అనేక సూక్ష్మసుకుమార సద్గుణ సముచ్చయము. మధ్యలో ఒక వజ్రం కుడా ఉంటుంది. అది నీతి. వీటన్నిటి సమిష్టి స్వరూపం సంస్కారం అనవచ్చు. మానవుడికి అందాన్నిచ్చేది ఔన్నత్యాన్నిచ్చేది ఎప్పుడు డబ్బు అనేదానికీ విజ్ఞానం అనేదానికీ పైననే ఉంటుంది. రావణాసురిడిలో లేనిది రాముడిలో ఉన్నది అదే - ఆ ఆత్మసౌందర్యం.         శ్రీ కృష్ణుడు అద్వితీయ ప్రాభవోపేతుడు. రాజభవనాంతర్భాగంలో ఉన్న ఆయన కోసం రుక్మిణీదేవి పంపించిన బ్రాహ్మణుడు వెళ్ళాడు. కృష్ణుడు బ్రాహ్మణుడ్ని దూరాన్నే చూసి " తను గద్దియ దిగ్గున డిగ్గి బ్రాహ్మణుం గూర్చుండ నియోగించి " భోజనం అయిన తరువాత, " లోకరక్షణ ప్రశస్తంబయిన హస్తంబున " ఆయన కాళ్ళు పిసికాడట. ఆ భగవానుడే ఏమన్నాడంటే, " సర్వభూత సుహృత్తములకు, ప్రాప్తలాభ ముదిత మానసులకు, శాంతులకును, సుజనులకును గర్వహీనులకును వినతు లేనోనర్తు " అన్నాడు, సంస్కారం అంటే అది. సాధువులకు దేవుడు కుడా నమస్కరిస్తాడు.        దయ,సత్యం,అహింస, ఇట్లాంటి సద్గుణాలు ఎవరో ఋషులే అలవరచుకోవలసిన గుణాలు కావు. నిత్యజీవితంలో ప్రతి మానవునికి కావలసినవి. అదే సంస్కృతి. ఆ స్థాయికి వెళ్ళని జాతిని గురించి గర్వించవలసిన అవసరం ఏమి లేదు. ఆ సద్గుణాలే చదువుల పరమార్ధం కనుక చిన్నపిల్లలకు కుడా వాటినే ఉగ్గుతో కలిపి పొయ్యాలి. కృశించిపోయిన కుక్కను గురించి జాలిపడడానికి, దీనుల గాధలు విని కంటతడిపెట్టడానికి కావలసిన సౌకుమార్యము, సౌశీల్యము అంకురింపజేశామంటే సమగ్రంగా చదువు చెప్పామన్నమాట. డిగ్రీలు ఇచ్చినంతమాత్రం చేత చాలదు, తెచ్చుకున్నంత మాత్రం చేత చాలదు. ఈనాడు (1960 లలో ఇది వ్రాయడం జరిగింది) మన పరిస్థితి ఎలా ఉందంటే ఏ సద్గుణాలైనా పుస్తకాల్లో ఉంటేనే సంతోషిస్తున్నాము. ఎవడన్నా ఆచరిస్తే వెర్రివెధవ అనిపించుకుంటున్నాడు. కర్ణుడు మహాదాత అని పుస్తకాల్లో చదివి మెచ్చుకుంటాడేకాని, కొడుకు ఒక రూపాయి దానం చేస్తే తండ్రి వీడు ప్రయోజకుడయ్యే సుచనల్లెవంటాడు. ఎవరైనా ఈనాడు పరోపకారార్ధం తోడకోసి యిస్తే అప్రయోజకుడంటారే కానీ శిబికి పుస్తకాల్లో ఇచ్చిన స్థానం ఇస్తారా? ఎంతసేపూ ఏదో లాభదాయకంగా ఉండే పనులు చేస్తేనే తల్లితండ్రులు సంతోషిస్తారు. మిత్రులు నా మిత్రుడని చెప్పుకుంటారు. సంఘంలో గౌరవం వస్తుంది. అంతేగానీ, పుస్తకాల్లో విషయాలు అమలుజరపడం మొదలుపెడితే పిచ్చివాడి క్రింద జమకట్టి అనర్హుడని, అసమర్దుదని దూరదూరంగా పోతారు ప్రజలు. అందుచేతనే మనజాతి చాల అధోగతిలో ఉందనుకోవాలి. భారతీయ సంస్కృతి అని పూర్వగాధాలు వల్లె వేస్తూ కాలక్షేపం చేయడం హాస్యాస్పదం.
        ధనమూ, విజ్ఞానమూ, సంస్కారమూ ఈ మూడు త్రిమూర్తులు. బ్రహ్మ-విజ్ఞానము, ఈశ్వరుడు-ధనము, సంస్కారము-విష్ణువు. ధనం సంపాదించడం (ఐశ్వర్యం) అతి సులభం, శివుడు సులభసాధ్యుడే గదా! అట్లాగే బ్రహ్మ కుడా - అంటే విజ్ఞానం కుడా. వీరిద్దరి అనుగ్రహం పొందినవారంతా రాక్షసులే. కానీ అతిదుర్లభుడు విష్ణువు . ఐశ్వర్యం నశించి, అహంకారం నశించి, అనేక బాధలతో కృశించి, చితికి, చివికి, "బలి" అయిపోయే దశలో ప్రత్యక్షమవుతాడు. బలి తలపై కాలుమోపిన ఘట్టంలో త్రివిక్రమూర్తి అదే చెబుతాడు. సంస్కారం అన్నిటికి అతీతమయినది. అంత దుర్లభమైనది.         ఇటీవల వార్తాపత్రికల్లో ఒక చిన్నవార్త లండన్ నుంచి వచ్చింది. ఒక బ్యాంకు భవనం కిటికీలో ఒక పావురం గూడు కట్టుకుందట. ఇక గ్రుడ్డ్లు పెట్టి పొదిగి పిల్లలై, పెద్దవై ఆకాశంలోకి ఎగిరిపోయేవరకు ఆ పావురం కాపురం అక్కడే. ఆ గూడు పెట్టిననాడు ఆఫీసు బంట్రోతు దాన్ని తీసివేసి తలుపులు వేయబోయాడు. కానీ ఆఫిసువారు ఆ బంట్రోతుకు గూడు తీసివేయవద్దని చెప్పి, వాళ్ళే ఆ గదిని ఖాళీ చేసి మరొక గదిలో పని చేసుకోవడం ప్రారంభించారట. పావురం కాపురానికి అంతరాయం కలిగించకుడదన్నారట. ఈ వార్తను పత్రికలో రెండుమూడు చదరపు అంగుళాల స్థలంలో ఎక్కడో మారుమూల వేసారు, ఏంటో అప్రధానమైన విషయంగా. నిజమే! కేన్నడీలు, కృశ్చేవ్ లు, ఆక్రమించుకున్న పత్రికల్లో పావురానికి తావెక్కడుంటుంది? నేనే గనుక సంపాదకుడిని అయితే ఆ వార్తను మొదటి పేజిలో మొదటి వార్తగా తాటికాయంత అక్షరాలతో ప్రకటించి ఉండేవాడ్ని. ఆ ఆఫీసువాళ్ళు ఎంత మంచివాళ్లో! వాళ్ళు ఏమి చదువుకుంటే ఏమి, చదువుకోకపోతే మాత్రమేమి, ఏ దేశమైతే ఏమి, ఆ దేశం గొప్పది. ఆ ప్రజలెంత ముందుకు వెళ్ళారు అని ఆశ్చర్యపడ్డాను. అభినందించాను, ఆలోచనలో పడ్డాను.        పావురానికి గది ఇచ్చారు వాళ్ళు. అదీ సృష్టి పరమార్ధం. చివరకు మొత్తం జీవజాలం అంతా మనకుటుంబంగా తీసుకోవాలి. కోళ్ళు, కుక్కలూ, ఆవులు, గేదెలూ, మన పిల్లలు, మనం అంతా ఒక కుటుంబం. మనలో మనకు అన్వయింపజేసుకునే ప్రజాస్వామ్యంలాంటి ధర్మాలు తదితర జీవవర్గాలకూ మనం అన్వయింపజేయాలి. గుర్రాలు, గాడిదలు, ఎడ్లు వీటీ మూపు మీద చిరకాలంగా మన స్వార్ధం కోసం మనం మోపిన దాస్య భారాన్ని తొలగించాలి. గడ్డిపరకల్ని కుడా గౌరవించాలి. ఇదీ సంస్కారం, ఇదీ మానవజాతి పరమార్ధం. చివరకు అక్కడికి వెళుతుంది సృష్టి పరిణామం. ఈ శిఖరాగ్ర స్థాయికి పూర్వం భారతీయ ఋషులు వెళ్ళారు. మన గ్రంధాలలో కనిపించే ఋష్యాశ్రమాలలో ఈ పరిస్థితులే అమలు జరిపారు. ఆశ్రమ మృగమూ పిల్లీ, ఎలుకా, పాము, కప్పా ఇత్యాదుల సామరస్యము, రాలిన ధాన్యమే గ్రహించి భుజించడమూ ఇవన్ని ఆ శిఖరాగ్రస్తాయినే ప్రతిబింబింపచేస్తాయి. అయితే ఈ లోకమంతా ఆ స్థాయికి వేళ్ళగలదా? క్రిక్కిరిసిన భూలోకం తిండికి దెబ్బలాడుకుంటూ ఉంటె అహింసకు తావేక్కడున్నది అనవచ్చు. కానీ ఇక్కడే యంత్రమూ, విజ్ఞానమూ మానవుడికి సహాయం చేస్తాయి. మానవుడు విజ్ఞాన పీయూషం తోటి ఆకలిదప్పులు జరామరణాలు జయిస్తాడు. ఇది సృష్టి పరిణామం. దీన్ని ఎవరూ ఆపలేరు. ఆత్మసౌందర్యమే మానవత్వం. సృష్టిపరిణామం మానవత్వం అయితే మానవుడికి పరమార్ధం విజ్ఞానం. మృగాల నుంచి మానవులను, మంచి మానవులను, అక్కడ నుంచి దేవతల్లాంటి మానవులను తయారు చేయడం ప్రకృతి స్వభావం. అయితే ప్రకృతి స్వభావాన్ని దినదినాధికంగా తెలుసుకోవడం మానవుడి స్వభావం. ప్రకృతి పరాకాష్ట దేవతలు ఆవిర్భవించడం అయితే మానవుడి పరాకాష్ట విజ్ఞానులు ఆవిర్భవించడం. మామూలు నేలమీద సంచరించే అమృతపూర్ణ హృదయులైన దేవతల్లాంటి వారూ గొప్పవారే. నిస్సంగులూ, వైజ్ఞానిక శిఖర సమారూడులైన జ్ఞానులూ గొప్పవారే. మంచివారి గొప్పతనం అర్ధం చేసుకోలేకపోతే మాత్రం మన జన్మలు వ్యర్ధం. గమనిక :  ఇంటువంటి ఒక మంచి వ్యాసాన్ని సాధ్యమైనంత మందికి పరిచయం చేయడమే.. దీనిని ఇక్కడ ప్రచురించడం వెనుక ఉన్న లక్ష్యం / ఉద్దేశం. అంతే కానీ ఈ వ్యాసంపై కుటుంబ సభ్యులకున్న హక్కుల ఉల్లంగన కోసం కాదు. అభ్యంతరమున్నచో తెలియచేయగలరు, తొలగించుటకు సిద్దం.
~~~~~ -:- ~~~~~       
0 notes
rdspot · 12 years
Text
మా కుల స్వామి - జి. కృష్ణ
మానవ సంస్కారం అంటే  ...... ?           మీరు ఎవరికైనా సహాయం చేసారా ?           అయితే ఎవడికో పెళ్ళికాని వానికి మీ అమ్మాయినిచ్చి పెళ్ళిచేసి, ఉద్దరించడం కాదు. వాడు మీరు సహాయం చేసినట్లు గుర్తించడు. వానిదేప్పుడు వక్రబుద్దే, వాడేప్పుడు క్రూరుడే, ఎప్పుడు శృంగారాసక్తుడే, తిండి తప్ప వేరే యావ ఉండదు. వాడు దశమగ్రహం, వాని సంగతి కాదు నేను చెప్పేది -            ఒకడికి మీరు గుమస్తా ఉద్యోగం ఇప్పించారు, వాడు, పైవారు ఒక్కొక్కరే ఛస్తూపోగా, వాడు, పైవాడు అయిపోయి మీకే అందుబాటులో లేనివాడైనాడనుకోండి.            అటువంటి వానిని, మీరు ఇదే నాయనా, నేను నీకు ఇంత సహయం చేసానురా అంటే, వాడు, వాని చుట్టూ చేరేవాళ్ళు మిమ్మల్ని చూసి నవ్వేస్తారు. అసలు వాడు మీకు దర్సనం ఇవ్వడు. మీరు చచ్చి చెడి ఉసూరుమంటూ నడిచి పోతుంటే చుసిగుడా, తన కారును ఆపడు. అదీ వాడి ముచ్చట. నేను ఉహించి, ఇంత ఉపోద్ఘాతానికి ఓడబడ్డాను.            ఇంకా కొంచెం చెప్తాను. ఎన్నడో 1948 లో - నేను ఆంధ్రపత్రికలో పనిచేస్తున్నాను - చెన్నపట్టణంలో - చాలా అభిమానంతో, ఎన్నడో ఆంధ్రపత్రిక ప్రారంభ కాలంలో దానిలో పనిచేసిన కృతజ్ఞతతో, కోటంరాజు పున్నయ్యగారు వచ్చారు. ఆయన ఆ తర్వాతి కాలంలో సింధ్ అబ్జర్వర్ స్థాపక సంపాదకుడు. ఆధునిక కరాచి నిర్మాణానికి కృషి చేసిన వాడు. పాకిస్థాన్ ఏర్పడినప్పుడు ఇక అక్కడ ఉండే వీలులేక తిరిగివచ్చేశాడు. ఆయన గారితో కబుర్లు చెప్పుకుంటున్నాం. ఇంతలో ఒక వృద్ధుడు, ఒక తోపుడు బండిలో మిఠాయి అమ్ముకుంటూ, రోడ్డు మీద పోవడం మా దృష్టికి వచ్చింది. పున్నయ్య గారు గబగబా కిందకు వెళ్లి, ఆ వృద్దునికి పాదాభివందనం చేసారు. ఆ వృద్ధుడూ, పున్నయ్యగారూ కౌగలించుకుని ఎడ్వసాగారు. నేనూ కిందకు పరుగెత్తాను. వాళ్ళు కౌగిలి నుండి విడివడి, తమ తమ కుటుంబాల వాళ్ళను గురించిన కుశల ప్రశ్నలు వేసుకుంటున్నారు.               సంగతి ఏమిటంటే - ఆ వృద్ధుడు,  సింధ్ అబ్జర్వర్ పత్రిక నిర్వాహక మండలి ప్రముఖుడు! అతడి ఆస్తిని పాకిస్థానిలు దోచుకోగా, అతడు తన వారిని చేరదీసుకుని కట్టుబట్టలతో భారతదేశానికి వచ్చివేసాడు! భగవంతుని దయ, అదే చాలుననుకుని తృప్తిపడి మిఠాయి అమ్ముకుంటున్నాడు!             పున్నయ్యగారు గబగబా కిందకు వెళ్లి, పాదాభివందనం చెయ్యకపోతే, ఆ వృద్దుడు ఏమి అనుకోడు! కాని అంతటి పని చేయకపోతే, పున్నయ్య గారే భాధపడతారు. అట్లా బాధపడటమే మానవ సంస్కారం. ఆపైన పున్నయ్య గారు ఆ వృద్ధుని వద్ద మిఠాయికొని, డబ్బులు ఇచ్చాడు! డబ్బులు తీసుకోనన్నాడు వృద్ధుడు! ఇద్దరు బావురుమన్నారు. ఏడ్పును మించిన సౌహార్ద ప్రకటన వేరేమున్నది? మాటలకు అతీతమైన సౌహార్దం.                పున్నయ్య గారు మా పత్రికా రచియుతల కులంలో || ఋషి ||                నాకు ఏవేవో జ్ఞాపకం వస్తూ ఉంటయ్యి. ఎవ్వరెవ్వరి సహాయమో అనుభవించాను. ఎవ్వరేవ్వరికో సహాయం                చేసాను. మనుషులం. ఒకరికొకరం సహాయం చేసుకోకుండా ఎట్లా బతుకుతాం?
