Tumgik
pcdoraswamy · 3 years
Photo
Tumblr media
ఆత్మీయ స్నేహితుడు, విలక్షణ నేత శ్రీ సబ్బం హరి గారు ఇక లేరన్న దుర్వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి .. చెప్పలేనంత బాధకు గురి చేసింది. హరి గారూ .. మీరు ఇక లేరన్న కఠిన సత్యం గుండెల్ని మెలిపెడుతుంది. మీ లాంటి వ్యక్తులు చాలా అరుదుగా వుంటారు. సమాజానికి మీ లాంటి వారి అవసరం ఎప్పుడూ ఉంటుంది. కానీ భగవంతుడు మిమ్మల్ని ఇంత త్వరగా తీసుకువెళ్తాడని ఊహించలేదు. ఈ దుర్వార్త నిజం కాకపొతే బాగుణ్ణనిపిస్తుంది. కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయినంత బాధగా వుంది. మీరు ఆరోగ్యంతో కోలుకోవాలని రోజూ దేవుణ్ణి ప్రార్ధించాము. మా ప్రార్ధనలు ఫలించలేదు.. క్షమించండి హరి గారూ ! సబ్బం హరి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు కొండంత ధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి మనసారా ప్రార్ధిస్తున్నాను. మీ ఆత్మీయ మిత్రుడు PC. దొరస్వామి https://www.instagram.com/p/COaMqDinJv4/?igshid=6obweg58kfja
0 notes
pcdoraswamy · 3 years
Photo
Tumblr media
శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే .. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ! రామాయణము సకలవేదసారము, సర్వమానవులకూ ఆదర్శము. నాటికీ నేటికీ సర్వకాలాల్లోని మానవులకందరికీ రామాయణం లోని పాత్రలు ఆదర్శమై ఉంటున్నాయి. తల్లీబిడ్డల యొక్క సంబంధం, అన్నదమ్ములు.. స్నేహితుల మధ్య సంబంధము ఎంత అన్యోన్యంగా, ఎంత పవిత్రంగా, ఎంత ఆదర్శ వంతంగా ఉండాలో రామాయణం నిరూపిస్తోంది. హనుమంతుడు శ్రీ రాముడునే తన హృదయంలో బంధించి భక్తిలో ఎవరికీ సాటిరానంత ఎదిగాడు.ఒకరికోసం ఒకరుగా రామాయణంలోని అన్ని పాత్రలూ జీవించాయి. అంతేకాక మన జన్మ జన్మల కర్మలన్నీ అనుభవించి తీరాల్సిందే కనుక ఎవ్వరినీ బాధించక వేధించక మంచి విధానాల్లో జీవించాలని రామాయణం మనకి నిత్య ఆదర్శంగా దారి చూపుతుంది. ఒక తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమ ఒక కొడుక్కి తండ్రి మీద ఉన్న గౌరవం ఒక భర్తకు భార్య మీద ఉన్న బాధ్యత ఒక భార్యకు భర్త మీద ఉన్న నమ్మకం ఒక అన్నకి తమ్ముడి మీద ఉన్న విశ్వాసం ఒక తమ్ముడికి అన్న మీద ఉన్న మమకారం ..ఒక మనిషిలోని బలం, మరో మనిషిలోని స్వార్థం, ఇంకో మనిషిలో క్రోధం, ఒకరి ఎదురుచూపులు, మరొకరి వెతుకులాటలు, అండగా నిలిచిన స్నేహితులు..వారు చూపిన అంతులేని ప్రేమాభిమానాలు..అన్నీ కలపి మనిషిని మనిషిగా బతకడానికి అవసరమైన ఒక నిఘంటువు..రామాయణం ! మిత్రులు, శ్రేయోభిలాషులు, బ్రాండిక్స్ కుటుంబ సభ్యులందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు దొరస్వామి భారతీయ భాగస్వామి, బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ, విశాఖపట్నం. #DoraSwamyPC #BrandixIndia https://www.instagram.com/p/CN6MnImHAXp/?igshid=5t6bmvs8mfk2
0 notes
pcdoraswamy · 3 years
Photo
Tumblr media
