Tumgik
#నృత్య ప్రదర్శన
mplanetleaf · 3 months
Video
youtube
నృత్యప్రదర్శన - ఆనందజ్యోతి Episode 41 | Anandajyoti Folklore Novel | SMBAB
0 notes
ammanews · 1 year
Video
youtube
Hyderabad : ఉప్పల్ శిల్పారామంలో 777 మందితో సామూహిక నృత్య ప్రదర్శన..! Upp...
0 notes
moneymava · 3 years
Text
'14 Phere' stars Kriti Kharbanda-Vikrant Massey reveal their hilarious college ragging stories
’14 Phere’ stars Kriti Kharbanda-Vikrant Massey reveal their hilarious college ragging stories
కృతి ఖర్బండా మరియు విక్రాంత్ మాస్సే ఇటీవల విడుదలైన `14 పెరే` చిత్రం తెరపై ప్రధాన పాత్ర పోషించారు. కథ యొక్క ప్రాధమిక ఆవరణ ర్యాగింగ్ చివరికి ప్రేమకథగా ఎలా మారిందనే దాని చుట్టూ తిరుగుతున్నప్పుడు, IANS తో సంభాషణలో, ప్రధాన నటులు – కృతి మరియు విక్రాంత్ – ఒక తరగతి పోరాటం మరియు తక్షణ నృత్య ప్రదర్శన వారి అందమైన స్నేహంగా ఎలా మారిందో పంచుకుంటారు నిజ జీవితంలో తిరిగి కాలేజీ రోజుల్లో. తన రోజులను…
Tumblr media
View On WordPress
0 notes
skdnews · 4 years
Video
youtube
అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని ఎర్రమంచిలో ఏర్పాటైన కియా మోటార్స్​ ఇండియా... సీఎస్​ఆర్​ (కార్పొరేట్​ సామాజిక బాధ్యత)లో భాగంగా కురుబ వాండ్ల పల్లిలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. కురుబవాండ్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామాలనూ అభివృద్ధి చేయాలని కోరారు. ఫ్లోరైడ్ అధికంగా ఉన్న గ్రామాల్లో రక్షిత మంచినీటి కేంద్రాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్ఎల్ ఇండియా బెటర్ వరల్డ్ కొరియా వాలంటీర్స్, కురుబవాండ్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు నిర్వహించిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. by SKD NEWS
0 notes
ecomyindia · 4 years
Video
youtube
బామ్మ నీ చీర కట్టు చూపులన్ని విద్యార్థినిల కోలాట నృత్య ప్రదర్శన | Kolata...
0 notes
Photo
Tumblr media