0 notes
rdspot · 12 years
Text
భారత ప్రజాస్వామ్యంలో ఒక మాయని మచ్చ పళనియప్పన్.
                                  ....."చరిత్ర " అంటే గడిచిన కాలంలోని ఎన్నో మంచి, చెడు సంఘటనల సమాహారం అనుకుని ఒకసారి దానిలోకి తొంగి చుస్తే ఈ క్రింద వివరించినది " భారతీయ కాంగ్రెసు పార్టి " చరిత్రలో ఆంధ్ర ప్రాంతంలో జరిగిన ఒక ద్రుష్ట, దౌష్ట్య సంఘటన... మరిచిపోలేనిది. ఇంకిలాంటివి దేసవ్యాప్తంగా ఎన్ని జరిగి ఉంటాయో చెప్పలేము. సంఘటన అంటే అలాంటి ఇలాంటి సంఘటన కాదిది.  ఒక మనిషికి (అడ,మగ ఎవరైనా) " ప్రాణం కన్నా మానం ముఖ్యం " అని కదా మన సంస్కృతీ చెప్పేది, అది మరచి గ్రామాలలో కొంతమందిని ఆ గ్రామం మొత్తం చూస్తుండగా వస్త్రహీనులను చేసి బ్రతికున్న శవాలుగా మార్చిన ఒక సిగ్గులేని పార్టి ప్రతిభ ఇది ..........! ఆ ప్రజలు మన దేశానికి స్వాతంత్ర్యమోచ్చినందుకు సంతోషపడాలో, బాధపడాలో నిర్ణయించుకోలేని స్థితి కల్పించి, మన వారనుకున్న తోటి  భారతీయులకన్న, పరాయి వారైనా బ్రిటిషు వారే మంచివారని తలంచె విధంగా చేసిన సంఘటన ఇది. "అరాచకం " అనే పదానికి నిలువెత్తు అర్ధంగా, సాక్ష్యంగా చరిత్రలో మిగిలిపోయిన సంఘటన ఇది.
                              1948 సెప్టెంబరు 13 నుంచి 17 వరకు "ఇండియన్ యునియన్ మిలిటరీ" చర్య జరిగి మూడేళ్ళపాటు నాలుగువేల మంది కమ్యూనిష్టులను చంపటమే పనిగా పెట్టుకుని, రజకార్ల పేరుతొ లక్షలాదిమంది ముస్లింలను చంపి, దించిన నవాబును రాజప్రముఖ్ ని చేసి, ప్రభుత్వ సలహాదారు "వెల్లోడిని" ముఖ్యమంత్రిగా ప్రకటించి, జనరల్ జే.ఎన్ చౌదరి పాలన హైదరాబాదులో, నంజప్ప,పళనియప్పల పాలన గ్రామీణ తెలుగు నేలపై అమలుచేసిన ప్రజాస్వామ్యం నెహ్రూ,పటేల్ లది. ( అయితే నెహ్రూ గారికంటే పటేల్ గారు చాల మెరుగు అని నా వ్యక్తిగత ఉద్దేశం. ) పళనియప్పన్ దురాగతా��ు :             1948 లో కమ్యూనిష్టు పార్టి సాయుధ పోరాట మార్గాన్ని ఎన్నుకోవడంతో అప్పటి తెలంగాణా ప్రాంతాలలో నిజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా జరిగిన కామ్యూనిష్టుల తిరుగుబాటు, వారి సాయుధ పోరాటాన్ని ప్రజలు కుడా బలపరచగా అది ఐదేళ్ళ పాటు క��నసాగింది. దాని ఫలితంగా మూడువేల గ్రామాల్లో పదిలక్షల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని ఆ భూములను జనులకు పంచడం జరిగింది. అదే మార్గంలో సర్కారు జిల్లాల్లో సాయుధ పోరాటం జరుపుతున్న కమ్యూనిష్టు పార్టిని భారత ప్రభుత్వం నిషేదించింది. అజ్ఞాతంగా వున్నా కమ్యూనిష్టులను పట్టుకోవడానికి తీవ్రమైన నిర్భంధాన్ని ఉపయోగించింది. పళనియప్పన్ అప్పటి మద్రాసు రాష్ట్రంచే నియమింపబడిన ఒక పొలిసు, మానవ రూపంలో ఉన్న దానవుడు అని చెప్పుకోవచ్చు కుడా ...!  ( అప్పట్లో వారిని మలబారు పొలిసు అనేవారంట, ఎందుకంటే వారు పెట్టుకునే తోప్పి ఇప్పటిలాగా కాక విధవిధమైన మెలికలు తిరి ఉండేదట మరియు వారు పొడుగు నిక్కర్లు ధరించేవారుట. ) వాడు జరిపించిన దుష్కార్యాల జాబితా ఈ క్రింద పేర్కొన్నది : ** 1949 జూలై 14 న కృష్ణాజిల్లా, ఎలమర్రు గ్రామంలో, అదే నెల 16 న కృష్ణాజిల్లా కాటూరులో, అనుమానంపై గ్రామంలోని పురుషులందరినీ నిర్భందించి, గుడ్డలు వూదదీయించి, తమ స్త్రీల, తల్లితండ్రుల ముందే గాంధి విగ్రహం చుట్టూ తిప్పించింది భారత ప్రభుత్వ మిలటరీ. ౧.  నాటి తెల్లవారు జామున ఐదారువందల మంది సైనికులు గ్రామాన్ని చుట్టుముట్టారు.       వయోబెధాన్నిపాటించకుండా ప్రతి మగవాడ్ని పట్టి తన్నుకుంటూ విదులగుండా నడిపించి ఒక చోటికి చేర్చారు.       రెండువేల ఎనిమిది వందల మంది పైచిలుకు మగవారిని ఇలా చేర్చారు. వారిని మూడు తరగతులుగా       విభజించారు, 350 మందిని ప్రత్యేకించి విడదీసి వారిని కొన్ని వందల మంది సైనికులు కలిసికట్టుగా కర్రలతో       బాదారు. ఏది ఎలాంటి బాదుదో తెలియాలంటే, ఆ బాదుడులో రెండుబళ్ళకు పైచిలుకు ములుగర్రలు విరిగి       ముక్కలయ్యాయి. అవి కాక లాటిల సంఖ్య అతీతం. అప్పటికే స్పృహతప్పి పడిపోతున్న వారిని మొత్తం       దిగంబరులని చేసారు. మర్యాదని కాపడుకుందామని చేతులు అడ్డుపెట్టుకున్న వారినల్లా తిరిగి చేతులు       నలగగొట్టారు. ఆ తరువాత వారినందరినీ పంక్తులుగా నిలబెట్టించి, చేతులను నిలువుగా పైకేత్తించారు. ఆ       పంక్తులకు వెనుక రైతుల ఇల్లాండ్రను,తల్లులను కొందరిని పట్టి తెచ్చి నిలబెట్టారు. వారి వెనుకనే మిగిలిన       ప్రజల్ని తగినన్ని దెబ్బలు వడ్డించి నిలబెట్టారు. ఈ దిగంబరుల ఊరేగింపును దాదాపు       మూడుగంతలసేపు సాగించారు. పైకెత్తిన చేతుల్ని దింపనీయలేదు. " పొలిసు రాజ్యాని జై ", " గాంధికి జై " అనే       నినాదాలు ఇవ్వమని నిర్భంధించి అనిపించారు. ఆఖరున ఊరి మధ్యనున్న బాపూజీ విగ్రహం చుట్టూ ప్రదక్షిణం       చేయించి మద్యాహ్నం రెండు గంటలకు శవప్రాయులైన జనాన్ని వదిలివేశారు.       ఇలాంటి ఒక ఘోర సంఘటన జరిగితే అప్పటి కాంగ్రెస్సు ప్రభుత్వం వివరణ, దానికి  ఆంధ్రప్రభ అప్పటి       సంపాదకుడు "నార్ల వెంకటేశ్వరరావు" గారి సమాధానం ఇలా ఉంది.  (ఇట్టి దౌష్ట్యాలు జరిగి ఉండవని, ఇది        కమ్యూనిష్టుల దుష్ప్రచారం కావచ్చని మంత్రి మాధవ్ మీనన్ చెప్పినట్లు ఇప్పుడే తెలిసింది. ఆయన        ఊహ సరైనది కాదు, మా కార్యాలయానికి ఎలమర్రు, కాటూరు సంఘటనల గురించి        రాసినవారందరూ కాంగ్రేసువాదులే. ఆ గ్రామాలకు స్వయంగా వెళ్లి విచారణ జరిపిన మీదటనే వీరు        మాకు వ్రాసారు కుడా .)                                                                                   - నార్ల వెంకటేశ్వరరావు, జూలై 26, 1949, ఆంధ్రప్రభ. ౨.   ఎన్నో గ్రంధాలను, గ్రంధాలయాలను నాశనం చేసారు, వాటిలి కొన్ని. కాటూరులోని గ్రంధాలయంలో రెండువేల        రూపాయల ఖరీదుకు మించిన ప్రాచిన, ఆధినిక, ఆంధ్ర, సంస్కృత గ్రంధాలన్నీ ద్వంసం చేయబడ్డాయి. శ్రీ        గురజాడ మహాపురుషుని అముద్రిత రచన "ఋతుశతకం" వ్రాతప్రతి కుడా నాశనం చేయబడింది.        గాంధి,నెహ్రు ఆత్మ కధలు,ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం సంపుటాలు,కాంగ్రెసు చరిత్ర వంటి గ్రంధాల్ని పచారి        దూకాణాల్లో అమ్మేసారు. తెలప్రోలులోని "వేమన గ్రంధాలయం" లో ఎక్కడా దొరకని పుస్తకాలు,        పత్రికలు దొరికేవి. అంత చక్కని నిర్వహణ చూసి " శ్రీ వేలూరి శివరామశాస్త్రి " వంటి గొప్పవారు        ప్రశంసించారు. ఆ గ్రంధాలయం నామరూపాల్లేకుండా ద్వంసం చేయబడింది. ౩.   శ్రీ సుంకర సత్యనారాయణగారు 1930-32 లో సత్యాగ్రహోద్యమాలలో పాల్గొని, లాటిదేబ్బలకు గురిఅయి       జైలుశిక్ష అనుభవించారు.ఆయన నాటకాలు తెలుగునాట,వెలుపల ప్రదర్శింపబడి వేనోళ్ళ పొగడబడ్డాయి.       ఆయన్ను నెత్తురు కక్కెట్లు కొట్టి, అయన అముద్రిత రచనలను,తులసి రామాయణం గ్రంధాలను నాశనం చేసి       హింసించారు. ఇంకొక రచియుత శ్రీ వాసిరెడ్డి భాస్కరరావు గారిని అలాగే హింసించి నిర్బంధించారు. ఆయన       రెండేళ్లుగా శ్రమించి రచించిన "సారస్వత చరిత్ర" వ్రాతప్రతిని ద్వంసం చేసారు. ౪.  ప్రముఖ రచియుత "నార్ల చిరంజీవి" గారి తండ్రి, 89 సంవత్సరాల వయసున్న ముదుసలి అని కుడా       చూడకుండా అనేక సార్లు నిర్భందించి హింసించారు. ఆత్మాభిమాని అయిన రైతు గనుక ఆ అవమానభారాన్ని       సహించలేక అయన ఆ దిగులుతోనే మరణించారు. రచియుతల కుటుంబానికే రక్షణ లేని పక్షంలో ఒక       సామాన్య మానవుని పరస్థితి అర్ధం చేసుకోవచ్చు.