170th week of 'Swachh Pudimadaka' Program By Brandix India బ్రాండిక్స్ ఆధ్వర్యంలో ' స్వచ్ఛ పూడిమడక' విజయవంతంగా 170 వ వారం పూడిమడక గ్రామంతో పాటు బీచ్ ను పరిశుభ్రంగా ఉంచుతూ.. పరిసరాలను స్వచ్చంగా తీర్చిదిద్దేందుకు మా బ్రాండిక్స్ సంస్థ చేపట్టిన ‘ స్వచ్చ పూడిమడక ‘ కార్యక్రమం 170 వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నదని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మన ఊరి శుభ్రత – మనందరి భాద్యత’ నినాదంతో 2019 నవంబర్ లో ‘స్వచ్చ పూడిమడక’ ను ప్రారంభించాము. మన వీధి, ఊరు శుభ్రత పట్టించుకోకపొతే ఎంతో నష్టం కలుగుతుంది. ఇంట్లో చెత్తను వీధిలో పడేస్తే దోమలు చేరి, దుర్వాసన పెరిగి అది ఇళ్ళకు వ్యాప్తి చెంది మొత్తం గ్రామస్తుల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తుంది..అందుకే వీధి బాగుంటేనే ఇల్లు బాగుంటుందనే అంశంపై పూడిమడక గ్రామస్తులకు ప్రత్యేక అవగాహన కలిగించడం జరిగింది. నేడు పూడిమడక యువత, గ్రామస్తులు తమ ఇళ్ళతో పాటు వీధులను శుభ్రంగా ఉంచుకుంటున్నారు. మా బ్రాండిక్స్ సంస్థ ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా నియమించిన బృందం స్వచ్చ పూడిమడక కోసం శ్రద్ధతో పనిచేస్తున్నారు. వీరు గ్రామంలో చెత్తను ఎప్పటికప్పుడు తరలించి ..ఆ ప్రాంతాల్లో బ్లీచింగ్ వేయడం ద్వారా పరిసరాలను శుభ్రంగా ఉంచుతున్నారు. ‘స్వచ్చ పూడిమడక’ కోసం నేను ప్రత్యక్షంగా బీచ్ మరియు గ్రామాన్ని తరుచూ సందర్శిస్తూ పర్యవేక్షణ ��ేస్తున్నాను. గ్రామంలో యువతను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసేందుకు గాను వారిలో చైతన్యం తీసుకురావడం జరిగింది. ‘స్వచ్చ పూడిమడక’ సహకరిస్తున్న గ్రామస్తులకు, యువతకు ఇందులో పాల్గొంటున్న పారిశుద్ధ్య కార్మికులకు మా బ్రాండిక్స్ సంస్థ తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు. ‘ స్వచ్చ పూడిమడక ‘ ను ఆదర్శంగా తీసుకుని పారిశుధ్య ఉద్యమంలో ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. ఊరు బాగుంటే ..మన అందరి ఆరోగ్యం బాగుంటుందనే నినాదాన్ని.. కార్యాచరణలో అమలు చేయాలని అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. దొరస్వామి భారతీయ భాగస్వామి, బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ,విశాఖపట్నం. #DoraSwamyPC #BrandixIndia #PachipalaDoraswamy #BrandixDoraswamy #PCDoraswamy https://www.instagram.com/p/CNgdMrGnWiY/?igshid=164llyxtlhinr
0 notes
pcdoraswamy · 3 years
Photo
Tumblr media
కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుందాం .. ధైర్యంగా ముందుకు కదులుదాం ! ఏడాది క్రితం లాక్‌డౌన్ విధించిన సమయంలో కరోనా గురించి భయపడడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పించి గత్యంతరం లేని దుస్థితిని ఎదుర్కొన్నాం. ఎంతో ధన,ప్రాణ నష్టాన్ని చూసాం. ఇంత ఉపద్రవం తర్వాత అదృష్టవశాత్తు కరోనా వ్యాక్సిన్లు వచ్చాయి. నేను కోవాక్సిన్ వేయించుకున్నాను.అర్హత ఉన్నవారు ఆలస్యం చెయ్యకుండా వెంటనే వ్యాక్సిన్ వేయించుకోండి.పుకార్లను నమ్మకుండా వైద్యుల సూచనలు పాటించండి. వ్యాక్సిన్ తీసుకున్న రెండు రోజుల పాటు వీలైనంత విశ్రాంతి, తగినంత ద్రవ పదార్థాలు తీసుకోండి. సర్వేజనా సుఖినోభవంతు 🙏 దొరస్వామి భారతీయ భాగస్వామి, బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ, విశాఖపట్నం. #PCDoraswamy #BrandixIndia #PachipalaDoraswamy #BrandixDoraswamy https://www.instagram.com/p/CNeM8Dnn3iT/?igshid=1ro1byye86tuk