మయా బజార్ కు షష్టి పూర్తి వే��ుక.. తెలుగు చలన చిత్ర సీమే కాదు.. భారతీయ చిత్రసీమలోనే మేరు శిఖరం లాంటి సిినిమా మాయా బజార్‌. పేరు దగ్గర్నుంచి అంతా కాల్పనికతే. ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌, ఎస్వీఆర్‌, సావిత్రి వంటి మహామహులతో రూపొందిన ఫ్యాంటసీ మూవీ ఇది. పాండవులు లేకుండా భారతంలో శశిరేఖ అనే పాత్రను స ష్టించి దాని చుట్టూ అల్లిన కథ ఇది. చిత్రం విడుదలై 60వ ఏడు నడుస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సాహితీ సంగీత సమాఖ్య మాయాబజార్‌ షష్టిపూర్తి వేడుకను హైదరాబాద్‌లో ఈరోజు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తెలుసుకునేందుకు ప్రముఖ క్యారెక్టర్‌ నటుడు రావి కొండలరావును ఆంధ్ర ప్రభ పలకరించింది. సినిమా రంగంలో ప్రస్తుతం ఆయనే సీనియర్‌ నటుడు. కేవీ రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు, బాపు, రమణ, వంటి హేమాహేమీలతో సన్నిహితంగా మెలిగారు. సినిమా రంగంలో ఆయనకు తెలియని అంశం లేదంటే అతిశయోక్తి కాదు. విజయచిత్ర సంపాదకుడిగా ఆయన మాయా బజార్‌ చిత్రాన్ని కథగా మార్చి సీరియల్‌గా ప్రచురించారు. మళ్ళీమళ్ళీ ప్రచురించారు. మాయాబజార్‌ను అణువణువూ స్ప శించి, పరవశించిన రావి కొండల రావు మాటల్లో ఆ చిత్ర విశేషాలు… మార్చి 27 1957న విడుదలైన మాయాబజార్‌ చిత్రం వివరాలు ఆసక్తిని గొలుపుతాయి. పింగళి నాగేంద్రరావు ద్వారా వీటిని తెలుసుకున్నాను. విజయచిత్ర పత్రికకు సంపాదకునిగా ఉన్న సమయంలో నేను ఆ కథను తిరగరాసి, సీరియల్‌గా ప్రచురించాను. 26ఏళ్ళు విజయచిత్రకి పనిచేశాను. సీరియల్‌ను పుస్తకంగా ప్రచురించాం. ఎన్నిసార్లు వేసినా దాని ఆదరణ చెక్కు చెదరలేదు.మాయాబజార్‌ కల్పిత కథ. మహా భారతంలో శశిరేఖ అనే పాత్రే లేదు. అన్ని భాషల్లోనూ తొలుత దీన్ని నాటకంగా వేశారు. సురభి వారు కూడా ఈ ప్రదర్శన చేపట్టేసరికి, విజయా వారి దృష్టిని ఆకర్షించింది. వారు సినిమా తీయాలని సంకల్పించారు. పెద్ద నటులను ఎంపిక చేసుకుని, పాత్రలకు తగ్గట్టుగా స్క్రీన్‌ ప్లే సిద్ధం చేసుకున్నారు కెవి రెడ్డిగారు. షెడ్యూలు కూడా నిర్ణయిం చుకున్నారు. అందరికీ కాల్‌షీట్లూ ఇచ్చేశారు. సినిమా తీసే ముందు మొత్తం సినిమాకు బడ్జెట్‌ వేసుకోవడం రెడ్డి గారికి అలవాటు. ఆరోజుల్లోనే మొత్తం 26 లక్షల రూపాయలు ఖర్చవుతుం దని తేలిం దట. దీన్ని చూసి, నాగిరెడ్డి, చక్రపాణి ఐదు లక్షలకో సినిమా తీయొచ్చు. ఇంత ఖర్చుతో సినిమా అనవసరం అనే సరికి, కెవి రెడ్డిగారు ఖిన్నుల య్యారు. తీయ డానికి జంకారు. కొన్నాళ్ళు ఆయన అసలు బయటకే