౫.  భారత ప్రభుత్వం సర్కారు జిల్లాల్లో కమ్యూనిష్టు పార్టిని నిషేదించిన తరువాత, సాయుధ పోరాటం జరుపుతున్న       వారిపై పొలిసు బలగాలు ఎన్నోదాడులు జరిపాయి. అలా కమ్యూనిష్టులను వెతికి, వేటాడి చంపడం జరిగింది,       అలా "పళనియప్పన్" తుపాకితో కాల్చి చంపన వారిలో నలుగురు కమ్యూనిష్టు యోధులున్నారు, వారు :       ౧. కడియాల నారాయణ రావు,   ౨. ఈడ్పుగంటి సుబ్బారావు,   ౩. నార్ల తాతారావు,   ౩. చీలీ రత్నం.       వీరిలో నారాయణరావు గారిని చంపడానికి ముందు "పళనియప్పన్" జీవితంలో చోటుచేసుకున్న కొన్ని       ఘటనలు గురించి ఇక్కడ వ్రాయడం సబబని తలుస్తున్నాను. పళనియప్పన్ గారి భార్యకు అప్పటికే నాలుగు కాన్పులు జరిగి పుట్టిన బిడ్డలు చనిపోవడమో లేక గర్భస్రావం అవ్వడమో జరిగిందట. అయితే ఆవిడ పళనియప్పన్ గారిని, మనుషులను వేదించడం / హింసించడం మానమని, అందువలనే వారికి బిడ్డలు కలగడంలేదని, కలిగినా బ్రతకడంలేదని  ప్రాదేయపదేదట. ఇదిలా ఉండగా ఆవిడ ఐదో కాన్పుకు సిద్దమైనప్పుడు అది కష్టసాధ్యంగా మారి విజయవాడలో వైద్యులు నమ్మకం చెప్పక, గుంటూరులో "చల్లపల్లి సాంబశివరావు" గారనే వైద్యులు ఉన్నారని, అయన దగ్గరకు తీసుకువెళ్తే ఉపయోగం ఉండచ్చని చెప్తే, అక్కడకి తీసుకువెళ్ళాడంట. అక్కడ ఆవిడకు సుఖ ప్రసవం జరిగి బిడ్డ బ్రతకగా ఆయన సంతోషంతో వైద్యుని చేయిపట్టుకుని ఇంత గొప్ప సహాయం చేసిన మీకు  నేనేం చేయగలను అని అడిగారట, అప్పుడు సాంబశివరావు  గారు "మనిషి లాగా బ్రతుకు, అదే చాలు" అన్నారట. ఈ వైద్యులు విజయవాడలో ఉండే "చల్లపల్లి శ్రీనివాసరావు"  గారికి సహోదరులు, ఈ శ్రీనివాసరావు గారికి "కడియాల నారయణరావు" గారి వియ్యంకులు (బావమరిది ). ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తరువాత "నారాయణ రావు" గారు పలానా చోట ఉన్నారని తెలుసుకున్న పళనియప్పన్ అక్కడికి వెళ్లి పట్టుకుని ఆయనను కాల్చి చంపాడంట.                                                                             *************************                      ఒక వ్యక్తి లేక సమూహం ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అనుమానం వచ్చినప్పుడు లేక నిర్దారణ అయినప్పుడు వారిని బట్టలుడదీసి గ్రామం మధ్యలో నుంచోపెట్టడమో లేక వెంటాడి వేటాడి చంపడమో చేయడం ప్రభుత్వం / ప్రభుత్వాధికారుల పని కాదు.  అలా చేస్తే అది నియంతృత్వం అవుతుంది, దాని వలన ప్రజాస్వామ్యంలో ఎవరికీ ఒరిగేదేమీ లేదు, అలాంటి దౌష్ట్య కార్యాలు జరుగుతున్నా అడ్డుకోలేని వ్యవస్థను ప్రజాస్వామ్యంగా చెప్పుకోవడం సిగ్గుచేటు అవుతుంది, స్వాతంత్ర్యం వచ్చిన తొలిరోజుల్లోనే అలాంటి ఘనత వహించిన పార్టి కాంగ్రెస్. ఇలాంటి వారిని నిర్భందించడం సమంజసం, కాని పళనియప్పన్ చేసిన, చేయించిన పనులు అయనలో మానవత్వం ఏమాత్రము లేదని చెప్పకనే చెప్తుంది మరియు ఆయనలోని మృగత్వానికి ప్రతీకగా నిలచిపోయాయి.       ఒక దేశంలో వ్యవస్థ ( ప్రజాస్వామ్య, పెట్టుబడిదారి, కమ్యూనిష్టు) ఏదైనా ఒక సగటు మనిషిగా కుదిరితే తోటి వారికి కొంత సాయమందించాలి లేదా ఊరకుండాలి. ఒక మనిషిని మనిషిగా పరిగణించి ఆదరించడం కనీస మానవ ధర్మం. కమ్యూనిష్టులుగా అనుమానం ఉన్న వారిని చంపినట్లితే అది పెద్ద వార్త / విశేషం కాకపోవచ్చు, ఎందుకంటే చరిత్రలో ఇంతకముందు ప్రాణం విలివ తెలియని ఎంతోమంది నియంతలు ఇలా చేసారు కాబట్టి...! ప్రాణాలు మాత్రమె తీసేసి ఉంటె నేను కుడా ఈయన గురుంచి ఇక్కడ వ్రాసేవాడిని కాదేమో ...! కాని ప్రాణం కన్నా విలువైన ప్రజల మానాలతో ఆడుకుని ఇంకెన్నో విద్వంసకర చర్యలకి నేతృత్వం వహించాడు ఈ పళనియప్పన్. అందరు చరిత్రలో మణులుగా మాణిక్యాలుగా ఉండరు కాబట్టి ఈయనను మనుషుల్లో మృగంగా, ఒక చరిత్రహీనుడిగా, మన రాష్ట్ర చరిత్రలో మాయని కళంకంగా ఉదహరించుకోవచ్చు / చెప్పుకోవచ్చు. నా వరకు నాకు ఇలాంటివెన్నో తెలుసుకున్న తరువాత అనిపించినదేమంటే మనం ఎంతో పెద్ద, గొప్ప ప్రజాస్వామ్యమనుకుంటున్న మన భారత దేశంలో "ప్రభుత్వం" అన్నది పిచ్చిమాట, విలువలేనిది. ఎవడు బలవంతుడో వాడిదే రాజ్యం, వీరి ప్రభుత్వం, వారి ప్రభుత్వం అన్నది నామ మాత్రమె, ఆ పిచ్చిమాటతో జనాలను నమ్మించి పిచ్చివాళ్ళను చేస్తున్నారంతే.....  మరి మనం భారతీయులుగా ఎం చూసి, ఎవరిని చూసి గర్వించాలయ్యా అంటే, మన పూర్వీకులైన మేధావులను, పూర్వం ఉన్న సంస్కృతిని చూసే...! ( పూర్వ సంస్కృతీ అని ఎందుకన్నానంటే  ఇంచిమించుగా సంస్కృతీ కుడా లేనట్టే, ఏదో అక్కడక్కడా చూస్తుంటాం ) .....!
0 notes
rdspot · 12 years
Text
నిజం నా యిజం - డాక్టర్ గుమ్మనూరు రమేష్ బాబు
* ఈ చేదు జీవితాన్ని                                                        జిందగీని జాదు చేసే స్వాదు కవిత్వంగా మూస పోసి                                            జంతర్ మంతర్ కవిని కాను నేను గాయాల కహాని వినిపిస్తూ                                                  నేను..... నేనే ! నిట్టూర్పుల నిహాని వినిపిస్తూ                                             కనురెప్పల క్రింద కలతలు దాచి                                            బాధల బస్తిలోంచి వెలికి వచ్చిన ఆక్రోశాన్ని చిరునగవుల వెనుక చింతలు మరచి                                      అన్యాయాన్ని అకృత్యాన్ని నిరచించే ఆవేశాన్ని ము 'భావ' కవిలా అడుగులు వేసుకుంటూ                            అభ్యుదయాన్ని కోరుకునే ఆశని ముంచుకొస్తున్న ఉప్పెనకు బయపడి                                     నిఖార్సైన సగటు మనిషి నిండి శ్వాసని ! మూలనున్న సత్రంలో కూచొని                                                     *          *         * చలికాచుకునే బాటసారిని కాను నేను                                    విప్లవమంటూ విచ్చుకత్తుల                                                                                      విపరీత దొరణులను అదేపనిగా నింపి        నేను  .... నేనే !                                                          విపరిమాణాల వికృత మనస్తత్వాలను                                                                                      విచ్చలవిడిగా రెచ్చకొట్టి చిచ్చుపెట్టి ఓటమిలోంచి పుట్టుకొచ్చే గెలుపుని                                        స్వార్ధంతో పట్టం కట్టి చికటిలోంచి తన్నుకొచ్చే వెలుగుని                                          సర్వం దోచుకోవాలని పట్టుబట్టి బూడిదలోంచి బతికివచ్చే ఫీనిక్స్ పక్షిని                                    పెనుమంటను దీపంగా చూపి నేను స్వేచ్చాజీవిని !                                                            వెలుగుకై ఆశపడి వచ్చే రెక్కల పురుగుల                                                                                      రెపరెపలాడే నూరేళ్ళ జీవితాలతో       *          *          *                                                     కలాలు పెట్టి ఆడుకునే                                                                                      ఇంక్వి 'లాభ' కవిని కాను నేను సంప్రదాయ వాదాలకు తలవంచి                                            నేను.... నేనే ! సంకుచిత మత గజాల నధిరోహించి                                                                                                                           బందిఖానా నుంచి బతుకును తప్పించే నేస్తాన్ని జీవితపు ఇంగితపు లోతుపాతుల్ని విడిచి                                  మరణమే పరిష్కారమైతే ప్రాణమిచ్చే సమస్తాన్ని అతీతానంద సంధాయకంలో అసలు స్పృహను మరచి                దీపంలా కాలినా వెలుగునిచ్చే జవసత్వాన్ని - సుఖశాంతుల కోసం తల్లడిల్లుతున్న                                        ఈ సమజానికి నిండు జీవాన్ని పిడికెడు హృదయంలోని కడలి ఆరాటాన్ని                               రాబోయే కాలానికి మూల భావాన్ని - జానెడు కడుపు నింపుకోవడం కోసం                                       నిజం నా యిజం వెంపర్లాడుతున్న నిత్యజీవన పోరాటాన్ని                                   నిజాయితే నా నైజం ! * పట్టించుకోక తలకేక్కించుకోక వృధా ప్రణయగీతాలు అల్లుకుంటూ మధుపాత్రల్లో కవితానికషోపలాలు చల్లుకుంటూ  **  ప్రెస్ అకాడమి వారి వెబ్ సైటులో ఏదో ఒక మాసపత్రిక నుండి సంగ్రహించినది.
0 notes
rdspot · 12 years
Text
ఎట్టకేలకు దసరా రోజున మైసూరు దర్శనం ...!
                                                     ఉద్యొగరిత్యా నేను బెంగుళురు మహనగరంలొ 2006 నుండి ఉంటున్నాను. అప్పటి నుండి ఎ సంవత్సరానికి ఆ సంవత్సరం దసరా / విజయ దసమి రొజున మైసూరు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే కుదరకపోయింది కాదు ....! అయితే ఇన్ని సంవత్సరాల తరువాత 6వ తేది  అక్టోబర్ 2011 న, నేను నా మిత్రుడు మణిదీప్ కలిసి బైక్ మీద మద్యహ్నం రెండు గంటలకు బెంగుళూరు నుండి బయలుదేరి సాయంత్రం ఐదు గంటలకు మైసూరు చేరుకున్నాము. మొదటగా మైసూరు పాలస్ కి వెళ్ళాం, ఎందుకంటే చాల మందికి తెలిసిన విషయం, దసరా రోజు పాలెస్ మొత్తం రకరకాల రంగు విద్యుత్ దీపాలతో అలంకరించి, కాసేపటికోసారి వేరే వేరే రంగుల కాంతితో ఆ రాజ భవంతి వెలుగులు విరజిమ్మే విదంగా ప్రదర్శన జరుగుతుంది. అది చూడడానికి రెండు కళ్ళు చాలవు, పైగా ఎంతసేపు చూసినా తనివి తీరదు. రాజభవంతి ఉన్న ప్రాంగణం మొత్తం జనాలతో క్రిక్కిరిసి ఉంది. విద్యుత్ దీపాల వెలుగులో భవంతి రంగు మారినప్పుడల్లా ప్రజలు కేరింతలు కొడుతూ ఆ దృశ్యాన్ని ఆస్వాదిస్తున్నారు.    
దసరా సందర్బంగా దీపాలతో వెలుగుతున్న మైసూరు రాజ భవంతి.
       అయితే మేము దసరా రోజున మైసూరులో జరిగే ఈ సందడి గురించి వివరాలు / ప్రణాళిక లేకుండా వెళ్ళాం కాబట్టి, అక్కడకు వెళ్ళాక గాని జరుగుతున్న / జరగబోవు కార్యక్రమాల గురించి తెలియరాలేదు ...! అక్కడ నాకు వచ్చిరాని కన్నడ బాషలో ఒకరిద్దరితో మాట్లాడితే తెలిసిన విషయమేమిటంటే, అదే రోజు మద్యాహ్నం ఒక గంట పాటు ప్రస్తుత రాజైన " అర్జున ఒడియార్ " మైసూరు రాజభవంతిలో పూజలు నిర్వహించి, ఆ పిదప కాస్త సమయం జనులతో గడిపి నిష్క్రమించారని ...! మేము అయనను చూడడానికి కుతూహలం కలవారమై అక్కడ నిరీక్షిస్తున్నామని చెప్తే, ఇక అయన అక్కడకు రారని " బన్ని మంటప " లో సాయంత్రం ఆరు గంటలపై మొదలయ్యే సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించడానికి వెళతారని తెలిసింది. మైసూరు నగర ప్రాంగణమంతా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన జనాలతో, వాహనాలతో  నడవడానికి కుడా కాళి లేనంతగా క్రిక్కిరిసి ఉంది. ప్రతి ప్రభుత్వ కార్యాలయం, బ్యాంకులు, పెద్ద పెద్ద వైయుక్తిక సంస్థలు విద్యుత్ దీపాలతో అలంకరించబడి ��న్నాయి. నేను ఉహించినదానికంటే చాల గొప్పగా పండుగ జరుగుతున్నట్లుగా నాకు తోచింది. ఇవన్ని ఒక ఎత్తయితే, నాకు ఏనుగు అంబారి చూడవలెనని బహు ఉత్సుకతగానుండెను, సరే అని మేము "బన్ని మంటప" కు వెళ్ళడానికి రాజ భవంతి నుండి రైల్వేస్టేషనుకు నడిచి వెళ్ళే దారిలో ( మా ద్విచక్ర వాహనము అచటనే వాహనాలు నిలిపే ప్రదేశంలో ఉంచితిమి ) నేను ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ గజరాజు అంబారి నాకు ఎదురైంది...ఇహ నా సంతోషానికి అవధులు లేవు. నా దగ్గర ఉన్న కెమేరాతో, ( సరైన లెన్స్ లేకపోయినను ) దానికంటే ముందు పరుగెడుతూ ఒక నాలుగైదు చిత్రాలు తీయగలిగాను. అక్కడ నేను చుసిన ఆ ఏనుగులు ఇప్పటివరకు నేను చుసిన అతి పెద్ద ఏనుగులు. ఇహ ..నా కోరిక తీరింది. :)        పై చిత్రాలు తీ��ిన మీదట, నేను ముందే చెప్పినట్లుగా, రైల్వేస్టేషన్లో ఉన్న మా ద్విచక్రవాహనాన్ని తీసుకొని "బన్ని మంటప్" కి వెళ్ళాము. అయితే అక్కడ కుడా జనాల తాకిడి తప్పలేదు. రాజుగారు అక్కడే మంటపంలో ఉండడంవలన ఏమో తెలియదు గాని గొప్ప  పోలీసు బందోబస్తు ఉంది. అక్కడకు వెళ్ళిన తరువాత మాకు తెలిసిన విషయమేమిటంటే దీనికి ప్రవేశం ఉచితం కాదు, కొంత ప్రవేశ రుసుము చెల్లించి ముందస్తుగా చీటీ పొందవలసి ఉంటుంది,  కాని మేము ఎనిమిదిన్నరకు చాల ఆలస్యంగా వెళ్ళాము  కావున ఉచిత ప్రవేశం కలిగింది. అది చాల పెద్ద " బాహ్య స్థలము - ఓపెన్ గ్రౌండ్ " , దగ్గర దగ్గర ఒక ఇరవై నుండి ముప్పై వేలమంది జనం ఉండి ఉంటారు, దానివల్ల రాజు గారిని చూసే అవకాశం దొరకలేదు, బయట అయన చిత్రపటం ఒకటి పెట్టారు, అక్కడ చూశానన్నమాట ...! అక్కడ క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న ప్రదర్సన ఈ క్రింది చిత్రంలో చూడండి, నాకైతే రోమాలు నిక్కపోడుచుకున్నాయి...!  :)                      అది ఒక సంభరం, ప్రజలు కోలాహలంగా క్రీడా ప్రాంగణమంతా క్రిక్కిరిసి ఉన్నారు. అక్కడ శిక్షణ పొందిన కొంతమంది మంటలతో రగులుతున్న నిప్పుగఱ్ఱలతో చేసిన విన్యాసాలు చెప్పనలవికానటువంటివి. అవి చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అనడంలో అతిశయోక్తి లేదు. చివరగా ఈ కార్యక్రమాన్ని తుది దశలో అయినా చుడగలిగినందుకు మాకు సంతోషం కలిగింది.            అక్కడినుండి రాత్రి తొమ్మిదిన్నర గంటలకు బయలుదేరి, రాత్రి ఇంటికి వచ్చేప్పటికి ఒంటిగంట అయ్యింది, రోజు మారిపోయింది... :( , వచ్చే దారిలో కర్ణాటకలో మంచి పేరుగల హోటల్ " కామత్ " లో రాత్రి భోజనం చేశాం ..! అక్కడ గడిపిన ఆ కొద్ది గంటల్లో నాకనిపించిందేంటంటే " దక్షిణ భారతదేశంలో దసరా / విజయదశమి  పండుగ మైసూరులో చాల రంగరంగ వైభవంగా జరుగుతుంది లేదా జరుపుకుంటున్నారు ". వీలుంటే తప్పక చూడవలసింది. ఇది సంక్షిప్తంగా " దసరా రోజున నా మైసూరు పర్యటన " గురించిన వివరాలు ...!
0 notes
rdspot · 12 years
Text
బహు బాషలు మిళితమైన మంచి తెలుగు సినిమా పాట !