0 notes
pcdoraswamy · 3 years
Photo
Tumblr media
బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మలభాసిత శోభిత లింగం జన్మజ దు:ఖ వినాశక లింగం తత్ ప్రణమామి సదాశివ లింగం లయకారుడైన శివుడు సృష్టికే ఆదియోగి. ‘శివ’ శబ్దం మంగళాత్మకం.. ‘శివుడు’ పేరు ఎన్నో శుభాలను సూచిస్తుంది. శుభాలన్నీ గుణాలే ! అనేక గుణాలకు నిలువెత్తు నిదర్శనం మహాశివుడు. అందుకే ఆయనను లోకమంతా ఆరాధిస్తోంది. పరమశివుని ఆశీస్సులతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..బ్రాండిక్స్ సంస్థ ఉద్యోగులందరికి మరియు మిత్రులు, శ్రేయోభిలాషులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు . దొరస్వామి భారతీయ భాగస్వామి, బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ #DoraSwamyPC #BrandixIndia #BrandixDoraswamy #PachipalaDoraswamy #PCDoraswamy https://www.instagram.com/p/CMRBjZpn7sK/?igshid=k3s5uwk847gh
0 notes
pcdoraswamy · 3 years
Photo
Tumblr media
" యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా '' ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు విహరిస్తారు..అని దీనర్ధం ! ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ఉపాధి,ఆర్ధిక, ఆరోగ్య, సామాజిక సాధికారత కోసం మా బ్రాండిక్స్ సంస్థ కట్టుబడి వున్నదని మరోసారి ప్రమాణం చేస్తున్నాము. మన చుట్టూ వున్న ప్రతీ మహిళ పట్ల భాద్యతగా. సమాజంలో ప్రతి ఒక్కరం ..వారిని మన సొంత అక్క చెల్లెళ్ళు మాదిరి చూసుకునే విధంగా సమాయత్తం అవ్వాలి. వారికి మనం అందరూ అన్నదమ్ముల్లా రక్షణగా నిలవాలి. మనమంతా ప్రతి స్త్రీ మూర్తికి అండగా తోడూ నీడలా..రక్షణ కవచంలా ఉన్నామని వారిలో ధైర్యం నింపాలి ..వారి స్వేచ్చా జీవనానికి భరోసా ఇవ్వాలి ! మా బ్రాండిక్స్ సంస్థలోని నా సోదరీమణులతో పాటు ప్రతీ మహిళకు హృదయపూర్వక ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ! #HappyWorldWomensDay దొరస్వామి భారతీయ భాగస్వామి, బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ #DoraSwamyPC #BrandixIndia #PachipalaDoraswamy #BrandixDoraswamy #PcDoraswamy https://www.instagram.com/p/CMI3d4BnIou/?igshid=1c9dw80i68at8
0 notes
pcdoraswamy · 3 years
Photo
Tumblr media
పూడిమడక మాఘ పౌర్ణమి తీర్థ ఉత్సవాలు బ్రాండిక్స్ తో పూడిమడకకు విశిష్ట అనుబంధం మాఘ పౌర్ణమి పురస్కరించుకుని పూడిమడక తీరంలో అశేష జనవాహిని మధ్య వైభవంగా జరిగిన తీర్ధ ఉత్సవాల్లో పాల్గొనడం నాకు ఆనందాన్ని కలిగించింది. అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ సముద్ర తీరంలో వెలసిన జగన్నాధ స్వామి, వేణుగోపాల స్వామి, లక్ష్మి దేవి అమ్మవారి ఆలయాల్లో దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది.ఈ సందర్భంగా స్థానిక ఎందరో ఆత్మీయుల్ని కలుసుకోవడం నాకు గొప్ప సంతోషం కలిగించింది. పూడిమడక గ్రామ ప్రజలతో నాకు మరియు మా బ్రాండిక్స్ సంస్థకు విశిష్టమైన అనుబంధం ఉంది. బ్రాండిక్స్ ఆధ్వర్యంలో పూడిమడకలో రెండు ఆర్.ఓ.