రాలేదు. గెడ్డం గీయడం కూడా మానేశారు. ఈ లోగా నాగేశ్వరరావుగారు రెడ్డిగారు కనబడటం లేదేమిటని వాకబు చేశారు. మిగిలిన నటులూ ఆయనను సంప్రతించడం ప్రారంభించారు. ఏవీఎం వారు కూడా ఇదే కథతో చిత్రం తీయాలనుకుంటున్నారనీ, మీరు తీయనని చెబితే వారి వద్దకు వెడతామని నటులు అనడంతో నాగిరెడ్డి, చక్రపాణి ఆలోచనలో పడ్డారు. ఏవీఎమ్‌ చెట్టియార్‌ కూడా మీరు తీయకపోతే.. స్క్రిప్ట్‌ మాకిచ్చేయండి..మేమే తీస్తామని అడిగారు. ఈ కథపై ఎందుకింత ఆసక్తి. ఏముంది ఇందులో అని నాగిరెడ్డి, చక్రపాణి మరోసారి కథ చదివి పచ్చ జెండా ఊపారు. అలా ఒడిదొడుకుల మధ్య ప్రారంభమైన మాయా బజార్‌ చిత్రాన్ని ఒకేసారి రెండు భాషల్లో.. తెలుగు, తమిళం….తీశారు. మొదటి వారం రోజులూ ఖాళీగా ఉన్న థియేటర్లు ఆపై ఇసుకేస్తే రాలనంత జనంతో కిటకిట లాడిపోయాయి. మార్చి 27న తెలుగు, ఏప్రిల్‌ 12న తమిళ చిత్రాలను విడుదల చేశారు. తమిళ ప్రేక్షకుల కోసం కొందరు తమిళ నటులను తీసుకున్నారు. కెవి రెడ్డిగారు సినిమా తీయడం లో చాలా స్ట్రిక్ట్‌. షూటింగ్‌ సమయంలో చాలా కచ్చితంగా వ్యవహరి స్తారు. సెట్‌లో చిన్న శబ్దం కూడా రాకూడదు. ఆయననుకున్నది రాసుకొచ్చి, దాని ప్రకారం సినిమా తీస్తారు. మాయా బజార్‌ అంశంలో మరింత శ్రద్ధగా పనిచేశారు.బార్ట్లేదే కీలక పాత్రసినిమా అంతా సినిమాటోగ్రాఫర్‌ మార్కస్‌ బార్ట్లేనే కనిపిస్తాడు. అలాగే.. ఆర్ట్‌ డైరెక్టర్‌ గోఖలే. చేతికి పెట్టుకునే ఉంగరం ఎలా ఉండాలో సైతం ఆయన చిత్రం గీసి చూపించేవారు. అణువణువూ ఆయన చిత్రాల ఆధారంగానే చిత్రీకరణ సాగింది. అన్నీ స్కెచెస్‌ వేసుకున్నారు.వినోదమే ప్రధానం..కథ ఒక పక్క నడుస్తున్నప్పటికీ ఆద్యంతం వినోదాత్మకంగా ఉండేలా సినిమాను తీర్చిదిద్దారు. ఎస్వీఆర్‌ ఘటోత్కచుడిగా ప్రాణం పోశారు. నాగేశ్వరరావుగారు సరే సరి… అభిమన్యుడిగా అద్వితీయంగా నటించారు. సినిమాకి మొదట రాజేశ్వరరావుగారు సంగీత దర్శకుడు. కానీ ఆయన ఒక నాలుగు చరణాలు చేసి, సినిమా నుంచి తప్పుకున్నారు. అప్పుడా బాధ్యతల్ని ఘంట సాలగారు తీసుకున్నారు. పసుమర్తిగారు నృత్య దర్శకత్వం చేపట్టారు. సినిమా కోసం మొత్తం 28 సెట్లు ప్రత్యేకంగా నిర్మించారు. అన్నీ కొత్తవే.