                          నాకు సినిమా పైత్యం (మన బాష, పర బాష తేడాల్లేకుండా ఏ బాషైనా మంచి సినిమా అయితే చూసేస్తా)  కొంచెం ఎక్కువ. దీని వలనో ఏమో తెలియదు కాని, నా సహోద్యోగి ఒకరు "సిద్ధార్ద్" నటించిన 180 సినిమాలో " AJ " పాటలో అక్కడక్కడా వస్తున్న స్పానిష్ పదాలు ఎక్కడైనా దొరుకుతాయేమో అని నన్ను అడిగారు.
అయితే ఆశ్చర్యం కొద్ది  అప్పటికి నేను ఆ సినిమా గురించి విన్నాను గాని, పాటలు వినలేదు. ఆ విధంగా ఆయనగారి ద్వారా ఈ మంచి పాట వినే అదృష్టమో / ఆవకాశమో కలిగింది. ఆ పాట ఆయనను తాకినట్ట్లే నా హృదయాన్ని తాకింది. ఇప్పుడు ఆ పాటను సేకరించి దాని సాహిత్యాన్ని (స్పానిష్ తో సహా ) ఇక్కడ ఇస్తున్నాను. బాష ఏదైనా, అర్ధం కాకపోయినా సంగీతం మనిషిలో ఒక మంచి అనుభూతిని కలిగిస్తుందని ఎన్నో పరభాషా పాటలు వినడం ద్వారా అనుభవమయ్యింది. అటువంటి పాటలలో ఇది కూడా ఒకటి అనడంలో అతిశయోక్తి లేదని తలుస్తాను.                                                                                             
                           Song     : AJ Singers : Vidhu Prathap, Ramya S Kapadia Lyrics   : Vanamali Music    : Sharreth Movie   : 180 ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ పల్లవి: AJ - ఏ.జే  ఏవో చిరుపలుకులు రాని A ver si cuentas algun secreto (do you have any secret to tell me) గుండెల్లోంచి పెదవుల్లోకి పెదవుల్లోంచి నా ఎదనంటి మాటేదైనా రా....ని ... నీలో ఉన్న మాటలన్నీ నిలవము అని రాని ... చరణం 1: చేరువై దూరాన నిలేచేదేలా... ప్రేమనే ఆ మాటే పలికేదేలా... que si te puedes bailar que si te puedes agarrarme que si te peudes cantar que si te peudes enamorame (you can dance, you can hold me tight, you can sing you can make me fall in love) పలుకు భారమైనా.... మనసు నీడలోనా... నువ్వేనా.........                  || AJ || చరణం 2: నీ కలె చూశాకా కనుపాపలే.... ఏ కలా రానీకా వెలి వేసేనా.... eres el hombre para mi eres el unico que quiero yo u si te meuves para mi te voy a dar el poquito que te falta (you are the man for me you are the only one I want and if you move with me I'll give you what you need) చివరి శ్వాశలోనూ మొదటి శ్వాశలాగా..... నే రానా.....                          || AJ ||  A ver si cuentas algun secreto (do you have any secret to tell me) గుండెల్లోంచి పెదవుల్లోకి పెదవుల్లోంచి నా ఎదనంటి మాటేదైనా రా....ని ... నీలో ఉన్న మాటలన్నీ నిలవము అని రాని ...
0 notes
rdspot · 12 years
Text
ఇషాన్ ఆర్య
" ఏ చిత్రానికైనా కధా రచయుతే హీరో అని నా అభిప్రాయం. అతను మంచి సృజనాత్మక శక్తి కలవాడైతే, అతని ఆలోచనలకు చిత్ర దర్శకుని మేధస్సు తోడైతే, ఛాయాగ్రాహకుడికి ఒక విధమైన ఉత్తేజం, ఉత్సాహం ఏర్పడి, వాళ్ళు ఉహించుకున్న ప్రతి దృశ్యానికి జీవాన్ని, చైతన్యాన్ని రూపొందించగలుగుతాడు! "
         ..... అన్నారు " ముత్యాల ముగ్గు " చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రసిద్ధ చాయాగ్రాహకుడు ఇషాన్ ఆర్య - ' విజయ చిత్ర " జరిపిన ప్రత్యేక గోష్టిలో మాట్లాడుతూ.
                           1973 లో జాతీయ సమైక్యతపై నిర్మింపబడిన చిత్రాలలో ఉత్తమ చిత్రంగా బహుమతి పొందిన " గరమ్ హవా " ... ఛాయాగ్రాహకుడిగా ఇషాన్ ఆర్యకు యావద్భారత ఖ్యాతిని తెచ్చింది. ఆ చిత్ర నిర్మాతలలో అయన కుడా ఒకరు. 
" నా స్వస్థలం హైదరాబాదు. యుద్ధవిమానాలను నడిపే ' పైలట్ ' ఉద్యోగం చేయాలని మొదట అందుకు ప్రయత్నించాను. ఆ ప్రయత్నం ఫలించలేదు. ఆ తర్వాత 1962 లో బొంబాయి వెళ్లి అక్కడ యస్.ముఖర్జీ గారి పర్యవేక్షణలో 'కెమెరా' శాఖలో ప్రవేశించి - కొన్నాళ్ళు ఆ శాఖలో అనుభవం సంపాయించిన తరువాత కొన్ని డాక్యుమెంటరీ చిత్రాలకు పనిచేశాను. 66 లో షర్మిలా టాగూర్. సంజీవ్ కుమార్ నాయికా నాయకులుగా నటించిన ' నయాజనమ్ ' అన్న చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా పనిచేశాను, కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం విడుదల కాకపోయినా చిత్ర పరిశ్రమలో అందరికి నా గురించి తెలిసింది. 
డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాణ సందర్బంగానే శ్రీ యు.యస్.సత్యు, శ్రీ ఏ.ఏ.శివానీ గార్లతో పరిచయం లభించింది. మా అభిరుచులు ఒకటే కావడంతో మేము - ' యూనిట్ 3 ఎమ్.ఎమ్. ' అన్న సంస్థను స్తాపించాము. ' గరమ్ హవా ' హిందీ చిత్రాన్ని నిర్మించాము. శ్రీ బాపు గారికి,  శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ గారికి నా చిత్రీకరణ విధానం,నా ధోరణులు నచ్చాయి. మా మధ్య సాన్నిహిత్యం పెరిగింది. రమణగారు రూపొందించిన కధ నన్ను ఆకర్షించింది. ఆ విధంగా నేను ' ముత్యాల ముగ్గు ' చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా పనిచేసాను. " అన్నారు ఇషాన్ ఆర్య తను చిత్రసీమలోకి ఎలా ప్రవేశించింది వివరిస్తూ .
ప్ర. మీరు ఛాయాగ్రాహకుడిగా పనిచేసే చిత్రంలోని నటీనటులకు 'మేకప్' ప్రమేయం ఉండకూడదని అంటారని విన్నాము. 
    అందుకు కారణాలేమైనా చెప్పగలరా ?
జ. సాధారణంగా మన భారతీయ కళాకారులకు ఇక్కడున్న శీతోష్ణస్థితి, వాళ్ళకుండే సహజమైన వర్చస్సు ద్రష్ట్యా  -  మేకప్ 
    అనవసరమని నా అభిప్రాయం. పైగా మేకప్ ఆర్టిస్టులకు సైకలాజికల్ గా కొన్ని నిభంధలను సృష్టించి - వాళ్ళు స్వేచ్చగా తమ     
    పాత్రలను నిర్వహించడానికి అవరోధాన్ని కలిగిస్తుంది. అంచేతే మంచి ఫలితాలను ఆశించే ధోరణిలో ఎవరికీ మేకప్ 
    ఉండకూడదన్న నా అభిప్రాయంతో - బాపుగారు, రమణగారు ఎకిభవించారు. ( హనుమంతుడి విషయంలో వేరే మార్గం 
    లేదనుకోండి! ) అలా చిత్రం తీయడం ద్వారా ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయని నేను నిరూపించాను.
ప్ర. చిత్రం ఉత్తమమైన ధోరణిలో రూపొందించడానికి ఛాయాగ్రాహకుడిగా మీరు ఎటువంటి పద్ధతులు అవలంభిస్తారు ?
జ.  మొదట కధ విషయంలో నా అభిప్రాయలు చెబుతా��ు. స్క్రిప్టు తయారయ్యే ప్రతి దశలోను, అందుకు సంబంధించిన
     చర్చలలో పాల్గొంటాను. అప్పుడే రచయిత, దర్శకుడూ తమ చిత్రం ఎటువంటి దృక్పధంతో రుపొందించాలనుకున్నది 
     స్పష్టంగా తెలుస్తుంది. అలా కమేరామేన్ కు చిత్ర నిర్మాణంలో ఒక అవగాహన ఉండటం అవసరం. అది లోపించినప్పుడు 
     ప్రతి దృశ్యం సజీవంగా లేకపోయే ప్రమాదం ఉంది. మరో విషయం - ఇప్పుడున్న వాతావరణంలో 'అంకుర్' వంటి చిత్రాలు 
     చాల అరుదుగా రావడానికే అవకాశాలున్నాయి. అలాంటి చిత్రాలు నిర్మించాలన్న ఉదాత్తమైన భావాలుగల వారికి 
     పారితోషికాన్ని తగ్గించుకునైనా నేను ఆ చిత్రాలకు పని చేస్తాను. అలా అని 'ఫార్ములా' చిత్రాలకు పనిచెయ్యనని 
     బీష్మించుకుని కూర్చొను. బ్రతుకు తెరువుకు అటువంటి ఉద్దేశాలు ఆటంకాన్ని కలుగచేస్తాయి. అంచేత నా కెమెరా         
     పనితనం మీద నమ్మకం ఉన్న నిర్మాత భారీ ఎత్తున ఒక ఫార్ములా చిత్రం తీస్తూ ఆ చిత్రానికి పని చేయమంటే, నేను కోరిన 
     పారితోషకం లభిస్తే అటువంటి చిత్రాలకు కుడా నేను పని చేస్తాను.
ప్ర. ఉత్తమ చిత్రాలు విరివిగా రావడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది?
జ. ఈ విషయంలో ప్రభుత్వానికే ఎక్కువ బాధ్యత ఉంది. కాని ఆ బాధ్యతను ప్రభుత్వం సరిగ్గా నిర్వర్తించడంలేదు.      ప్రయోగాత్మక చిత్రాలు నిర్మించేవారు ప్రతి విషయంలోనూ ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. 'ఫార్ములా' చిత్ర నిర్మాతలు      సృష్టించిన వాతావరణంలో వాళ్ళు నిలదొక్కుకోలేక పోతున్నారు. ముడి ఫిలిమ్ సమస్య నుంచి రకరకాల పన్నులు,      సెన్సారింగ్ వరకు వాళ్ళు అన్ని రకాల ఒత్తిడులకు గురి కావలసి వస్తుంది. దాంతో ఒకరకమైన నిరుత్సాహం ఏర్పడుతుంది.      పైగా వినోదపు పన్ను విషయంలో కుడా ప్రతి నిర్ణయాలు చాల విచిత్రంగా ఉంటాయి. ఒక రాష్ట్రంలో ప్రభుత్వంచే "రోటీ కపడా      ఔర్ మకాన్ " చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపు లభించింది. అదే రాష్ట్రంలో "గరమ్ హవా" చిత్రానికి లభించలేదు!      మన ప్రజలు ఫార్ములా చిత్రాలు చూడడానికి అలవాటు పడిపోయారు. వాళ్లకు మంచి అభిరుచులు కల్పించడం చాల      ముఖ్యం. అటువంటి  మంచి రుచులను కల్పించే ధ్యేయంతో చిత్రాలు తీసే నిర్మాతలకు - కొన్ని సదుపాయాలు, కొన్ని        సౌకర్యాలు కల్పించాలన్న సదాభిప్రాయం ప్రభుత్వానికి ఉండాలి.
దర్సకత్వం పట్ల కుడా ఆసక్తి ఉన్న ఇషాన్ ఆర్య తను కుడా మొట్టమొదట కొన్ని 'ఫార్ములా' చిత్రాలు తీసి - బాగా ధనాన్ని ఆర్జించి ఆ తర్వాత ప్రయోగాత్మక చిత్రాలు తీస్తానని చెప్పారు. ఆ మాటల్లో ఇప్పటి చిత్ర నిర్మాణ వాతావరణం వల్ల ఆయనకున్న ఆవేశం స్పష్టంగా ధ్వనించింది. అయితే ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ యువతరం ఊరుకోదని త్వరలోనే ' వంశ వృక్ష ', ' సంస్కార  ', ' అంకుర్ ' వంటి చిత్రాలు విరివిగా రావడం, ఇప్పుడున్న ' ఫార్ములా ' చిత్రాల ధోరణులు క్రమక్రమంగా అదృశ్యం కావడం తధ్యమని ఆయన నమ్మకం. " ఆ నమ్మకంతోనే నా కృషిని కొనసాగిస్తాను " అన్నారు ఇషాన్ ఆర్య.
                                                                                                                       - నవంబర్ 1975 విజయచిత్ర నుంచి ....  
0 notes
rdspot · 12 years
Text
జాను తెనుగు - నేలటూరు వెంకటరమణయ్య
       " శివకవులు పలువురు జానుదెనుగును బ్రశంసించి యున్నారు. " అని శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రుల వారు చెప్పియున్నారు. కాని లెక్కించి చూడగా నీ మాటను వాడినవారివురే కానవచ్చుచున్నారు. వీరియందు మొదటివాడు నన్నెచోడుడు; రెండవవాడు లింగాయత కవి పాల్కురికి సోమనాధుడు.
      శివకవుల వైఖరిని ప్రభాకరశాస్త్రుల వారు ఇట్లు వివరించియున్నారు. "వీరశైవులలో గవిస్వరులగు వారు శివుని మీదను, దద్భక్తుల మీదను దక్క నితరులగు భవుల మీద నెప్పుడును గ్రుతులు జెప్పెడి వారు కారు. కావున వారికి శివకవులను పెరుగల్గెను. కర్ణాటాంధ్ర గ్రంధములలో శివకవుల ప్రశంస కలదు. శివకవులు భవికవులను గర్హించిరి. కవితలో కుడా వారు వేరు మతము వారయిరి." శివకవుల రీతి ఇట్టిదేయైనచో నన్నెచోడుని శివకవుల కోటి యందు జేర్చుట సమంజసముగా గాన్పించదు. ఏలన, శివకవుల వలె నితడు భవికవులను గర్హించలేదు. శివ, భవి భేదమునే ఇతడేరుగడు. శివకవులు ప్రశంసించని వాల్మికి,వ్యాసులను ప్రశంసించి యున్నాడు. తెనుగు కవీశ్వరుల నెన్నకపోవుట కప్పటికి తెనుగున గ్రంధములు చెప్పి పేర్కొనుటకు దగిన కవి ఎవ్వడును లేకపోవుటయే కారణము. కావున ప్రభాకరశాస్త్రుల వారిచే నిర్ణయింపబడిన శివకవి కోటిలో నితడు చేరడు. అట్లనుటచే నితడు శైవుడు గాడని భావించరాదు. శివుడే పరదైవమని నితని విశ్వాసము. కాని యాకారణముచే గవితా ప్రపంచమున నితడు మతభేదమును బరిగణించ లేదు. కావున "శివకవులు పలువు" రనుట కంటె  "నాంధ్ర  కవులు కొంద" రనుట సరియని తలచెదను.