ప్లాంట్లు ఏర్పాటు చేసి పదేళ్లుగా ఉచితంగా రక్షిత మంచినీటి సరఫరా చేస్తున్నాం. ఇక్కడి సముద్రతీరంతో సహా గ్రామ పారిశుద్ధ్య మెరుగు కోసం బ్రాండిక్స్ నిర్వహిస్తున్న ' స్వచ్ఛ పూడిమడక' కార్యక్రమం విశాఖ జిల్లాలోనే ఒక ఆదర్శ గ్రామంగా పేరు తెచ్చిపెట్టింది. బ్రాండిక్స్ ఆధ్వర్యంలో గ్రామంలో రోజువారీ చెత్తను ఊడ్చి పరిశుభ్రంగా ఉంచడం జరుతుంది. గ్రామం నుంచి అధికసంఖ్యలో మహిళలకు ఉపాధి అవకాశాలు ఇస్తున్నాం. ఇదే స్ఫూర్తి నిరంతరం కొనసాగిస్తూ ఉపాధి అవకాశాలు, సేవా కార్యక్రమాల్లో పూడిమడకకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఉత్సవం సందర్భంగా భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాకు సాదర స్వాగతం పలికి అత్యంత గౌరవాన్ని ఇచ్చిన గ్రామ పెద్దలు, ప్రజలు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏 దొరస్వామి భారతీయ భాగస్వామి బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ #DoraSwamyPC #BrandixIndia #PachipalaDoraswamy #BrandixDoraswamy #PcDoraswamy https://www.instagram.com/p/CL3e70LH4v3/?igshid=dbeotwjfow2u
0 notes
pcdoraswamy · 3 years
Photo
Tumblr media
ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము ! మన స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల కోసం అశువులు బాసిన ఎందరో సమర యోధులు, మహనీయుల దీక్షాదక్షతలను స్మరిస్తూ..మిత్రులు, శ్రేయోభిలాషులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ! దొరస్వామి భారతీయ భాగస్వామి, బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ #DoraSwamyPC #BrandixIndia #HappyRepublicDay https://www.instagram.com/p/CKfWE1qHgjs/?igshid=5tsbv1hm3b36
0 notes
pcdoraswamy · 3 years
Photo
Tumblr media
సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ! #HappySankranthi #DoraSwamyPC #BrandixIndia https://www.instagram.com/p/CJ93hwWnZVI/?igshid=pgky1qizca0q
0 notes
pcdoraswamy · 3 years
Photo
Tumblr media
గడిచిన ఏడాది చేదు అనుభవాలను అధిగమిస్తూ కొత్త ఆశలను మోసుకొస్తున్న నూతన సంవత్సరం 2021 కి ఘన స్వాగతం. ఈ కొత్త సంవత్సరంలో మీ ఆశయాలన్నీ సంపూర్ణంగా నెరవేరాలని ఆకాంక్షిస్తూ..మీ అందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. దొరస్వామి భారతీయ భాగస్వామి బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ #DoraSwamyPC #BrandixIndia #HappyNewYear #2021 https://www.instagram.com/p/CJfG10YHJ6-/?igshid=hhr0vyd5d8t5
0 notes
pcdoraswamy · 4 years
Photo
Tumblr media
దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ | దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప న్నమోస్తుతే || దీప జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా..మనోవికాసానికి, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. అఙ్ఞానమనే చీకటి నుంచి..ఙ్ఞానమనే వెలుగులోకి ప్రయాణించడమే ‘దీప��వళి’ పండుగలోని అంతరార్ధం. చెడు అనే దరిద్రాన్ని పారద్రోలి..మంచి అనే ఐశ్వర్య మార్గంలోకి ప్రయాణిచడమే ‘దీపావళి’ పండుగ ముఖ్యోద్దేశ్యం. నరకాసుర సంహారంతో సకల లోకాలూ కష్టాల అంథకారంలోంచి సంతోషమనే వెలుగులోకి వచ్చాయి. అందుకే నరకచతుర్దశి నుంచే.. మన సుఖ, సంతోషాలను వ్యక్తంచేయడానికి నిదర్శనంగా దీపావళి జరుపుకోవడం ప్రారంభించాం. దీపం అంటే వెలుగు, కాంతి, జ్ఞానం, ఆశ, ప్రాణం. దీపం వెలిగించటమంటే ప్రాణం పోయటమే. అందుకే ఏ పని అయినా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించుతాం. దురదృష్టవశాత్తూ కాలుష్యం వెదజల్లే బాణాసంచా పేలుళ్ళతో దీపావళి వాస్తవ విశిష్టత..