ఒక స్కూల్‌లాగా ఉండేది…చిత్ర యూనిట్‌ మొత్తం ఒక స్కూల్‌ లాగా ఉండేది. డ్యాన్సర్లు, ఫైటర్లు అంతా నెలజీతాలు. వాళ్ళు బయటెక్కడా పనిచేయకూడదు. వీళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి. స్కూలుకొచ్చినట్లు ఉదయం 9గంటల కల్లా వచ్చేయాలి. ఒక ఫ్లోర్‌లో డ్యాన్సర్లు, ఒక ఫ్లోర్‌లో ఫైటర్లు ఇలా ఎవరి రిహార్సల్స్‌ వాళ్ళు చేసుకునే వారు.విజయావారి చంద్రుడనే పేరొచ్చింది…మార్కస్‌ బార్ట్లే గారి విధానమే వేరు. ఆయన వెన్నెలను చిత్రీకరించే విధానం అత్యద్భుతంగా ఉండేది. ఎంతగా అంటే పున్నమి చంద్రుణ్ణి చూసి, ఇవాళ చంద్రుడు విజయా వారి చంద్రుడిలా ఉన్నాడనుకునేటంతగా ఉండేది. లాహిరి..లాహిరి…లాహిరిలో అంటూ తీసిన పాట ఇందుకు ఉదాహరణ. విజయా చిత్రాల్లో పున్నమి వెన్నెలతో ఒక పాట తప్పని సరిగా ఉంటుంది. లేకుండా సినిమా ఉండదు. లాహిరి..పాటను.. అస్సలు వెన్నెల్లోనే తీయలేదు. చెన్నైలోని అడయార్‌ నదిలో తీశారు. సూర్య కిరణాల్ని చంద్ర కిరణాల్లా మార్చేశా డాయన. పట్టపగలు ఆయన చేసిన ఈ చిత్రీకరణ ఇప్పటికీ హైలైటే. బ్యాక్‌ లైట్‌తో ఇలాంటివి ఆయన తీసేవారు. వెనక చెట్లు, ఇతర దృశ్యాలూ కనిపించేలా తెల్లటి తెర వేసి, దానికి తగ్గట్టుగా లైటింగ్‌ ఏర్పాటు చేసి తీస్తారు. అచ్చం వెన్నెల ఎఫెక్టును తెస్తారు. కొంత మాత్రమే అవుట్‌ డోర్‌. రెల్లు తుప్పల మీద వెలుతురు పడుతుంటే వెన్నెల్లా గోచరిస్తుంది. ఎక్కడా లైటింగ్‌ తేడా ఉండదు. యూని ఫార్మిటీ మెయిన్‌టైయిన్‌ చేశారు. అందుకే ఆ పాట అంత హిట్టయ్యింది. ఆయన స్కిల్‌ ఇందు కు కారణం. మార్కస్‌ బార్ట్లే ఆంగ్లో ఇండియన్‌. విజయాలో నెలజీతగాడు. తొలుత టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు బోంబేలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు. విజయాలో పనుంటే నాకు వేరే చోట పనుందని తప్పించుకోవడానికి వీలులేదు. ఇక్కడ పనిలేకపోతేనే వేరే సినిమాకి వెళ్ళాలి. ఆయన కూడా అంత కచ్చితంగానే నిబంధనలు పాటించేవారు. ప్రతి షాట్‌ ఆయన స్వయంగా షూట్‌ చేసేవారు. ఇప్పటి వాళ్ళ మాదిరిగా ఒకసారి కెమెరాలోకి చూసి, అసిస్టెంట్‌కు అప్పగించేవారు కాదు. తొలుత ఆయన ఒక తమిళ చిత్రానికి పనిచేశారు. అనంతరం స్వర్గసీమ చిత్రంతో విజయాలో అడుగుపెట్టారు. షావుకారు, పాతాళభైరవి, మిస్సమ్మ, అన్నింటికీ ఆయనే కెమెరా మేన్‌.