నిర్వచనము ::
ఇక జానుదెనుగన నేమో విచారింతము. ప్రాచినులెవ్వరును దీనియర్ధమును నిర్వచించలేదు. వాజ్మయమునందలి ప్రయోగముల మూలమున దీని యర్ధమును సాధించవలసియున్నది. కాని యిట్టి ప్రయోగము లెన్నియో లేవు. లభ్యమైన యాంధ్ర గ్రంధములలో  మూడు నాలుగు మాత్రమే కానవచ్చుచున్నవి. ఇందొకటి నన్నెచోడుని కుమార సంభవములోనిది :
          సరళము గాగ భావములు జానుదెనుంగున నింపు పెంపుతో 
          బిరిగొన వర్ణనల్ ఫణితి పేర్కొన నర్ధము లోత్తగిల్ల బం 
          ధురముగ బ్రాణముల్ మధుమృదుత్వరసంబున గందళింప
          క్షరములు సూక్తు లార్యులకు గర్ణరసాయనలీల గ్రాలగాన్
ఇందు నన్నెచోడుడు దాను కావ్యమును జానుదెనుగున రచియించెదనని చెప్పెనేకాని యా జానుదెనుగు స్వభావ మిట్టిదని తెలియబరచలేదు. 
మరిమూడు ప్రయోగములు పాల్కురికి సోముని గ్రంధములందగపడుచున్నవి :
ఉరుతరగ్యపద్యోక్తులకంటే  -  సరసమై పరగిన జానుదెనుంగు చర్చించగా సర్వసామన్యమగుట  -  గూర్చెద ద్విపదల గోర్కె దైవార
                                                                                                                                                                                                                                                                            - బసవ పూరాణము.
ఆరూఢగద్యపద్యాదిప్రభంద  -  పూరిత సంస్కృతభూయిష్టరచన మానుగా సర్వసామాన్యంబుగామి జానుదెనుంగు విశేషము బ్రసన్నతకు.
                                                                                                                                                                                                                                                                           - పండితారాధ్యచరిత్ర
ఈ ద్విపదల వల్ల గధ్యపద్యాది ప్రభంధ సంస్కృత భూయిష్టము గానిది జానుదెనుగని బోధపడుచున్నది. ఇంతేకాదు; 
వృషాధిపశతకమున జానుదెనుగు స్వరూపమిట్టి దని  -
          బలుపోడతోలు సీరమును బాపసరుల్ గిలుపారు కన్ను వె 
          న్నెలతల సేదుకుత్తుకయు నిండిన వేలుపుటేరు వల్గుపూ
          సల గల రేని లెంకనని జానుదెనుంగున విన్నవించెదన్
          వలపు మదిం దలిప్ప బసవా బసవా బసవా వృషాధిపా 
అనుపద్యమున స్పష్టపరిచి యున్నాడు. కావున పాల్కురికి సోముని మతమున జానుదెనుగన అచ్చతెనుగని తెలియవచ్చుచున్నది. పాల్కురికి సోముని వ్రాతను జూచియే కాబోలు శ్రీకోరాడ రామకృష్ణయ్య గారు ఇట్లు వ్రాసియున్నారు :
    " Palkuriki Somanadha has declared in the introduction to his works that he underlook to write in what is called Janu-Telugu and Dvipada metre, because the Sanskritic style adopted by the Champu writers could not easily be understood by the general masses. "
శ్రీ  శ్రీపాద లక్ష్మీపతి సాస్త్రులవారిది యచ్చ తెనుగని స్పష్టముగా జెప్పియున్నారు.
" తెనుగు దేశిలో వాడుకలో నున్న తెనుగు మాటలను జానుదెనుగని వాడిరి. అదే అచ్చతెనుగు. జానుదెనుగున కుదాహరణముగా నీయబడిన సోమనాధుని పద్య మచ్చ తెనుగుననే రచించబడెను గదా. "
సోమనాధుని వాక్యములు జానుదెనుగున నచ్చ తెనుగను భ్రమను గలుగ జేయుచున్నను వాస్తవము విచారించగా జానుదెనుగునకు సరియైన యర్ధ మది కాదని తోచుచున్నది. ఏలన, సోమనాధుని రచన లచ్చ తెనుగు కబ్బములు కావు.
ఇతరాంధ్ర కవులను బోలె ఇతడును సంస్కృతాంధ్ర మిశ్రబాషనే వాడియున్నాడు. తిక్కన సోమయాజి కవన మందుబోలె ఈతని కవనమందును సంస్కృత పదములకంటెను తెనుగు మాటలే యధికముగా గానవచ్చుచున్నవి. అంతమాత్రముననే ఇతని గ్రంధముల బాష యచ్చ తెనుగని చెప్పుట తగదు గదా! జానుదెను గచ్చతెనుగే యైన పక్షమున నితడు జానుదెనుగున గ్రంధములను రచించితినని చెప్పినది పోల్లుమాట, దబ్బఱ యనుకొనవలసి వచ్చును. కాని సోమనాధుడు దబ్బఱలాడెననుట   విశ్వసింపదగిన విషయము కాదు.  మరియు " గధ్యపద్యాది ప్రభంధపూరిత  సంస్కృతభూయిష్టము గాని రచన జానుదెను " గని సోమనాధుడు నిర్వచించి చెప్పుచుండ. గద్యపద్యాత్మకమును, సంస్కృత భూయిష్టము నగు కుమారసంభవమును దాను జానుదెనుగున రచియించితినని నన్నెచోడుడు దెల్పుచున్నాడు. దీనివల్ల వీరిరువురును " జానుదెనుగు " నొక్క విధముగ నర్ధము జేసికోనక భిన్నమార్గములను ద్రోక్కినట్లు తెల్లమగుచున్నది. ఒక్కమాట యర్ధమును చేసుకోనుటయం ది ఇరువురును  పరస్పర విరుద్ధ మార్గములు ద్రోక్కుట చూడ జానుదెనుగున కీ రెండుమార్గములను సమన్వయ పరిచేడి సామాన్యార్ధమేదో యుండ వలెయునని తోచుచున్నది. ' జానుదెనుగు ' , సమస్త పదము. జాను+తెనుగు  అను రెండు మాటల కలయిక వల్ల నది ఏర్పడుచున్నది.  దీనియందలి ' తెనుగు ' భాషానామము; ' జాను ' శబ్ద మా బాషా స్వభావమును దెలుపుచున్నది. కావున ' జాను ' శబ్దార్ధమును దేలిసికోనగలిగితినేమి ' జానుదెనుగు ' యొక్క స్వభావము కొంతకు గొంతయేని బోధ కావచ్చును. ' జాను ' శబ్ధము దేశ్య శబ్దమని సీతారామాచార్యులుగా రభిప్రాయపడిరి. ఇది జ్ఞానశబ్దభవ మనియు, ' జాణ 'కు దోబుట్టువనియు నేను తలచెదను. దీనికి ' అందము '. ' సౌందర్యము ' అని యర్ధము. ' జానుదెను 'గనగా ' సొంపైన లేక నుడికారము గల తెను 'కానీ యన్వయము చేసికొనవలయును. బాషాసౌందర్యమును, నుడికారమును కవులెల్ల నర్ధించు గుణములే. తెనుగు కవులు జానుదెనుగును ప్రసంసించినట్లు కర్ణాటకులు ' జాణ్ణుడి 'ని ( జానుకన్నడము ) బ్రసంసించి యున్నారు. ఒక యుదాహరణము  -  జన్నుడు అనంతనాద పూరాణమున దన కవితను బెంపొందించెడి గుణముల నిట్లు పేర్కొని యున్నాడు :
     ఎనగనుకూలమక్కె గుణవమన్న జాణ్ణుడి పంపనింపు పో  న్నగబగె నాగవమన్న బహుజ్ఞతె రన్నన కాంతి నాగచం ద్రన రసభావ మగ్గళన వక్రతె నేమియు దేసె పుష్పబా
ణన మృదుబంధ మీకవిగళళ్తె జినేంద్ర పురాణ కర్తృగళ్
కర్ణాట జాణ్ణుడియే జానుదెనుగునకు మాతృక యని తలచెదను. తెనుగున గావ్యరచన లేని కాలమున నూతనాంధ్ర కావ్య నిర్మాణమునకు గడంగిన నన్నెచోడుడు కర్ణాట వాజ్మయము నుండి పెక్కు విషయములను గ్రహించినట్లు ' జాణ్ణుడి ' గొని దానిని ' జానుదెనుగు 'గ మార్చెననియు, నతని గ్రంధము నుండి పాల్కురికి సోముడు దీని గైకోనేననియు తలచెదను. ఇది ఎట్లున్నను జానుదెను గనగా " సొంపైన తెను "గనియె అర్ధము చేసుకోన వలయును. ఈ సోంపు రూపెట్టిదని నిర్ణయించవలసి  వచ్చినప్పుడు అభిప్రాయ బేధమున కెడము గల్గినది. నన్నెచోడుడు గద్యపద్యాత్మకమును, సంస్కృత భూయిష్టమునైన   తెనుగే  సొంపైనదని తలచెను; పాల్కురికి సోముడు ద్విపద రూపమును, సంస్కృతభుయిష్టము కాని తెనుగే సొంపైనదని అభిప్రాయపడెను. జానుదెనుగున కర్ధమున నభిప్రాయ బేధమున కెడము లేకపోయినను వస్తుస్వభావ నిర్ణయ సందర్బమున వ్యక్త్యభిరుచి భిన్నత్వము వలన నన్నెచోడ, పాల్కురికి సోమనాధుల యందభిప్రాయ భేదము గానవచ్చుచున్నది.
0 notes
rdspot · 12 years
Text
శ్రామికజన బాంధవుడు " సర్దార్ గౌతు లచ్చన్న "
                                                           నేను చాల సందర్బాలలో " గౌతు లచ్చన్న " గారి గురించి వినడం జరిగింది,  కాని ఆయన జీవిత చరిత్ర  మరియు స్వాతంత్రోద్యమంలో ఆయన పాత్ర గురించి కొన్ని రోజుల క్రితం ఒక పుస్తకంలో చదివే వరకు పెద్దగా తెలియదు. ఇప్పుడు నేను చదివి తెలుసుకున్న విషయాలను ఇక్కడ ఇవ్వదలుచుకున్నాను, ఆ విధంగా ఈ టపా కొంతమందికైన ఉపయోగపడితే అదే చాలు.
 సర్దార్ గౌతు లచ్చన్న  1909 ఆగస్టు 16వ తేదీన ఇప్పటి శ్రీకాకుళం జిల్లా సోంపేట తాలుకా బారువా అనే సముద్రపు ఒడ్డున ఉన్న మేజరు పంచాయితిగా ఉన్న గ్రామంలో శ్రీ చిట్టియ్య - రాజమ్మ దంపతులకు జన్మించారు. వారిది కల్లుగీత కుటుంబం. వారిని గౌడ అని కొన్ని ప్రాంతాలు, ఈడిగ అని కొన్ని ప్రాంతాలు, గౌ౦డ్ల అని వివిధ నామాలతో పిలుస్తారు.
అప్పుడు శ్రీకాకుళం జిల్లా అనేది లేదు. ఈనాటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మాడు కలిపి " విశాఖ జిల్లాగా " ఉండేది. దీనిని ఉత్తరాంధ్ర అని కుడా పిలుస్తుండేవారు. ఒరిస్సా ఏర్పడక పూర్వం ఈ గ్రామం గంజాం జిల్లాలో ఉండేది.
స్వాతంత్ర్య పోరాటంలో ప్రవేశము ::  
1930 ఉప్పు సత్యాగ్రహ ఉద్యమ సందర్బముగా శ్రీకాకుళం జిల్లా, నౌపడా ఉప్పు కొఠారులపై. ఆనాటి గంజాం జిల్లా ఆంధ్ర కాంగ్రెసు ఆధ్వర్యంలో 1930 ఏప్రియల్ నెలలో సాగించిన సత్యాగ్రహ దాడి చూడడానికి వెళ్లి, ఉత్తేజితుడై ఆ శిబిరంలో చేరిన నాటి రాత్రే పోలీసులు దాడి చేసి వారిని అరెస్టు చేసి కఠిన కారాగారశిక్షకు గురిచేసారు. అదే ఆయన రాజకీయ రంగ ప్రవేశము. 1936 ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధిగా వెళ్ళినప్పుడు ప్రప్రధమంగా గాంధి మహాత్ముని దర్శించి ఆయన ఉపన్యాసమును విన్నారు.
                      1940లో హరిపూరా (గుజరాత్ )లో జరిగిన కాంగ్రెస్ మహాసభ అద్యక్షుడిగా, నేతాజీ సుబాష్ చంద్రబోసు, డాక్టరు భోగరాజు పట్టాభి సీతారామయ్యగారి గారిని ఓడించి ఎన్నుకోబడినప్పుడు "  డాక్టరు భోగరాజు పట్టాభి సీతారామయ్యగారి ఓటమి నా ఓటమే " నని గాంధి గారు ప్రకటించడము, కాంగ్రెస్ కార్యవర్గ ఏర్పాటుకు సహకరించకపోయినందున సుబాష్ చంద్రబోసు కాంగ్రెస్ కు రాజీనామా ఇవ్వడం జరిగింది. గాంధి మాహత్ముని " క్విట్ ఇండియా " ఉద్యమ ఫలితం వల్లనైతేనేమి, మీరట్ కాన్స్పెరసి, కాకోరి బాంబు కేసు, లాహోరు బాంబు కేసు మున్నగు సంఘటనలులో చంద్ర శేఖర్ ఆజాద్, భగత్ సింగ్ వంటి విప్లవ వీరులు సాగించిన పోరాటాల వల్లనైతేనేమి, చివరిసారిగా నేతాజీ నెలకొల్పిన " ఆజాద్ హింద్ ఫౌజ్  " వీరులు " చలో డిల్లి " నినాదంతో సాగించిన సాయుధ విప్లవ పోరాటంలో వేలాది మంది వీరులు, బ్రిటీషు సామ్రాజ్యవాదుల ఫిరంగులకు బలికాగా రెడ్ ఫోర్టులో నిర్బందించబడిన  ఆజాద్ హింద్ ఫౌజ్  వీరులపై నిర్వహించిన " కోర్టు మార్షలు " విచారణలో జాతీయ కాంగ్రెస్ అగ్రశ్రేణి నాయకులు,అంతర్జాతీయ ప్రఖ్యాతికల న్యాయవాది "స్వర్గీయ బూలాభాయ్ దేశాయ్" ఆజాద్ హింద్ ఫౌజ్ వీరులు భారతదేశ స్వాతంత్ర్యానికి ప్రాణాలు అర్పిస్తూ విరోచితమైన పోరాటాలు జరిపిన అత్యున్నత శ్రేణికి చెందిన దేశభక్తులు , త్యాగశీలురేకాని దేశద్రోహులు కారని రోజుల తరబడి వాదించి వారిని భంద విముక్తులు కావించారు.