ఉనికి ప్రమాదంలో పడుతోంది. శబ్ద కాలుష్యంతో పాటు పర్యావరణాన్ని పాడుచేసే బాణాసంచా పేలుళ్లకు స్వస్తి చెబుదాం. కరోన కష్టాలు తెచ్చిపెట్టిన చీకట్లు తొలగిపోతున్న తరుణంలో వచ్చిన దీపావళి.. అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రార్ధిద్దాం. లక్ష్మీ స్వరూపం అయిన దీపాలను వెలిగించి ‘ హరిత దీపావళి ‘ ని ఆనందంగా జరుపుకుందాం. ఈ హరిత దీపావళి సందర్భంగా మనమంతా సరికొత్త ప్రక్రియకు శ్రీకారం చుడదాం.. మనం ఎవరికైనా మనసు నొప్పించేలా చేస్తే దీపావళి నాడు జ్యోతిని వెలిగించి మనసులోనే మనస్ఫూర్తిగా వారిని క్షమాపణ కోరుకుందాం. మనలోని మనకి నచ్చని చెడు గుణాలని గుర్తించి..వాటిని ఓ కాగితం మీద రాసి జ్యోతికి ఆహుత�� ఇద్దాం. మనలోని చెడు గుణాలను తొలగించి నిష్కల్మషమైన మంచి గుణాలతో మన హృదయాన్ని నింపమని శ్రద్దాభక్తులతో భగవంతున్ని పూజించుదాం. ఈ దీపావళి పర్వదినం మీకు అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలను ప్రసాదించి .. సరికొత్త వెలుగులతో మీ జీవితం ప్రకాశించాలని మనసారా కోరుకుంటూ..మిత్రులు,శ్రేయోభిలాషులు, బ్రాండిక్స్ కుటుంబ సభ్యులు అందరికి హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు 🙏 దొరస్వామి భారతీయ భాగస్వామి, బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ #DoraSwamyPC #BrandixIndia #HappyDiwali https://www.instagram.com/p/CHjV423Hm5c/?igshid=ix9dfmmdod7t
0 notes
pcdoraswamy · 4 years
Photo
Tumblr media
గౌ|| శ్రీ బిపి ఆచార్య IAS గారికి హృదయ పూర్వక పదవీ విరమణ శుభాకాంక్షలు సివిల్ సర్వీసు అధికారి శ్రీ బిపి ఆచార్య IAS గారితో నాకు ఉన్న అనుబంధం మరపురానిది. ప్రజా సమస్యల పట్ల ఆయన స్పందించే తీరు.. నాకు, ఎంతో మందికి స్ఫూర్తిని అందించింది. శ్రీ బిపి ఆచార్య గారి కృషి, పట్టుదల, అంకితభావం, కార్యదక్షతలను దగ్గరగా చూసి.. నేర్చుకున్న ఎన్నో విషయాలు నా జీవితానికి అన్వయించుకుంటున్నాను. తన దగ్గరకి సాయం కోసం వచ్చిన ఎవరినైనా ఆదుకోవాలని.. ఆయన పడ్డ తపన కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపింది. అందుకే ఆయన అంటే నాకు అపారమైన ప్రేమ, భక్తిలతో కూడిన అభిమానం. కుల, మత, ప్రాంతీయ అభిమానాలు లేకుండా..నీతి, నిజాయితీలతో సామాన్యులకు అండగా నిలిచి..ఆదుకునే గొప్ప మనసున్న అధికారి శ్రీ బిపి ఆచార్య గారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ జనరల్ గా పదవీ విరమణ చేస్తున్న శ్రీ బిపి ఆచార్య గారు ఎన్నో ఉన్నత స్థాయి పదవుల్లో పనిచేసారు. 1983 లో సర్వీసులోకి వచ్చిన ఆయన భద్రాచలం డిప్యూటీ కలెక్టర్‌గా ప్రస్థానం ప్రారంభించారు. ఆ తరువాత వరంగల్ కలెక్టర్‌గా, వివిధ శాఖల్లో కీలక పదవులతో పాటు.. 