బార్ట్లేకు పురాణాలు తెలియవు…మార్కస్‌ బార్ట్లేకు పురాణాలు తెలీవు. పిక్చర్‌కు ముందు కథంతా వింటారు. ఏ పాత్ర ఏమిటి? ప్రాధాన్యత ఏమిటి? కృష్ణుడెవరు? అభిమన్యుడెవరు? ఇద్దరికీ మధ్య బంధుత్వమేమిటి? శశిరేఖకీ వీ రికీ సంబంధమేమిటి? ఇలా ప్రతి అంశాన్నీ సునిశితంగా తెలుసుకున్నారు. సీనుకు ముందు కూడా ఆ సీనేమిటి.. ఎవరెవరు ఏ క్యారెక్టర్‌ వేస్తున్నారు అనేవి క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఆయనకు పిక్చర్‌ కు ముందే కథంతా ఇంగ్లీషులో చెప్పాలి. సినిమాలో ఆయన ఎంత ఇన్వాల్వ్‌ అయ్యేవా డనడానికి ఇదే ఉదాహరణ. అందుకే ఆయన ఫొటోగ్రఫీ అంత అద్భుతంగా వచ్చేది. ఆయన ఇన్వాల్వ్‌మెంట్‌కు శకుని పాత్ర ఓ ఉదాహరణ. శకుని పాత్ర గురించి తెలుసుకోగానే.. అతడిలో క్రూరత్వం చూపించడానిక��� ఆ పాత్రధారి కాళ్ళ దగ్గర్నుంచి పైకి లైటింగ్‌ వేసి స్పెషల్‌ ఎఫెక్ట్‌ వచ్చేలా భయంకరంగా కనిపించేలా షూట్‌ చేసేవారు. ఆ లైటింగ్‌ చూడగానే ప్రేక్షకుడికి వీడు దుర్మార్గుడనే విషయం అర్థమయ్యేలా పాత్ర చిత్రీకరణ ఉండేది.గ్రాఫిక్స్‌ లేని కాలంలో అద్భుతాలుఆ రోజుల్లో గ్రాఫిక్స్‌ లేవు. చెప్పులు కదలడం, గిన్నెలు వరుసలో పరుగులు తీయడం, ఘటోత్కచుడు విందు ఆరగించడం.. వంటి సన్నివేశాలు బార్ట్లే ప్రతిభకు తార్కాణాలు. అత్యంత కష్టమైన షూటింగ్‌ ఇది. ఎంతో శ్రద్ధ పెట్టారు. ఆ శ్రద్ధే చిత్రం అద్భుతంగా రావడానికీ, ప్రేక్షకుల ఆదరణకు నోచుకోడానికీ కారణం. ఆర్ట్‌ డైరెక్షన్‌, ఫొటోగ్రఫీ, నటన.. అన్ని రంగాలూ అద్భుతంగా రాణించాయి. ఆరోజుల్లో ఈ సినిమా అంతగా ఆడుతుం దని ఎవరూ అనుకోలేదు. విపరీతమైన డబ్బొచ్చింది నిర్మాతలకి. ఇప్పటికీ అది కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.కెవి రెడ్డిగారి స్క్రీన్‌ప్లే ప్రభావమది..కెవి రెడ్డిగారి స్క్రీన్‌ ప్లే అతికినట్టుటుంది. ఏ ఫ్రేమూ ఇది అనవసరమే … అనిపించదు. దీని బదులు ఇలా చేస్తే బాగుండేదేమో అనిపించదు. ఇక్కడ ఏదో వెలితున్న ట్టుందనిపించదు. అంత కచి ్ఛతత్వంతో కెవి రెడ్డి స్క్రీన్‌ ప్లే తయారు చేసుకుంటారు. మాయా బజార్‌ ఆయన కచి ్ఛతత్వానికి పరాకాష్ట. ఆయన స్క్రీన్‌ ప్లే అంటే ప్రేక్షకులు మంత్రముగ్ధులై చూడా ల్సిందే. సినిమా ల్లో గొప్ప సినిమా ఏదీ అని అడిగితే.. ఎంతటి వారైనా మాయా బజార్‌ పేరే చెబుతారు. ప్రేక్షకుల సంగతి సరేసరి.పర్ఫెక్షన్‌ వల్లే ఇది సాధ్యమైంది. ఈ సినిమాకి ప్రాణం స్క్రీన్‌ ప్లే, సాహిత్యం.. సాహిత్యం అత్యద్భుతం. ఏ డైలాగ్‌ ఎంతుండాలో అంతే ఉంటుంది. అనవసరమైన అక్షరంఒకటి కూడా డైలాగ్‌లో ఉండదు.