రైతుబాంధవుడు ఆచార్యరంగా గారు అద్యక్షులుగానున్న ఆనాటి కిసాన్ కాంగ్రెస్ కమీటీ పక్షాన ఐదుగురు సభ్యులం గాంధి మహాత్ముని వద్దకు రాయభారానికి వెళ్ళాం. అప్పట్లో ఉన్న ఆహార పదార్ధాల కంట్రోలువల్ల పల్లెటూరి రైతుప్రజల కడగండ్లను వివరిస్తూ కంట్రోళ్ళని రద్దు చేయించాలని కోరుతూ మంత్రి మండలి నుండి రాజీనామా ఇచ్చిన బాబు రాజేంద్ర ప్రసాద్ స్థానంలో  రైతు ప్రతినిధిగా ఆచార్య రంగాను మంత్రి మండలిలోకి తీసుకునేడట్లు చేయమని మూడు పేజీల మేమరాండము గాంధి మహాత్మునికి అందచేయదమైనది. దానిని మొదటి నుండి చివరిదాకా మాతోనే చదివించుకొని మాహత్ముడు చెప్పిన ఆవేదనపూరిత సమాధానాలకు మేము ద్రిగ్ర్బాంతి చెందాము : -
                            " ప్రపంచంలో మీలాగనే అనేకమంది నా మాట మీదనే భారత ప్రభుత్వం నడుస్తున్నదని బ్రమ పడుతున్నారు. అది శుద్ద అబద్దం. నా చుట్టూ అంధకార మేఘాలు అలముకొని ఉన్నాయి, నేను ఎంతకాలం బ్రతికిఉంటానో చెప్పలేను. రైతులకు న్యాయం చేయడంలేడనే మీ అభిప్రాయంతో నేను ఏకిభవిస్తున్నాను. నెహ్రు పండితుడు బస్తిలలో పుట్టి విదేశాలలో పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారేకాని, పల్లెటూరి రైతు కూలి ప్రజల జీవితంపై అవగాహన లేదు, సర్దారు పటేల్ రైతు కుటుంబంలో పుట్టినా, బస్తీలలోనే పెరిగి పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారేగాని, ఆయనకు రైతు కూలీల జీవిత విదానంపై అవగాహన లేదు. ------  నేను కోరే ప్రభుత్వం, చదువు సంధ్యలు లేకపోయినా నీతి - నియమాలు కలిగిన ఒక సాదారణ రైతు ప్రధానిగా ఉండి, ఆయన దగ్గర పండిట్ నెహ్రులాంటి విజ్ఞానవంతులు , కార్యదర్శులుగా ఉండి పరిపాలన సాగించాలి అని అన్నారు.
ఎస్టేట్ , జమిందారి, ఇనాందారి విధానంపై పోరాటం ::
1930-31-32 ఉప్పు సత్యాగ్రహం, కల్లుసారా దుకాణాల పికెటింగ్ లలో తనచుట్టూ వందలాది కార్యకర్తలను చేర్చుకొని వీరవిహారం చేసి, సర్దార్ అనిపించుకున్న లచ్చన్న. చీకటి ఎస్టేట్, జలంతర ఎస్టేట్, మందస ఎస్టేట్, నందిగాం ఎస్టేట్, ఉర్లాంపాడు ఎస్టేట్, పాచిపెంట ఎస్టేట్, విజయనగరం ఎస్టేట్ ఇలా మరికొన్ని గ్రామస్థాయి ఎస్టేట్లు, జమిందారిలు, ఇనాందారిలు రైతాంగాన్ని  నిలువుదోపిడి చేస్తూ భాదిస్తున్నాయి. ఉత్తరాంధ్ర అంతా హేచ్చుభాగం వందలకోలదిగా ఎస్టేట్లు, జమిందారిలు, ఇనాందారిలే. రైతాంగానికి చదువు సంధ్యలు లేవు. వెనుకబడిన ప్రాంతం. పోలీసును చూచినా, ఎస్టేట్ అధికారులను చూచినా భయాందోళనలు. ఎలాగో భాదలు భరించాలేకాని ఎదురు తిరిగే శక్తీ లేదు, నాయకత్వము లేదు.  అందునా ఆ రోజుల్లో - "న విష్ణుః ప్రుద్విపతిః" అనేది ధర్మం. రాజును మించిన దిఅవం వేరేలేదని దీనర్ధం. ప్రజలలో రాజరికాలన్నా,జమిందారిలన్నా, ఇనాందారిలన్నా, భక్తిభావంతో ఉండేవారు. ఎన్ని కష్టాలు మరిన్ని నష్టాలు అయినా " పూర్వజన్మ పుణ్యఫలం " అని సర్డుకునిపోయే స్వభావంతో ఉండేవారు.
రైతు రక్షణ యాత్రలు - సర్దార్ లచ్చన్న ::
1930 - 40 ల మధ్యకాలం ప్రపంచంలో ఆర్ధిక సంక్షోభం వేయి పడగలతో బుసకోట్టింది. రైతాంగం మొత్తం ఈ సంక్షోభంలో మునిగిపోయింది. 90 శాతం రైతులు ఋణగ్రస్తులయ్యారు. భూములకు విలువ పడిపోయింది. ఇక వ్యవసాయోత్త్పత్తుల ధరల సంగతి పరికిస్తే - బస్తా ధాన్యం అయిదు రూపాయలు, ఇక అప్పులు తీరే అవకాశం లేనేలేదు. అప్పుడప్పుడే రైతుల సంఘటితమై, రైతు సంఘాలు, రైతు ఉద్యమాలు, ప్రారంభమైనాయి. 1938 - 40 హరిపుర్రా త్రిపురా కాంగ్రేసులలో, కాంగ్రెసుకు అనుభందంగానైనా, రైతు సంఘాల నిర్మాణం అవసరమనే నినాదం బయలుదేరింది. దీనికి ప్రధానంగా బాద్యులు ఆచార్యా రంగా, స్వామీ సహజానంద, రాహుల్ సాంకృత్యాయన్, ఇందులాల్ యాగ్నిక్, పుల్దెల శ్యామసుందర రావు, సర్దార్ లచ్చన్నలు. ఈ మహానాయకుల మద్య అప్పట్లో వయస్సులో చిన్నవాడు లచ్చన్న. ఆంధ్రలో లచ్చన్న ప్రజా ఉద్యమాలు, స్వాతంత్రోద్యమంలో, ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని వీరోచిత పోరాటం సాగించి సర్దార్ గా ప్రజల ఆదరాభిమానాలు అపారంగా పొందారు.
                        అఖిల భారత కిసాన్ సభను పలాసాలో జరపాలంటూ స్యామసుందరరావు తీర్మానం ప్రతిపాదించగా లచ్చన్న దాన్ని బలపర్చారు. రైతు రక్షణయాత్ర ప్రధాన ఉద్దేశం, ఒకటి రైతుల రుణ నివారణకు చట్టం చేయడం, రెండు జమిందారి జాగిర్దారి, ఇనాందారి, ఎస్టేట్లను రద్దుచేసి భూమిపై యాజమాన్య హక్కును రైతులకు అందించడం.  1945 లో రంగా రూపొందించి ప్రతిపాదించిన " కిసాన్ మజ్దూర్ ప్రజారాజ్ " అనే ప్రజాస్వామిక సమసమాజ నిర్మాణ పదానికి మహాత్ముడు ఆమోద ముద్ర వేసారు కుడా ..! రైతులు,కూలీలు, గ్రామీణ ప్రజల అభ్యుదయమే కాంగ్రెస్ అవయంగా ఉండాలంటూ, అనేక సందర్భాలలో మహాత్మాగాంధీ నిర్ద్వందంగా ప్రకటించారు. రైతు రక్షణయాత్ర ఇచ్చాపురంలో నవంబరు 7 న ఆచార్య రంగా జన్మదినోత్సవ సందర్భంలో ఆయనే ప్రారంభించారు. ఇరవై వేలమంది రైతు, కూలీ గ్రామీణ ప్రజలు రైతు రక్షణయాత్ర మహోత్సవంలో పాల్గొన్నారు.
                          యాత్ర రెండు మాసముల పర్యంతరం సాగి 1512 మైళ్ళు కాలినడకను, వందలాది కేంద్రాలలో పెద్దఎత్తున మహాసభలు జరిపి, జమిందారి, జాగిర్దారి, ఇనాందారి విధానాలు రద్దుచేస్తూ శాసనం చేయాలని, వ్యవసాయ రూణాలపై మారుటోరియం ప్రకటించాలనే మేమోరాండములపై లక్షలాది రైతుల సంతకాలు చేయించడం జరిగింది. పుల్లెల శ్యాంబాబు, లచన్న గార్ల నాయకత్వాన మద్రాసులో రాజగోపాలచారి ప్రధానిగా ఏర్పడిన కాంగ్రెస్ మంత్రి మండలికి ఆ  మేమోరాండమును సమర్పించారు. జమిందారి రద్దుకు రెవిన్యూమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారితో కూడిన జమిందారి ఎబాలిషన్ ఎంక్వయిరి కమిటి నియమించారు. ఈ కమిటి ఆంధ్ర పర్యటనలో, సర్దార్ లచ్చన్న నాయకత్వంలో సాక్ష్యాలు సేకరించడం, మేమోరాండములు సమర్పించడం మున్నగు కార్యక్రమాలు జయప్రదంగా సాగాయి. ఈ కమిటి ద్వారా జమిందారి రైతులకు, రైతాంగ ఉద్యమాలకు విజయం చేకూరింది. లచ్చన్న ఆంధ్ర ప్రజలలో తిరుగులేని నాయకుడుగా మకుటంలేని మహారాజుగా, దిన దిన ప్రవర్ధమానంగా ఆంధ్ర రాజకీయాకాశంలో దృవతారగా వెలుగొందారు. ఇక రెండవ అఖండ విజయం. మద్రాసు శాసనసభ " రైతు రుణ విమోచన చట్టం " ని ఆమోదించి శాసనం చేసింది. లక్షలాది రైతాంగం రుణాల ఊబినుండి బయటపడి ఊపిరి పీల్చుకున్నారు. అది నేటికి అమలులో ఉన్నది. " వ్యవసాయ రుణాలపై మారుటోరియం - సర్దార్ లచ్చన్న " అన్న శీర్షికతో వేరుగా ప్రచురించడం జరిగింది.
భూమి హక్కును హరించి, రైతులను దిక్కులేని మూకలుగా మార్చే 17 వ రాజ్యాంగ సవరణ బిల్లు - సర్దార్ లచ్చన్న ::
                17 వ రాజ్యంగ సవరణ బిల్లు  - ఈ బిల్లు పార్లమెంటులో నేగ్గినట్లయితే రైతాంగానికి ముంచుకొచ్చే ప్రమాదాన్ని గురించి అంతా మరిచిపోయి ఉంటారు. జమిందారి, ఇనాందారి విదానాన్ని రద్దుచేయు సంధర్బంలో వారి భూములను 9 వ షెడ్యులులో చేర్చుతూ, శాసనం చేయబడింది. ఈ షెడ్యులులో జమిందారి భూములను చేర్చడమంటే - జమిందారుల నుండి స్వాదినం చేసుకోననున్న భూములు, ఎలాంటి పరిహారం చెల్లించనక్కర్లేకుండా స్వాదినం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. అంతేకాకుండా ఆ భూమిని సాగుచేసుకుంటున్న రైతుకు యాజమాన్యపు హక్కు కలిగించడంతో ఆగకుండా, ప్రభుత్వ శాసనమును సుప్రీంకోర్టులో సవాలు చేసుకునే వసతిని కుడా రద్దుచేయడం జరిగింది. దీనికి రైతులు హర్షించారు.  రైతుల ప్రయోజనం కొరకే శాసనం చేయబడింది. ఈ శాసనం చేయడంలో, ఆచార్య రంగా, నెల్లూరు వెంకట్రామనాయుడు,బెద్దపూడి వెంకటనారాయణ రెడ్డి, కటికినేని సోదరులు, వివిధ రాజకీయ పార్టీల పాత్ర ఉన్నది.
9 వ షెడ్యులుకు, 17 వ రాజ్యంగ సవరణ బిల్లుకు సంభందం ఏమిటనే ప్రశ్న ఉదయిస్తుంది. 9 వ షెడ్యులు క్రింద చేర్చడం ద్వారా రాష్ట్ర  ప్రభుత్వం రైతులకు మేలు కలిగిందనుకున్నాంగదా? ఇది రాష్ట్ర పరిధిలో వచ్చే బిల్లు. అలాగే 17 వ రాజ్యంగ సవరణ బిల్లు ద్వారా, రైత్వారీ భూములను కావాలనుకున్నప్పుడు, ప్రభుత్వానికి అవసరమనుకోన్నప్పుడు రైత్వారీ భూములపై, వారికున్న హక్కులను రద్దుపర్చుకోనవచ్చు. 9 వ షెడ్యులు పరిదిలోకి వచ్చే భూములకు పరిహారం చెల్లించనవసరం లేదు. భూమి స్వాదినంపై సుప్రీంకోర్టుకు అప్పీలు అధికారం కుడా లేదు. 17 వ రాజ్యంగ సవరణ బిల్లు పార్లమెంటు రేపు ముగుస్తుందనగా, ఆ క్రిందటిరోజు హడావుడిగా పార్లమెంటు సభ్యులకు అందచేయడం జరిగింది. ఆ మరుసటిరోజు మూజువాణి ఓటు ద్వారా చర్చకు కుడా అవకాశం లేకుండా నెగ్గించుకోవాలనే కుట్ర. పండిట్ నెహ్రు బుద్దిపుర్వకంగానే సాగించారు.  నెహ్రూకు సోవియట్ రష్యా ఆదర్శం. మార్క్సిజం శ్రమజీవుల ఆశాజ్యోతి, జీవన విదానం అనే నమ్మకం బలంగా ఉన్నవాడు. మార్క్సు , లెనిన్, స్టాలిన్ ల వలెనే రైతులు అభివృద్ధి నిరోధకులని, ముందుచుపులేని మందభాగ్యులని, సంఘట శక్తి లేనివారని అపోహతో ఉన్నాడు. రైతులను, కూలీలుగా మార్చాలన్న మార్క్సు సిద్దాంతానికి దాసుడయిపోయాడు. అందుకే ఇంత కుట్ర బుద్ది పూర్వకంగానే సాగించాడు నెహ్రు.
17 వ రాజ్యంగ సవరణ బిల్లు, తేనెపూసిన కత్తి అని, పంచదార పొదిగిన విష గుళిక అని, రైతులను సర్వనాశనం చేసి, వారిని బికారులుగా, అనాధలుగా మార్చేదే ఈ సవరణ బిల్లు అని అర్ధమైపోయింది రంగాగారికి.   ఉదయం ప్రశ్నలకాలం పూర్తికావడంతోనే బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. రంగా లేచారు. తన బిడ్డలను హరించుకుపోవడానికి వచ్చిన అగంతుకులను తల్లి పులి ఉగ్రరూపం దాల్చి, వెంటపడి పట్టుకొని ప్రేగులుతోడి, కాకులకు, కాకులకు, గ్రద్దలకు, ఆహారంగా వేసే ఆడపులివలె సింహగర్జన చేసాడు. ఏమిటివింత, ప్రశాంతంగా, శాంతియుతంగా ఉంటూ ఉండే ఈ రంగానేనా ? ఈయన అనుకున్నారు. శ్రద్దగా రంగా ప్రసంగం విన్నారు. రంగా చెప్పిందాంట్లో యదార్ధం ఉన్నదని గ్రహించారు. సెలక్టు కమిటికి పంపాలని ప్రతిపాదించారు కొందరు సభ్యులు. బిల్లు మూలసుత్రాలకే, తాము వ్యతిరేకులమని, సెలెక్టు కమిటీలో మేము చేరేదిలేదు పొమ్మన్నారు రంగా. మెజారిటి ఉన్నదికదా సభలో సెలక్టు కమిటి నియామకం జరిగింది. సెలక్టు కమిటి విచారణ రిపోర్తుతో బిల్లు తిరిగి పార్లమెంటులో ప్రవేశించే ఈ మధ్యకాలంలో, ఆచార్య రంగా నాయకత్వాన, రాజాజీ నేతృత్వంలో స్వతంత్ర పార్టి ఆందోళనకు దిగింది. లక్షలకొలది జనాలు సంతకాలతో బిల్లుకు వ్యతిరేకంగా మేమోరాండాలు, విజ్ఞప్తులు, పోస్టుకార్డుల వెల్లువ, ఎచట సభ ఏర్పాటుచేసినా ప్రజావెల్లువ.