2017 నుంచి ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చిత్తశుద్దితో తన బాధ్యతలని నిర్వర్తించారు. వివిధ శాఖల్లో అనేక కొత్త ఆవిష్కరణలకు తెరతీసి తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. ప్రభుత్వ పర్యాటక శాఖకు ప్రపంచవ్యాప్త గుర్తింపును తీసుకొచ్చారు. ఎన్నో అవార్డులు, రివార్డులు పొంది ప్రజల ఆదరాభిమానాలను పొందారు. APIIC మేనేజింగ్ డైరెక్టర్ గా తెలుగు రాష్ట్రాల్లో శ్రీసిటీ, జీనోమ్ వ్యాలీ, Financial District, Mindspace IT Park, బ్రాండిక్స్, ఫార్మాసిటీ వంటి 20కి పైగా ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన IT Clusters, పారిశ్రామిక వాడల ఏర్పాటుకు గాను శ్రీ బిపి ఆచార్య ఎంతో కృషి చేసారు. ఆయన అందించిన సేవలు, కృషి ఫలితంగా 40 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించాయి. సివిల్ సర్వీస్ అధికారిగా 37 ఏళ్లకు పైగా అహరహం శ్రమించిన ఆచార్య గారు అందించిన విలువైన సేవలు, స్ఫూర్తివంతమైన పని తీరు ప్రతీ ఒక్కరికి ఆదర్శనీయం. శ్రీ బిపి ఆచార్య గారు ప్రభుత్వ అధికారిగా నేడు పదవీ విరమణ చేస్తున్నా.. ఆయన మస్తిష్కం నిరంతరం ఇతరులకు సాయం చేసేందుకు తపన పడుతూనే వుంటుంది. ఆచార్య గారిపై ఆ భగవంతుని అనుగ్రహం నిరంతరం ఉండాలని.. తన అనుభవాలు, ఆలోచనల���ో మరెంతో మందిని ఆదుకునే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాను. దొరస్వామి భారతీయ భాగస్వామి, బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ #DoraSwamyPC #BrandixIndia https://www.instagram.com/p/CHBBTtGHr3N/?igshid=kn756e0s65kp
0 notes
pcdoraswamy · 4 years
Photo
Tumblr media
విజయ దశమి సందర్భంగా బ్రాండిక్స్ సంస్థలో అక్కచెల్లెలు వంటి మహిళా ఉద్యోగులతో నేను సమావేశం కావడం..అమ్మవారి ఆశీస్సులు అందరి మీదా వుండాలని కోరుకుని వారి నుంచి ఆశీస్సులు పొందడం సంతోషంగా వుంది. బ్రాండిక్స్ లో Ribest Ribbons & Bows India Pvt Ltd సంస్థ ఉద్యోగులతో జరిగిన సమావేశం సందర్భంగా సోదరీమణుల్లో కనిపించిన ఆత్మవిశ్వాసం..మునుపటి ఉత్సాహం ఆనందంగా అనిపించింది. కోవిడ్ కష్ట కాలంలో అమ్మవారి అనుగ్రహానికి...బ్రాండిక్స్ సంస్థ మహిళా శక్తి సంకల్పం తోడైంది. కరోన విపత్కర పరిస్థితులను నెమ్మదిగా అధిగమించడంలో మహిళా ఉద్యోగులు చూపిన చొరవకు అభినందనలు తెలియజేశాను. ఈ సమావేశంలో పూడిమడకకు చెందిన సహోదరి జ్యోతి వివాహం సందర్భంగా ఆమెకు పెళ్లి దుస్తులు కానుకగా బహూకరించి నాతో పాటు మహిళా ఉద్యోగులంతా ఆశీర్వాదాలు అందించి... శుభాకాంక్షలు తెలియజేయడం ఆనందదాయకంగా వుంది. ఇలాంటి స్నేహపూర్వక వాతావరణంతో బ్రాండిక్స్ సంస్థను ముందుకు నడిపించడంలో అమ్మవారి అనుగ్రహం మనందరి మీదా ఉంటుందని ఈ సందర్భంగా నేను వారికి చెప్పడం జరిగింది. దుర్గామాత అమ్మవారి అనుగ్రహం అందరి మీదా వుండి ..ఎవరికీ ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా సంస్థను ముందుకు నడిపించడంలో కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశాను. మహిళలు ఎక్కడ ఆనందంగా ఉంటారో ..అక్కడ దేవతలు విహరిస్తారనే విషయానికి మా బ్రాండిక్స్ మహిళా ఉద్యోగులు నిదర్శనంగా నిలుస్తున్నారు. మహిళా శక్తితో నడుస్తున్న ఈ సంస్థలో నేను కూడా ఒక భాగస్వామిగా వుండడం నా పూర్వజన్మ సుకృతం. ఇదే శ్రద్ధతో ..భక్తితో సంస్థను, మహిళలను కాపాడుకుంటామని .. వారికి నిరంతరం అండగా ఉంటామనే భరోసా బ్రాండిక్స్ సంస్థ తరుపున ఇవ్వడం జరిగింది. దొరస్వామి భారతీయ భాగస్వామి, బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ #DoraSwamyPC #BrandixIndia https://www.instagram.com/p/CG4JL5KH2V-/?igshid=uocgm8hqzodm