ప్రయోగాలతో రసకందాయం..సాహిత్యంలో మాయాబజార్‌ రచన మకుటాయమానం. పింగళి నాగేంద్ర రావు గారు చేసిన ప్రయోగాలు అద్భుతం. రాక్షసులకు నోరు తిరగదు కాబట్టి కొత్త కొత్త పదాలను సృష్టిం చారు. ఆయన రాసిన అస్మదీయులు పదమే నేడు పేపర్లలో వాడుతు న్నారు. ఎవరూ సృష్టించక పోతే కొత్త పదాలెలా పుడతాయన్న ఘటోత్క చుడి నోట పలికించిన డైలాగ్‌కు ప్రతి సారీ ప్రేక్షకుడు చప్పట్లు కొడతారు. వీరతాళ్ళు కొత్త ప్రయోగం. రాక్షసులకు ద్విత్వాక్షరాలు పలకవని ఇలా కొత్త పదాలను వదిలారు పింగళి గారు.మాయా బజార్‌లో హీరో ఎవరు?ఒకసారి నాగేశ్వరరావు గారు, మరికొందరు ప్రముఖులు కూర్చున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రస్తావన వచ్చింది. నాగేశ్వరరావుగారడిగారు.. ఈ చిత్రంలో హీరో ఎవరని? అందరూ తలో పేరూ చెప్పారు.. అభిమన్యుడని ఒకరు.. కృష్ణుడని ఒకరు.. ఘటోత్కచుడని మరొకరు.. ఆఖరుకు నాగేశ్వరరావే చెప్పారు ఎవ్వరూ కాదు. కెవి రెడ్డి.. ఆయన స్క్రీన్‌ ప్లే వల్లే చిత్రం అంత గొప్పగా వచ్చింది. అంత బాగా ఆడింది. ఆయనే హీరో అంటూ స్పష్టంచేశారు.చిత్రీకరణకు 8 నెలలు పట్టిందిమాయా బజార్‌ చిత్రీకరణకు ఎనిమిది నెలల సమయం పట్టింది. విజయా వారు ఏ షెడ్యూలునూ నెలకు పదిరోజులు మించి చేసేవారు కాదు. మిగిలిన 20 రోజుల్లో నటులు, సాంకేతిక బృందం వేరే చిత్రాలకు పనిచేసుకోవచ్చు. ఈ చిత్రానికి 60-70 కాల్షిdట్సు అంటే షూటింగ్‌ డేస్‌ తీసుకున్నారు.పింగళిది కొత్త ట్రెండ్‌..పండితులు ఆయన్ను చాలా విమర్శించారు. దుర్యోధనుడి కుమారుడు లక్ష్మణ కుమారుడు అంత ఫూలిష్‌గా ఎలా బిహేవ్‌ చేస్తాడని ప్రశ్నించారు. అంత కామెడీ చేసేశారేమిటని అడిగారు. అసలు భారతంలో శశిరేఖ పాత్రే లేదు. కల్పిత పాత్ర. ఇదే విషయాన్ని ఆయన దగ్గర ప్రస్తావ��స్తే.. లక్ష్మణ కుమారుడు ఫూల్‌ కాకపోతే మరేమిటి. గొప్ప యోధుడా. కురుక్షేత్ర యుద్ధంలో మొదటి బాణానికే చచ్చాడు. ఇతను బాణాన్ని ఎక్కుపెడుతుండగానే అవతలి వాడు ఒకే బాణంతో కొట్టి చంపేశాడు. అలాంటి వాణ్ణి యోధుడని ఎలా అంటాం. అందుకే ఆ పాత్రతో కామెడీ చేయించానని పింగళి చెప్పారు.