                      సర్దార్ లచ్చన్న రోజుకు 20 గంటలు తిరిగారు, కారుకు ఇద్దరు డ్రైవర్లు. అర్ధరాత్రి వెళ్ళినా ప్రజలు తండోపతండాలుగా సభలకు రావడం, ఉపన్యాసాలు,నినాదాలు కల ప్లేకార్డులు, తిరుగుబాటుకు కుడా ప్రజలు సిద్దమయ్యార అన్నంతగా జరిగింది. నెహ్రు రోడ్ రోలర్ మెజారిటి చూచుకుని ధీమాతో, సెలక్టు కమిటి రిపోర్తుతోపాటు బిల్లు పార్లమెంటులో తిరిగి ప్రవేశపెట్టారు. కాంగ్రెస్వారిలో రంగా ప్రచారం ప్రభావం చూపింది. రంగాజీ 17 వ రాజ్యాంగ సవరణ నెగ్గితే రైతులకు భవిష్యత్తే లేదన్నారు. కూలీలుగా బానిసలుగా మారతారన్నారు. రష్యా వంక ఒకమారు చూడమన్నారు. ఆయన ఉపన్యాసం పార్లమెంటును కుదిపేసింది.  బిల్లు ఓటింగుకు పెట్టగా సగం మంది కాంగ్రెస్ సభ్యులు జారుకున్నారు. బిల్లుకు మెజారిటిరాక ఓటమి చెందింది. రంగాకు ఘనవిజయం చేకూరింది. నెహ్రూకు గుండెల్లో గునపాలు గుచ్చినట్లుగా బాదపడ్డారు. పార్లమెంటు కాంగ్రేసుపార్టికి నాయకుడు నేనా - రంగానా అంటూ గద్గద స్వరంతో ���్రశ్నించారు నెహ్రు, సభ్యులు గజగజలాడిపోయారు. 
బిల్లు ఓటమి కారణమో లేదా చైనా యుద్ద కారణమో తెలియదుకాని నేహృజికి బ్రెయిన్ హెమరేజి వచ్చింది. డేహ్రడున్లో  విశ్రాంతిలో ఉండగా ఉపనాయకుడు గుర్జారీలాల్ నందాగారు నెహ్రు గారి ఆరోగ్యం క్షీణిస్తుందని ప్రకటించారు. రంగాజికి తలతిరిగిపోయింది , శరీరం కంపించింది. పరుగుల మీద యనను చూడడానికి వెళ్లారు. దర్సనం చేసుకున్నారు. ఆశలు లేవని తేలింది, దుఃఖం ఆగిందికాడు. 1964 మే 29 న నెహ్రు దివంగుతుడయ్యారు. తరువాత లాల్ బహద్దూర్ శాస్త్రి ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆయనకు సవరణ ఇష్టం లేదు. అయినా నెహ్రు ఆత్మశాంతికై, కొన్ని సవరణలతో మరికొన్ని రాయితీలతో 17 వ రాజ్యంగా సవరణ బిల్లును 19 వ రాజ్యంగ సవరణ బిల్లుగా మార్చి ఆమోదించడం జరిగింది.
సర్దారు లచ్చన్నకు ఊరుర, వాడ వాడ సన్మానాలు జరిగాయి. లచ్చన్నకు వీరపుజలనందించారు రైతాంగం. రైతాంగ రక్షకుడంటు ప్రస్తుతించారు. రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ సర్దార్ బిరుదం ఈనాటిదా ! కాదే ఆ 1935 - 37 మందసా జమిందారి రైతుపోరాటం ఇచ్చాపురం నుండి మద్రాసుకు సాగిన రైతు రక్షణయాత్రలు - పలాసలో జరిగిన అఖిలభారత రైతు మహాసభల సారధిగా - పేదల, నిరుపేదల సముద్దరణకు అనితరసాధ్యమైన, సాహసోపేతమైన ప్రజా ఉద్యమాల నాయకుడుగా, హరిజనుల గిరిజనుల వెనుకబడిన బడుగువర్గాల ప్రజల ఉద్దరణకు ప్రజాసేవకులకు శిక్షణ గరపడంలో చేసిన కృషి; అప్పుడే ప్రజల మధ్యనుండి, ప్రజల చేతనే సర్దారుగా కొనియాడబడిన సమర సేనాని సర్దార్ లచ్చన్న. అయన ప్రజా ఉద్యమాల నాయకుడుగా, యోడుడుగా, పోరాట నాయకుడుగా ఎదుగుతున్నప్పుడే ఆచార్య రంగాకు అందిన యువకిషోరం. రంగాజీ చేతిలో, ప్రజా నాయకుడిగా మలచబడిన మహావ్యక్తి సర్దార్ లచ్చన్న. ఆ తరువాత 1946 లో ఆచార్య రంగా రాష్ట్ర కాంగ్రేసు అధ్యక్షులుగా. శ్రీ కందుల ఓబుల్ రెడ్డి ప్రదాన కార్యదర్శిగా, శ్రీ పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి ఉపాధ్యక్షులుగా, శ్రీ లచ్చన్న , శ్రీ దుగ్గిరాల బలరామకృష్ణయ్య సంయుక్త కార్యదర్శులుగా ఎన్నుకోబడటం, విజయవాడలోని ఆంధ్రరత్న భవనం వారి రాజకీయ కార్యకలాపాలకు కేంద్రమైంది.
                ఉత్తరాంధ్ర అంటే నేటి తరో యువజనాలకు అంతగా తెలియకపోవచ్చు. నేటి ఉత్కళప్రదేశ్ లోని గంజాం, కోరాపుట్, జయపూర్, బరహంపూర్ తోపాటుగా, ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు కలుపుకుని ఉన్న విశాల భూభాగాన్ని ఉత్తరాంధ్రగా పిలువబడుతుండేది. ఈ ప్రాంతంలో చిన్న చిన్న జమిందారిలు, ప్రతి గ్రామం ఒక ఈనాముగా, సాఘికంగా కుడా అధోగతిలో ఉండేవి. విశాఖపట్నంలో బ్రిటిషు పాలనలో ఏర్పాటుచేసిన కింగు జార్జి హాస్పిటలు ఈ విశాల భుబాగానికి సేవలందిస్తూ ఉండేది. ఈ హాస్పిటలు ,వైద్య కళాశాల కుడా యావదాంద్రకు ప్రాతినిత్యం వహించేది. ఉన్నత విషయానికొస్తే విజయనగరంలో మహారాజావారి కళాశాలే పెద్ద దిక్కుగా ఉండేది.
కమ్యునిస్టుల పోరాటం - పలాసా - లచ్చన్న ::
   పలాసాలో చరిత్ర ప్రాముఖ్యత సంతరించుకున్న అఖిల భారత రైతు మహాసభ. ఇచటనే రైతు సంఘం కమ్యునిస్టులనుండి వేరుపడింది. దీనికి సారధి సచివుడు, నాయకుడు సర్దార్ లచ్చన్న గారే. ఆ మహాసభ విజయ పదంలో సాగింది. జమిందారి రద్దుకు పోరాటం, వెంకటగిరిలో జమిందారి పోరాటం ప్రారంభంకాగా, శ్రీకాకుళం జిల్లా "మందసా" కు చేరింది. అక్కడ జమిందారులకు వ్యతిరేకంగా లచ్చన్న నాయకత్వం తారాపధంలో, ఉరుములు, మెరుపులతో నిప్పులు చెరిగింది. పొలిసు కాల్పులకు దారితీసాయి, వీరగున్నమ్మ తుపాకి గుళ్ళకు బలైంది. రంగాజీకి మద్రాసు నుండి కదలకుడదనే ఇంటర్నుమెంటు ఆర్డరు అందించారు. ఇదే యావత్ భారతంలోని జమిందారి రద్దు మహోద్యమానికి బంగారు బాటలు వేసింది. జమిందారిలు రద్దయ్యాయి. అదే రంగా, లచ్చన్నల ఘన విజయం. బాధితరైతులకు స్వతంత్ర వృత్తి. 
           కమ్యునిస్టుల హింసాత్మక చర్యలను ఎదిరించేందుకు, స్వయం రక్షణకు " అజాదు హింద్ ఫౌజు " కమాండర్లచే సైనిక శిక్షణ కేంద్రం సాగింది. దీనికి సారధి సచివుడు, నాయకుడు లచ్చన్న గారే. చివరకు రంగాజీ గారు రెండుసార్లు పార్లమెంటుకు శ్రీకాకులంనుండే స్వతంత్ర పార్టీ అబ్యార్ధిగా పోటిచేశారు. 1924 లో ఏ సుభాముహుర్తాన శ్రీకాకుళం జిల్లాలో కాలుమోపారో కాని - ఆయన స్వర్గారోహణ చేసేంతవరకు శ్రీకాకుళంతో రంగాజీ సంభంద భాందవ్యాలు అవిచ్చిన్నంగా సాగాయి. అరవయ్యేళ్ళ పర్యంతం రంగాజీ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన నాయకత్వంలో అనేక మహోద్యమాలు సాగించిన సర్దార్ లచ్చన్న నిలువెత్తు శిలా విగ్రహాన్ని , రంగాజీ శిలా విగ్రహంతోపాటు 1996 లో శ్రీకాకుళంలో ప్రతిష్టించాలనే ఆలోచనతో కుల,మత,జాతి,వర్గ,బాషా, రాజకియాలకతీతంగా ఐక్య కార్యాచరణ సంఘం ఏర్పడి కృషి చేసింది.
 విగ్రహాల ప్రతిష్ట  - ప్రాముఖ్యం ::
   శ్రీకాకుళం - బెంగాల్  ఈశాన్య సరిహద్దు రాష్ట్రాలకు, ఒరిస్సాకు గెట్ వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రముఖ స్థానమై ఉన్నది. గ్రాండ్ ట్రంకురోడ్డు ( మద్రాసు - కలకత్తా ) లో ఏడు రహదారుల కూడలిగా అత్యంత ప్రాముఖ్యత చెందిన స్థలంలోనే  ఆచార్య రంగా , సర్దార్ లచ్చన్న గార్ల విగ్రహాలు ప్రతిష్టించ నిర్ణయించబడినది.  ఈ రెండు విగ్రహాలు ఒకే పెడస్టల్ పై ప్రతిష్టించ నిర్ణయించడం అహమ్మదాబాదులోని మహత్మా గాంధి - సర్దార్ వల్లభాయ్ పటేల్ గార్ల విగ్రహాలు ఒకే పెడస్టల్ పై ప్రతిష్టించినట్ట్లే. ఆ స్పూర్తితోనే రంగా , లచ్చన్న గార్ల విగ్రహాలు ఒకే పెడస్టల్ పై ప్రతిష్టించారు.
ఇక్కడ ఇంకొక విషయాన్ని గుర్తుచేసుకోవడం సమంజసమేనని తలుస్తాను. కన్యాకుమారి వద్ద స్వామీ వివేకానందులు ప్రపంచ సర్వమత సమ్మేళనానికి వెళ్తూ ఓడనేక్కిన ప్రదేశాన్ని " వివేకనందరాక్ "గా నామకరణం చేసి అచట స్వామీ వివేకానందులవారి బ్రహ్మాండమైన విగ్రహాన్ని ప్రతిష్టించారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కి గేట్ వే గా ప్రసిద్ధి చెందిన శ్రీకాకుళంలో ఈ మహానాయకుల ప్రతిష్టించడం కుడా సమంజసం, న్యాయం, యుక్తంగా భావించబడినది.
గమనిక - దరువూరి వీరయ్య గారిచే రచించబడిన " శ్రామికజన బాంధవుడు - సర్దార్ గౌతు లచ్చన్న " ద్వితీయ ముద్రణ " 2 మార్చి 1996 ",  పుస్తకం 
              నుండి సంగ్రహించబడినది. 
0 notes
rdspot · 13 years
Text
చిరంజీవి చిత్తూరు నాగయ్య - పాల్ ముని ఆఫ్ ఇండియా
తెలుగువారి తెరవేల్పు పద్మశ్రీ వుష్పలదడియం నాగయ్య.ముడు దశాబ్దాలపాటు తెలుగు వె౦డితెరకు బ౦గారు వెలుగులు, విలువలు తెచ్చిన మహనటుడు, గాయకుడు,దర్శకుడు,స౦గీత దర్శకుడు,రచయుత,నిర్మాత ఆయన. భారతీయ చలన చిత్ర నటులలో ప్రధమ పంక్తిలో నిలిచిన కళాకారుడు. ప్రపంచ నటన ప్రమాణాలను అధిగమించి శిఖారామయానుడైన మహానటుడు పాల్ ముని, మహా నటి గ్రేటాగార్బోల స్థాయికెదిగిన నాగయ్యగారికి "పాల్ ముని అఫ్ ఇండియా" అనే బిరుదు అన్వర్ధ నామమై మిగిలింది.
తెలుగు సినిమా తోలి కధానాయకుడు. సకల కళావల్లభుడు, సంగీత కళాకోవిదుడు, మహానటుడు, రచయుత, గాయకుడు, నిర్మాత, దర్శకుడు, సాటిలేని "తనపోతన మనవేమన" అలనాటి తెలుగువారి తెరవేల్పు పద్మశ్రీ చిత్తూరు వి.నాగయ్య. ఆయన పుట్టింది 1904 లో. ఆంధ్ర నాటక రంఘస్థలంమీద, తెలుగు తెరమీద ఆయన వెలిగింది గత శతాబ్దంలో - "షష్ఠివత్సర కీర్తిమాన్" అని ఆయనను అభినందించారు మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. "నటయోగి నాదయోగి అయిన నాగయ్యగారితో మహాగాయని శ్రీమతి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి హీరొయిన్ గా నటించారు "మీరా" చిత్రంలో. ఆయన పట్ల దక్షిణ హిందూ స్థానంలో భగవంతుడనే భావం ప్రబలివుండేది.
ఆయన నటనా ప్రభావంతో ముమ్మడివరం బాలయోగి అవతరించాడు. బెంగుళూరులో శ్రీనివాస అయ్యంగార్ యావదాస్తిని బృంధావనముగా మార్చి నాగయ్యగారికి అంకితం చేసారు. భారత ప్రభుత్వం మొట్టమొదటిసారి ప్రకటించిన పద్మశ్రీలలో తెలుగువాడు నాగయ్య గారు. మద్రాసులోని "వాణి మహల్" నాగయ్యగారి సృష్టి. అది శ్రీ త్యాగబ్రహ్మ గాన సభగా ఆయన ప్రారంభించిన సంస్థ.నటన అంటే ప్రవర్తన అనీ restraint అంటే సంయమనం - అనీ ఆయన ప్రతిపాదన. అలాగే త్యాగయ్యగారిది మనోధర్మ ఆయన సిద్దాంతికరించారు, అలాగే ప్రవర్తించారు, పాడారు. 1935 - 55 మధ్య దశకాలలో మన ఏకైక హీరో! గిరి, రామానుజాచారి వగైరాలు నారాయణరావుతో సహా ఎందరున్నా "హీరో" అంటే నాగయ్యగారే! ఆయనలాగ నవ్వడానికి, నడవడానికి, లైనేయ్యడానికి, లవ్ చెయ్యడానికి, భగ్న ప్రేమికుడిగా కృంగిపోవడానికి, ప్రేమలో నిమగ్నుడై పాటలు పాడుకోవడానికి.... అన్నిటికి మించి మహాభక్తుడై కారణజన్ముడుగా కదలడానికి, మెదలదానికి నాటి యువతకు నాగయ్యగారే గురి, గురుపీటం. పాటలు పాడడంలో ఆయన గాత్ర ధర్మాన్ని అనుసరించి "మిమిక్రి" పాటలు పాడడం ఆనాటి సభాకార్యక్రమాలకు ప్రధాన ఆకర్షణగా ఉండేది.