0 notes
pcdoraswamy · 4 years
Photo
Tumblr media
దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతోః స్వస్థైః స్మృతా మతి మతీవ శుభాం దదాసి I దుర్గా మాతా.. నిన్ను స్మరించినంతనే అశేష ప్రాణి కోటి భయాలను హరిస్తావు. నిన్ను అత్యధిక భక్తితో ధారణ చేసే వారికి శుభాభ్యుదయాలను అశేషంగా అనుగ్రహిస్తావు అని ఈ శ్లోకం అర్ధం. అమ్మవారి అనుగ్రహంతో విజయనగరం జిల్లా సారిక గ్రామంలో నేను నిర్మించిన ఇష్ట కామేశ్వరీ, త్రిపుర సుందరిదేవి అమ్మవారి ఆలయంలో శరన్నవ రాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రులను పురస్కరించుకుని అమ్మవారి కటాక్షం కోసం నిష్టగా పూజలు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగిన నాకు.. ఎనిమిదో రోజు మహాగౌరీ మాతగా కొలువుతీరిన అమ్మవారిని ప్రత్యక్షంగా దర్శించుకునే మహాదావకాశం కలిగింది.ఆలయంలో మహాగౌరి శ్రీ దుర్గాదేవి అలంకారంలో వున్న అమ్మవారికి వేద మంత్రోచ్చరణలతో పూజలు నిర్వహించాను. వేలాది మంది మహిళా శక్తితో ప్రజ్వరిల్లే బ్రాండిక్స్ సంస్థకు అమ్మవారి కృప.. ఆశీస్సులు నిరంతరం వుండాలని ప్రార్ధించాను. ఈ దర్శనం సందర్భంగా సాదర ఆహ్వానం పలికి నన్ను అత్యంత శ్రద్ధతో గౌరవించిన సారిక గ్రామ పెద్దలు, వేద పండితులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. దుర్గాష్టమి రోజున దుర్గతులను దూరం చేసే శ్రీ దుర్గా దేవిమాతను దర్శించుకుంటే..భయం దూరమై శాంతి సౌభాగ్యాలు లభిస్తాయి. దుర్గాదేవి ఆది ప్రకృతి.. పంచ మహా స్వరూపాల్లో మొదటిది. భక్తి ప్రవత్తులతో పూజించినవారికి అమ్మవారు సమస్త గ్రహ బాధలు, దుష్ట గ్రహ బాధలన్నీ తొలగించి.. సకల సౌభాగ్యాలతోపాటు మనశ్శాంతిని సిద్ధింపజేస్తుంది. దొరస్వామి భారతీయ భాగస్వామి, బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ #DoraSwamyPC #BrandixIndia https://www.instagram.com/p/CGyu6pvHbKh/?igshid=tv8kvryhthyw
0 notes
pcdoraswamy · 4 years
Photo
Tumblr media
శాంతి కర్మాణి సర్వత్ర తధా దుః స్వప్న దర్శనీ ! గ్రహ పిదాసు చోగ్రసు మహాత్మ్యాన్ శృణుయాన్మం !! పీడ కలలు, మానసిక భయాలు మరియు చెడు శోషణల మీద విజయం సాధించడానికి దుర్గా మాత అమ్మవారి ఈ అద్వితీయ మంత్రం భక్తులకు గొప్ప సానుకూల ఫలితాలను ఇస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో విజయనగరం జిల్లా సారిక గ్రామంలో నేను నిర్మించిన ఇష్ట కామేశ్వరీ, త్రిపుర సుందరిదేవి అమ్మవారి ఆలయంలో శరన్నవ రాత్రి ఉత్సవాలు అత్యంత వైభవం జరుగుతున్నాయి. ఏడో రోజు అమ్మవారు అత్యుగ్ర రూపము మహిషాసుర మర్ధినీ దేవి అలంకారంతో భక్తులకు అపురూపంగా దర్శనమిచ్చారు. దేవీ నవరాత్రులలో. ఆశ్వయుజ శుధ్ధ నవమి రోజున అమ్మ మహిషాసుర మర్ధినిగా అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసింది. ధర్మ విజయమునకు సంకేతముగా ఈ పర్వదినాన్ని మహర్నవమిగా భక్తులు ఉత్సవంగా జరుపుకుంటున్నాము. ఈ మహర్నమినాడు అమ్మను స్తుతించినవారికి సకల వ్యాధుల బారినుండి కాపాడి సంపూర్ణ ఆరోగ్యాన్నిస్తుంది, అపమృత్యువును పోగొడుతుంది, పరిపుష్టికరమైన ఆహారాన్నిస్తుంది, ఆధ్యాత్మిక విజ్ఞానాన్నిచ్చి, మనిషిలోని దైవీశక్తిని పెంపొందిస్తుంది 🙏 . దొరస్వామి భారతీయ భాగస్వామి, బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ #DoraSwamyPC #BrandixIndia https://www.instagram.com/p/CGv65HEnJ96/?igshid=18oztwv18ph9p
