Tumgik
#iandpr
telanganajournalist · 2 years
Text
Telangana Govt. Media(Journalists) Accreditation cards for sale?
తెలంగాణలో రూ. 50 వేలు ఇస్తే ఎవరికైనా విలేకరుల ప్రభుత్వ రాయితీ(మీడియా) అక్రిడిటేషన్ కార్డులు?: జర్నలిజమే వృత్తిగా చేసుకుంటూ, జర్నలిజం డిగ్రీ పట్టా ఉన్న విలేకరులకు అక్రిడిటేషన్ కార్డుల జారీలో మొండి చేయి!
విలేకరులు అనే ప్రజలతో సంబంధాలు తెంచుకున్న తెలంగాణ ప్రజా సంబంధాల శాఖ
విలేకరుల అక్రిడిటేషన్ లకు తెలంగాణ సమాచార శాఖ కొత్త నిబంధన:
Tumblr media
సమాచార ప్రజా సంబంధాల శాఖ, తెలంగాణ తన విధిని సక్రమంగా నిర్వహించక, పైరవీలు చేసే అధికార పార్టీ నాయకులు, కొందరు యూనియన్ నాయకుల గుప్పిట్లో పని చేస్తూ ప్రజలతో, నిజాయితీ గల విలేకరులతో సంబంధాలు ఎప్పుడో తెంపేసుకుంది అంటున్నారు విలేకరులు. దరఖాస్తు చేసుకున్న విలేకరులకు వాళ్ళ అప్లికేషన్ లు ఎందుకు తిరస్కరిస్తున్నారో తెలుసుకునే అవకాశం గాని, చిన్న మెసేజ్ గాని ఇంతవరకు ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రశ్నించే విలేకరుల గొంతు నొక్కడానికి, వారు చెప్పే సమాచారమే మీడియాలో రావడానికి ఎం ప్యానెల్ అంటూ కొత్త నిబంధన తీసుకొచ్చింది. దీంతో వారి కనుసన్నల్లో పని చేసే వారికే ఈ అక్రిడిటేషన్ కార్డులు రాబోతున్నాయి. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ప్రజా సంబంధాల శాఖ తన ఉనికిని కోల్పోయింది అని చెప్పవచ్చు.
Tumblr media
ఇదే అదనుగా రాష్ట్రంలో విలేఖర్ల అక్రిడిటేషన్ లకు భలే గిరాకీ ఉందని చెబుతున్నారు కొందరు విలేకరులు.. ఒక్కో మండల స్తాయి రిపోర్టర్ లకు రూ. 50 వేల దాకా కొన్ని సంస్థల యజమానులు తీసుకుంటున్నారని సమాచారం. ఆయా సంస్థలు అసలు ఎవర్ని విలేఖరులుగా నియమించుకుంటున్నాయి? వారి విద్యార్హతలు ఏంటి? ఇవేమీ వారికి కొలమానం కావట. చివరికి ప్రజలకు స్వేచ్ఛ గా, నిజాలు చెప్పాల్సిన మీడియాని కూడా వ్యాపారంగా మార్చేశారు కొందరు యూనియన్ నాయకులు, యజమానులు. 
Tumblr media
డబ్బుల కోసం సంస్థలు, అక్రిడిటేషన్ ల కోసం డమ్మీ విలేకరులు మీడియా వ్యవస్థను సర్వనాశనం చేశారు, చేస్తున్నారు. ఇక అసలు, సిసలు సమాచారం ప్రజలకు ఎలా చేరుతుంది? స్వతంత్ర విలేకరులకు వారి చదువు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లకు అందులో ప్రత్యేకంగా జర్నలిజం ప్రొఫెషనల్ కోర్సు చేసిన వాళ్లకు అక్రిడిటేషన్ ఇవ్వాల్సి ఉండగా వారికి మొండి చేయి చూపిస్తూ ఇంటర్, 10th చదివి ఆయా సంస్థలు సిఫార్సులతో అక్రిడేషన్ లు పొందుతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా జర్నలిజమే వృత్తిగా చేసుకొని బతుకుతూ, జర్నలిజంలో డిగ్రీ ఉండి దరఖాస్తు చేసుకున్న ప్రతి విలేకరి అక్రిడిటేషన్ ఇవ్వాల్సిందే.
-వేంకటేశ్వర్లు బోయ, తెలంగాణ జర్నలిస్ట్, హైదరాబాద్
0 notes