ఘటోత్కచుడి ఆశ్రమానికి చేర్చమన్న డైలాగ్‌ ఒకటి రాశారు ఇందులో పింగళి. శశిరేఖను, సుభద్రనూ పంపుతూ దారుకుడు(రథం నడిపే వాడు)తో కృష్ణుడు ఈ డైలాగ్‌ చెబుతాడు. ఇక్కడే ఎవరూ గుర్తించలేని తమాషా ఉంది. ఘటోత్కచుడు రాక్షసుడు.. రాక్షసుడు గుహలో ఉంటాడు. పచ్చి రక్తమాంసాలు తింటాడు. అలాంటివాడు ఆశ్రమంలో ఉండడమేమిటి? అన్న ప్రశ్న వేసుకున్నవారికి ఆ ఆశ్రమం అన్న పదం ద్వారా ఘటోత్కచుడి సహజ స్వభావాన్ని తెలియచెప్పారు. రాక్షసులైనా అంతా మంచివారే అని చెప్పడానికి ఆశ్రమం అని వాడారు.శశిరేఖ రూపంలో ఘటోత్కచుడు ప్రవేశించినప్పుడు పిచ్చిపిచ్చిగా వ్యవహరించడం చూసిన వారు ఏమిటీ పిల్ల ఇలా చేస్తోంది… అంటే… ఈ కాలం పిల్లలు ఇంతే అన్నయ్యా అంటాడు కృష్ణుడు . దీన్ని కూడా విమర్శ కులు ప్రశ్నించారు. ఈ కాలం పిల్లలు ఇలా ఉన్నారా అని ప్రశ్నిస్తే ఈ కాలం పిల్లలు కాదు.. ద్వాపర యుగం నాటి కాలం పిల్లలు అని పింగళి చమత్కరించారు. ఒక్కొక్క పాత్రకీ ఒక్కొక్క తీరులో భాషను రాశారాయన. లాహిరీ అనే మాటని రామకృష్ణశాస్త్రి గారు దేవదాసులో ఉపయోగించారు. తరవాత దాన్ని పింగళి వాడారు.సురభి నుంచి తీసుకున్నారు..మల్లాది రామకృష్ణశాస్త్రి గారు సురభి వారికి మాయాబజార్‌ నాటకం రాసిచ్చారు.. సురభి నుంచి విజయా దీన్ని అడాప్ట్‌ చేసుకుంది. అనంతరం సురభి కంపెనీ సినిమా నుంచి కొన్ని పాటలను చేర్చుకుని, మెరుగులు దిద్దుకుంది. ఎన్నో భాషల్లో మాయా బజార్‌ను తీసినప్పటికీ.. తెలుగు సినిమాకు వచ్చిన పేరు దేనికీ రాలేదు. ఇప్పటికీ సురభి ఈ నాటకాన్ని ప్రదర్శిస్తోంది. పెద్ద మనుషులు, మాయా బజార్‌.. ఇలా ఏ సినిమా అయినా.. ఐశ్వర్యం ప్రధానం కాదు.. అనే సందేశమిచ్చారు కెవి రెడ్డిగారు . మాయా బజార్‌లో ఐశ్వర్యం పోతే పోయింది కానీ ప్రతాపాలు ఎక్కడికి పోతాయి అనే డైలాగ్‌ దీనికి తార్కాణం. శశిరేఖ పేరు అష్టాదశ పురాణాల్లో కూడా లేదు. తమిళం లో వత్సల, హిందీలో సురేఖ అని పేరు పెట్టారు. మిగిలిన క్యారెక్టర్లన్నీ ఒక్కటే. శశిరేఖ కల్పన కాబట్టే మిగిలిన భాషలలో మార్చుకున్నారు. వందేళ్లు సినిమాలో అగ్రతాంబూలం.. 1913లో హరిశ్చంద్ర మూకీ సినిమా వచ్చిం ది. అప్పటి నుంచి వందేళ్ళు అంటే 2013వరకూ వచ్చిన చిత్రాలలో ఏది మేలైన చిత్రమని ఏబీఎన్‌, సిఎన్‌ఎన్‌ చానెల్స్‌ భారత్‌లో ఓటింగ్‌ నిర్వహించాయి. 30వేల మంది ఓటేశారు. మాయాబజార్‌ మొట్టమొదటి చిత్రంగా నిలిచింది. 