0 notes
pcdoraswamy · 4 years
Photo
Tumblr media
శాంతి కర్మాణి సర్వత్ర తధా దుః స్వప్న దర్శనీ ! గ్రహ పిదాసు చోగ్రసు మహాత్మ్యాన్ శృణుయాన్మం !! పీడ కలలు, మానసిక భయాలు మరియు చెడు శోషణల మీద విజయం సాధించడానికి దుర్గా మాత అమ్మవారి ఈ అద్వితీయ మంత్రం భక్తులకు గొప్ప సానుకూల ఫలితాలను ఇస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో విజయనగరం జిల్లా సారిక గ్రామంలో నేను నిర్మించిన ఇష్ట కామేశ్వరీ, త్రిపుర సుందరిదేవి అమ్మవారి ఆలయంలో శరన్నవ రాత్రి ఉత్సవాలు అత్యంత వైభవం జరుగుతున్నాయి. ఏడో రోజు అమ్మవారు అత్యుగ్ర రూపము మహిషాసుర మర్ధినీ దేవి అలంకారంతో భక్తులకు అపురూపంగా దర్శనమిచ్చారు. దేవీ నవరాత్రులలో. ఆశ్వయుజ శుధ్ధ నవమి రోజున అమ్మ మహిషాసుర మర్ధినిగా అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసింది. ధర్మ విజయమునకు సంకేతముగా ఈ పర్వదినాన్ని మహర్నవమిగా భక్తులు ఉత్సవంగా జరుపుకుంటున్నాము. ఈ మహర్నమినాడు అమ్మను స్తుతించినవారికి సకల వ్యాధుల బారినుండి కాపాడి సంపూర్ణ ఆరోగ్యాన్నిస్తుంది, అపమృత్యువును పోగొడుతుంది, పరిపుష్టికరమైన ఆహారాన్నిస్తుంది, ఆధ్యాత్మిక విజ్ఞానాన్నిచ్చి, మనిషిలోని దైవీశక్తిని పెంపొందిస్తుంది 🙏 . దొరస్వామి భారతీయ భాగస్వామి, బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ #DoraSwamyPC #BrandixIndia https://www.instagram.com/p/CGv59smn0a3/?igshid=3lyentk6tx4m
0 notes
pcdoraswamy · 4 years
Photo
Tumblr media
ఓం సర్వబాధా వినిర్ముక్తో, ధనధాన్య సుతాన్వితా । మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయా ఓం ॥ మహాలక్ష్మి దేవీ .. చెడునంతా అంతం చేసి మమ్మల్ని కాంతివంతమైన.. సుఖసంతోషాలతో కూడిన భవిష్యత్తులోకి నడిపించు తల్లీ అని ఈ శ్లోకం అర్ధం. అమ్మవారి అనుగ్రహంతో విజయనగరం జిల్లా సారిక గ్రామంలో నేను నిర్మించిన ఇష్ట కామేశ్వరీ, త్రిపుర సుందరిదేవి అమ్మవారి ఆలయంలో శరన్నవ రాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా.. కన్నులపండువగా కొనసాగుతున్నాయి. ఆరో రోజు అమ్మవారు సర్వమంగళకారిణి, ఐశ్వర్య ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి దేవ��� అలంకారంతో విరాజిల్లుతూ.. భక్తులకు అపురూపంగా దర్శనమిచ్చారు. మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. సిరి సంపదలకు, సౌభాగ్యానికి, సుఖసంతోషాలకు, ధైర్య సాహసాలకు, విజయానికి అధిదేవత. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మిగా శ్రీ మహాలక్ష్మి దేవి భక్తులను కరుణిస్తుంది. శరన్నవరాత్రుల్లో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ సౌభాగ్యాలతో.. భక్తుల అభీష్టాలను అమ్మవారు సిధ్ధింప చేస్తుంది 🙏 దొరస్వామి భారతీయ భాగస్వామి, బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ #DoraSwamyPC #BrandixIndia https://www.instagram.com/p/CGtSLhRHV9j/?igshid=enssaeqmr157
0 notes