పోతన చిత్రంలో ఆయన పాడిన "నన్ను విడచి కదలకురా", "పావనగుణ రామహరే", వినిపించని సభాస్థలిగాని, పెళ్లిపందిరిగాని ఉండేది కాదు. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా నాగయ్యగారి సమ్మోహనశక్తి అటువంటిది. ఇక "హాయిసఖి" వంటి ప్రాణయగీతాలు, "అదిగదిగో గగనసీమ" వంటి భావగీతాలు, "రావే రావే బంగారు పాప" వంటి సంసార గీతాలు, "గృహమే కదా స్వర్గసీమ" వంటి ఆర్ద్ర మధుర గీతాలు, "కల్లుమానండోయ్" వంటి ప్రభోద గీతాలు, "బాల బాల నీకు పసుపు కుంకుమ జన్మ హక్కు కాదా బాల" వంటి సంస్కరణాత్మక గీతాలు పాడి, తన బాణీలు జనం చేత పాడించుకున్న "మ్యూజిక్ స్టార్" నాగయ్య గారు. ఇతర సంగీత దర్శకుల బాణీలలో పాడిన నాగయ్యగారి ముద్ర ప్రస్ఫుటంగా కానవచ్చేది. "సంఘం" (ఏ.వి.ఎం) "తాయ్ ఉళ్ళం" (మోడరన్ ధియేటర్స్) - ఆర్.సుదర్శనం, సుసర్ల దక్షిణామూర్తి స్వరకల్పనలో ఆయన పాడిన గీతాలు ప్రత్యేకత కలిగి ఉంటాయి. "జాలిగుండెయేలేదా", "జాతిభేదం సమసిపోదా" (మా గొపీ, సంఘం) పాటలు రింగుమంటూ వినిపించే ఆయన ఆర్ద్ర హృదయ ధ్వనికి ప్రతిధ్వనులు. నవరస నటనా ధురీణుడైన నాగయ్య భక్తిరసంలో ప్రజా బాహుళ్యాన్ని ముంచి తేల్చి వారి పాలిట అవతార పురుషుడుగా ఎదిగిపోయారు. భక్తి రసగంగలో ప్రేక్షకులు ఓలలాడి భౌతిక వాదానికి, ఐహిక జీవనానికి దూరం పాటించిన సందర్భాలు ఎన్నో! ఆయన నటించిన త్యాగయ్య చూస్తున్న సినిమా హాళ్ళలో కన్నీరు కాలువలు కట్టేదని ప్రతీతి. పోతన, త్యాగయ్య, గోరకుంభార్, రామదాసు పాత్రలలో భక్తినీ, వేమనలో శృంగార వైరాగ్యాలని, బీదలపాట్లు, సంఘం, మా గొపీ, నవజీవనం, గృహలక్ష్మి, నాయిల్లు వగైరా చిత్రాలలో మమతని, మానవత్వాన్ని ప్రతిబింబించే సామాజిక స్పృహతో కూడిన పాత్రలని ఆయన అత్యంత సమర్ధంగా పోషించారు. అలాగే రొమాంటిక్ హీరోగా దేవత, స్వర్గసీమ, భాగ్యలక్ష్మి, వగైరా చిత్రాలు మరపురాని కళాఖండాలు.
నాగయ్యగారు నటుడుగా అందుకున్న అనితర సాధ్యమైన ప్రమాణాలకు "ఫిల్మిండియా" పత్రికా సంపాదకుడు, జ్ఞాని, తత్వవేత్త, విమర్శకుడు శ్రీ బాబురావుపటేల్ ముగ్ధుడై 1945 లో బొంబాయి మరాఠా మందిరలో అఖండ సన్మానం చేసి ఆయనకు "పాల్ ముని అఫ్ ఇండియా" అనే బిరుదును ఇచ్చి గౌరవించారు.అలనాటి సభలో పృథ్విరాజ్ కపూర్ నాగయ్య నటనకు జోహార్లు అర్పించి ఆయన సమకాలికుడనయినందుకు గర్వపడుతున్నానన్నారు. మహామహుల ప్రసంసలందుకున్న మహితాత్ముడు నాగయ్య.
కర్ణాటక సంగీత ప్రపంచంలో తారలుగా ప్రకాశించిన ఎం.కె.త్యాగరాజ భాగవతార్ (సినిహేరో కూడా), మధురై మణి అయ్యర్, జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యం (సినీనటుడు కూడా), అరియక్కుడి రామానుజ అయ్యంగార్, డి.కె.పట్టమ్మాళ్ వంటి ప్రముఖలు నాగయ్య గారి గానం విని పరవశించి పరమ మిత్రులైపోయారు. పి.యు.చిన్నప్పభాగావతార్ గానపద్దతి ప్రబలంగా ఉన్న తమిళ చిత్ర సంగీత రంగంలో నాగయ్య ప్రభావంతో పెద్దమార్పు వచ్చింది.భావప్రధానమైన సజీవ పాత్రలకు సరిపోయే మనోధర్మ సంగీత మరుద్వీచికలు తమిళ సినీ రంగంలో హాయిగా వీచడానికి నాగయ్యగారే కారకులు. ఆ ప్రభావంతో జి.ఎన్.బి, డి.కె.జయరామన్, వసంతకుమారి వంటి వారు కొత్తరీతిలో గీతికల గానానికి గళాలు విప్పారంటే అతిశయోక్తి కాదు. నాగయ్యగారి అభిమానులుగా మారిన సంగీత ప్రవీణులెందరో తరువాత సంగీత దర్శకులైనారు. సి.ఆర్.సుబ్బరామన్, ఒగిరాల రామచంద్రరావు, అద్దేపల్లి రామారావు, గాలి పెంచల నరసింహారావు ప్రబృతులను వీరిలో ప్రముఖులుగా పేర్కొనవచ్చు. గాయక సార్వభౌమ పారుపల్లి రామకృష్ణయ్య, బాలాంత్రపు రజనీకాంతరావు, చిత్తూరు సుబ్రమణ్య పిళ్ళైగార్ల స్వరకల్పనా రీతులు నాగయ్య గారికి అభిమాన పాత్రమైనవి. "స్వర్గసీమ" వగైరా చిత్రాలలో "ఒహొ హొ పావురమా" వంటి పాటలు అందుకు సాక్షమిస్తాయి. సాహిత్య సంగీత రచనలో సవ్యసాచిగా "రజని" చేసిన బాణిల ప్రభావం ఆ చిత్రాల సంగీతంలో కానవస్తుంది.
మద్రాసు నగరంలో తెలుగువారికి నాగయ్య నీడ చలివెంద్రంలా చల్లగా ఉండేది. రేణుకా పిక్చర్స్  స్థాపించి చిత్ర నిర్మాణంతో పాటు దానధర్మాలకు. ఉచిత భోజనశాల నిర్వహణకు చేతికి ఎముక లేకుండా ఖర్చు చేసేవారు నాగయ్య! తిన్నవారెవరు తిరిగి ఆయన మొహం చూడకుండా సహజమానవ నీతిని నిలబెట్టారు. నెం.11,వ్యాసరావు వీధిలో నాగయ్యగారు చిరకాలం నివసించారు.యోగాశ్రామం ఏర్పాటు చేయాలని వడపళనిలో ఒక తోటకొని అదీ అమ్మివేసారు. తిరువైయారులో శ్రీ త్యాగరాజ స్వామివారి సమాధి వద్ద  ఏర్పడిన ఆలయానికి, నిత్యపూజలకు విరాళమిచ్చిన కొద్దిమంది తెలుగువారిలో నాగయ్య ఒకరు. తమిళ సినీ కళాకారులేందరి పేర్లో అక్కడ దాతల జాబితాలో కనిపిస్తాయి. ఒక్క నాగయ్యగారి పేరు చూసి తెలుగువారు ధన్యత చెందుతారు.
భృక్త రహిత తారక రాజయోగ మార్గంలో నాగయ్యగారు కొంతకాలం యోగ సాధన కూడా చేసారు.శారీరక, మానసిక రుగ్మతలను, బాధలను ఆయన ఈ యోగాసాధనలో జయించారు. యోగి పుంగవులు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి శిష్యులుగా ఆయన ఆద్యాత్మిక జీవనం గడిపారు. జీవితపు చరమదశలో రంగస్థలం మీద తన అభిమాన పాత్ర భక్తరామదాసు సినిమా తీయాలనే స్థిర సంకల్పంతో కొన్ని సంవత్సరాలపాటు దానిని నిర్మించి రామదాసు వలెనే మరిన్ని ఆర్ధిక చిక్కుల్లో పడి అలమటించారు. ఆ చిత్రం చివరికి విడుదలై ఆయనకీ కీర్తి కిరీటాన్ని సమర్పించింది. అందులో కబీర్ గా గుమ్మడి చేసిన నటనకు నాగయ్యగారు పులకించి పోయేవారు. మహమ్మద్ రఫీ నుంచి ఎందరెందరో నాగయ్యగారి కోసం ఆ సినిమాలో ప్రతిఫలం కోరకుండా తమ విధిని నిర్వహించడం చలన చిత్ర చరిత్రలోనే అపూర్వం.
పోతన, వేమన, త్యాగయ్య వంటి పాత్రలు తప్ప తనకంటూ ఏమి లేని నాగయ్య మనందరికీ ఉన్న తరగని నిధి, కళానిధి.
0 notes
rdspot · 13 years
Text
బాల్య స్మృతులలో ఒక భక్తి పాట.
                నాకు తెలిసిన అతి కొన్ని ” శ్రీ రామదాసు ” కీర్తనలలో ఇది ఒకటి. నా జీవితంలో దీనికొక ప్రత్యేకత ఉన్నది. నేను మొట్ట మొదటిసారి ఈ కీర్తనను విన్నది మా జేజమ్మైన అన్నపూర్ణమ్మ గారు పాడుతున్నప్పుడు...! అప్పటికే ఆవిడ ఎనబైల చివరలో ఉన్నారు. ఆ వయసులో కూడా ఆవిడ గళం వణికేది కాదు, అప్పుడు తెలియదు కాని, ఇప్పుడు తలచుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అప్పుడు నా వయసు 9 సంవత్సరాలే. ప్రతిరోజూ సాయంసమయాన  ఒక్కసారైనా ఈ పాట ఆలపించందే ఆవిడకు రోజు గడిచేది కాదు, అలా పాడుతున్నప్పుడు విని విని, మేము గొంతు కలిపి పాడి , నిదనిదానంగా నాకు కుడా ఈ పాట కంఠాపాటమైపొయింది.
కాలగమనంలో ఆవిడ మాకు దూరమైనా, ఈ పాట విన్న ప్రతి సారి నా బాల్య జ్ఞాపకాల స్మృతులలో మెదులుతూనే ఉంటుంది.
0 notes
rdspot · 14 years
Text
అక్షౌహిణి అంటే.........?
మహాభారత యుద్ధంలో 18 అక్షౌహిణుల సైన్యం పాల్గొన్నదని మన పురాణాలు తెలియచేస్తున్నాయి. అయితే అక్షౌహిని అంటే ఎంత అన్న ప్రశ్నకు నన్నయ్య మహాభారత ఆది పర్వంలోని ప్రధమాశ్వాసంలొ 80వ పద్యంలో దాని స్వరూపాన్ని ఈ క్రింది విధంగా వివరించాడు. ఒక రధము, ఒక ఏనుగు, మూడు గుర్రాలు, అయిదుగురు కాల్బంబులు కలసిన సైన్యానికి "పత్తి" అని పేరు. దీనికి మూడు రెట్లయిన సైన్యాన్ని "సేనాముఖము" అంటారు. సేనముఖానికి మూడు రేట్లను "గుల్మము" అంటారు.ఇందులో 9 రధాలు, 9 ఏనుగులు, 27 గుర్రాలు, 45 మంది కాలిబంట్లు వుంటారు. గుల్మానికి మూడు రెట్లు "గణము". ఇందులో 27 రధాలు, 27 ఏనుగులు,81 గుర్రాలు,135 మంది కాలిబంట్లుంటారు.గణానికి మూడు రెట్లు "వాహిని". ఇందులో 81 రధాలు,81 ఏనుగులు,243 గుర్రాలు,405 మంది కాలిబంట్లుంటారు. వాహినికి మూడు రెట్లు "పృతన" ఇందులో 243 రధాలు,243 ఏనుగులు,729 గుర్రాలు,1215 మంది కాలిబంట్లుంటారు. పృతనకు మూడు రెట్లు "చమువు" ఇందులో 729 రధాలు,729 ఏనుగులు,2187 గుర్రాలు,3645 మంది కాలిబంట్లుంటారు. చమువుకు మూడు రెట్లు "అనీకిని" ఇందులో 2187 రధాలు,2187 ఏనుగులు,6561 గుర్రాలు,10935 మంది కాలిబంట్లుంటారు.అనీకినికి పది రెట్లయితే "అక్షౌహిని" అవుతుంది. అంటే అక్షౌహినిలో 21870 రధాలు, 21870 ఏనుగులు, 65610 గుర్రాలు, 109350 మంది కాల్బలము వుంటారు. ఇటువంటి అక్షౌహిణులు 18 కురుక్షేత్త్ర యుద్ధంలో పాల్గొన్నాయి. అంటే 3,93,660 రధాలు, 3,93,660 ఏనుగులు, 11,80,980 గుర్రాలు, 19,88,300 కాల్బలము అన్నమాట. ఇక్కడ మరో విషయమేమిటంటే ఒక్కొక్క రధం మీద ఒక యుద్ద వీరునితో పాటు ఒక సారధి కూడా ఉంటాడు. కాబట్టి సారధులను కూడా లెక్కలోకి తీసుకోవాలి. అప్పుడు రధబలం 7,87,329 అవుతుంది. అలాగే గజబలంలో కూడా ఒక్కొక్క యుద్ద వీరునితో పాటుగా ఒక మావటి వాడు కూడా ఉంటాడు. కాబట్టి గజబలం కూడా 7,87,329 అవుతుంది. వీటన్నిటిని కలిపితే కురుక్షేత్ర యుద్ధంలో 47,23,920 మంది పల్గోనట్లు తెలుస్తుంది. ఈ 18 అక్షౌహిణులలో పాండవ బలం ఏడు అక్షౌహిణులు మాత్రమే. 8 అక్షౌహిణులు ఒక "ఏకము", ఎనిమిది ఎకములు ఒక "కోటి",(ఈ కోటి వేరు). ఎనిమిది కోట్లు ఒక "శంఖము", ఎనిమిది శంఖములు ఒక "కుముదము",ఎనిమిది కుముదములు ఒక "పద్మము", ఎనిమిది పద్మములు ఒక "నాడి",ఎనిమిది నాడులు ఒక "సముద్రము",ఎనిమిది సముద్రాలు ఒక "వెల్లువ". అంటే 366917139200 మంది గల సైన్యానికి వెల్లువ అని పేరు. ఇటువంటి 70 వెల్లువల సైన్యం సుగ్రీవుని వద్ద ఉన్నట్లుగ కంబ రామాయణం చెబుతుంది.అంటె సుగ్రీవుని వద్ద 256842399744000 మంది వానర వీరులున్నారన్నమాట. వీరిలొ 67 కొట్ల మంది సైన్యాదిపతులు. వీరికి "నీలుడు" అధిపతి. అక్షౌహిణికి ఇంత కథ ఉన్నది. మొత్తానికి కొంచెం విసిగించానేమో....... :)
0 notes