20వేల మంది దానికి ఓట్లేశారు. పథేర్‌ పాంచాలీ నాలుగో స్థానంలోనూ, షోలే పదో స్థానంలోనూ నిలిచాయి. మన తెలుగు చిత్రం మొదటిగా నిలవడం గొప్ప విషయం. అంటే దానికి తిరుగు లేదు. విడుదలై అరవై ఏళ్ళయినా ఇప్పటికీ చూస్తున్నారు. రామారావుని ఒప్పించేందుకు నాటకం.. మాయా బజార్‌ సినిమాలో కృష్ణుడి పాత్రకు ఎన్టీఆర్‌ను ఒప్పిం చడానికి కెవి రెడ్డిగారు నాటకమాడిం చాల్సి వచ్చింది. దీనికి ముందే ఓ సినిమాలో ఎన్టీఆర్‌ కృష్ణుడి పాత్ర వేశారు. అందులో ఆయన పాత్ర అంతగా బాగోలేదు. కృష్ణుడిగా నప్పలేదు. ఏదో దొరికిన కిరీటం పట్టుకొచ్చి, పెట్టేసి మమ అనిపించేశారు. ఆ పాత్రపై విమర్శ లొచ్చేసరికి ఎన్టీఆర్‌ మాయా బజార్‌లో కృష్ణ పాత్రకు వెనుకంజ వేశారు. ఎవరెంత చెప్పినా వినలేదు. ఇలాక్కాదని కెవి రెడ్డి గారు, నాగేంద్ర రావుగారు కలిసి నాటకమాడించారు. ఎన్టీఆర్‌కు కృష్ణుడిగా మేకప్‌ వేశారు. ఆయన బయటకొస్తున్నప్పుడు సెట్‌లో ఉన్న వారినందరినీ ఆయన కాళ్ళపై పడి, సాక్షాత్తూ కృష్ణ పరమాత్మలా ఉన్నారంటూ ప్రశంసించమనీ, దండాలు పెట్టమని కోరారు. వర్కర్స్‌ అంతా అలా చేసే సరికి ఎన్టీఆర్‌కు ఆ పాత్రపై నమ్మకం కలిగింది. ఆ చిత్రంతోనే ఆయన కృష్ణుడిగా స్థిరపడిపోయారు. అప్పటిదాకా నేను బాగుండను.. నేను బాగుండను అన్న ఎన్టీఆర్‌ మాట్లాడకుండా నటించారు. ఆయన కోసం రకరకాలుగా ఐదు కిరీటాలు తయారు చేయించారు. ఎన్టీఆర్‌ ముఖానికి తగ్గట్టుగా వాటిని ర��పొందిం చారు. నగలు, చెవి పోగులు.. అన్నీ పెట్టి నాటకమాడి ఆయనలో విశ్వాసాన్ని ప్రేరేపించారు. -సుబ్రహ్మణ్యం విఎస్‌ కూచిమంచి
0 notes
skdnews · 4 years
Video
youtube
అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని ఎర్రమంచిలో ఏర్పాటైన కియా మోటార్స్​ ఇండియా... సీఎస్​ఆర్​ (కార్పొరేట్​ సామాజిక బాధ్యత)లో భాగంగా కురుబ వాండ్ల పల్లిలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. కురుబవాండ్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామాలనూ అభివృద్ధి చేయాలని కోరారు. ఫ్లోరైడ్ అధికంగా ఉన్న గ్రామాల్లో రక్షిత మంచినీటి కేంద్రాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్ఎల్ ఇండియా బెటర్ వరల్డ్ కొరియా వాలంటీర్స్, కురుబవాండ్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు నిర్వహించిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. by SKD NEWS
0 notes
ecomyindia · 4 years
Video
youtube
దుమ్ము లేపిన ఇంజనీరింగ్ కాలేజ్‌ విద్యార్థినిల కోలాట నృత్య ప్రదర్శన | Kol...
0 notes